1 ULB అందుకు తేమానీయుడు ఎలీఫజు ఇలా జవాబిచ్చాడు. BSB BSB: Then Eliphaz the Temanite replied:
2 ULB ఎవరైనా ఈ విషయం గురించి నీతో మాట్లాడితే నీకు చిరాకు కలుగుతుందా? అయితే నీతో మాట్లాడకుండా నిదానంగా ఎవరు ఉంటారు? BSB BSB: “If one ventures a word with you, will you be wearied? Yet who can keep from speaking?
3 ULB నువ్వు చాలా మందికి బుద్ధినేర్పించావు. అనేకమంది నిస్సహాయులను బలపరిచావు. BSB BSB: Surely you have instructed many, and have strengthened their feeble hands.
4 ULB దారి తప్పిన వాళ్ళను నీ మాటలతో ఆదుకున్నావు. మోకాళ్లు సడలిన వాళ్ళను బలపరిచావు. BSB BSB: Your words have steadied those who stumbled; you have braced the knees that were buckling.
5 ULB అయితే ఇప్పుడు నీకు కష్టం కలిగినప్పుడు దుఃఖంతో అల్లాడుతున్నావు. నీకు కలిగిన కష్టం వల్ల తల్లడిల్లిపోతున్నావు. BSB BSB: But now trouble has come upon you, and you are weary. It strikes you, and you are dismayed.
6 ULB నీకున్న భక్తి నీలో ధైర్యం కలిగించదా? నిజాయితీ గల ప్రవర్తన నీ ఆశాభావానికి ఆధారం కాదా? BSB BSB: Is your reverence not your confidence, and the uprightness of your ways your hope?
7 ULB జ్ఞాపకం చేసుకో, నీతిమంతుడు ఎప్పుడైనా నాశనం అయ్యాడా? నిజాయితీపరులు ఎక్కడైనా తుడిచి పెట్టుకుపోయారా? BSB BSB: Consider now, I plead: Who, being innocent, has ever perished? Or where have the upright been destroyed?
8 ULB నాకు తెలిసినంత వరకు దుష్టత్వాన్ని దున్ని, కీడు అనే విత్తనాలు చల్లే వాళ్ళు ఆ పంటనే కోస్తారు. BSB BSB: As I have observed, those who plow iniquity and those who sow trouble reap the same.
9 ULB దేవుడు గాలి ఊదినప్పుడు వాళ్ళు నశించిపోతారు. ఆయన కోపాగ్ని రగిలినప్పుడు వాళ్ళు లేకుండాా పోతారు. BSB BSB: By the breath of God they perish, and by the blast of His anger they are consumed.
10 ULB సింహాల గర్జనలు, క్రూరసింహాల గాండ్రింపులు ఆగిపోతాయి. కొదమసింహాల కోరలు విరిగిపోతాయి. BSB BSB: The lion may roar, and the fierce lion may growl, yet the teeth of the young lions are broken.
11 ULB తిండి లేకపోవడం చేత ఆడ సింహాలు నశించిపోతాయి. సింహపు కూనలు చెల్లాచెదరైపోతాయి. BSB BSB: The old lion perishes for lack of prey, and the cubs of the lioness are scattered.
12 ULB నాకొక రహస్యం తెలిసింది. ఒకడు గుసగుసలాడుతున్నట్టు అది నా చెవికి వినబడింది. BSB BSB: Now a word came to me secretly; my ears caught a whisper of it.
13 ULB మనుషులకు రాత్రివేళ గాఢనిద్ర పట్టే సమయంలో వచ్చే కలవరమైన కలలో అది వచ్చింది. BSB BSB: In disquieting visions in the night, when deep sleep falls on men,
14 ULB నాకు భయం వణుకు కలిగింది. అందువల్ల నా ఎముకలన్నీ వణికిపోయాయి. BSB BSB: fear and trembling came over me and made all my bones shudder.
15 ULB ఒకడి ఊపిరి నా ముఖానికి తగిలింది. నా శరీరం పై వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకున్నాయి. BSB BSB: Then a spirit glided past my face, and the hair on my body bristled.
16 ULB ఒక రూపం నా కళ్ళెదుట నిలిచింది. నేను దాన్ని గుర్తు పట్టలేకపోయాను. మెల్లగా వినిపించే ఒక స్వరం విన్నాను. ఆ స్వరం <<దేవుని సన్నిధిలో అపవిత్రులు నీతిమంతులవుతారా? BSB BSB: It stood still, but I could not discern its appearance; a form loomed before my eyes, and I heard a whispering voice:
17 ULB తమ సృష్టికర్త ఎదుట ఒకడు పవిత్రుడౌతాడా?>> అంటుంది. BSB BSB: ‘Can a mortal be more righteous than God, or a man more pure than his Maker?
18 ULB తన సేవకుల పట్ల ఆయనకు నమ్మకం పోయింది. తన దూతల్లోనే ఆయన తప్పులు వెతుకుతున్నాడు. BSB BSB: If God puts no trust in His servants, and He charges His angels with error,
19 ULB అలాంటిది బంకమట్టి ఇళ్ళలో నివసించే వాళ్ళలో, మట్టిలో పుట్టిన వాళ్ళలో, చిమ్మెట చితికిపోయేలా చితికిపొయే వాళ్ళలో ఇంకెన్ని తప్పులు ఆయన చూస్తాడు! BSB BSB: how much more those who dwell in houses of clay, whose foundations are in the dust, who can be crushed like a moth!
20 ULB ఉదయం నుండి సాయంత్రం మధ్యకాలంలో వాళ్ళు ముక్కలైపోతారు. ఎవరూ గుర్తించకుండానే వాళ్ళు శాశ్వతంగా నాశనమైపోతారు. BSB BSB: They are smashed to pieces from dawn to dusk; unnoticed, they perish forever.
21 ULB వాళ్ళ డేరాల తాళ్ళు పెరికివేస్తారు. వాళ్ళు బుద్ధి తెచ్చుకోకుండానే మరణమైపోతారు. నేడు ఆ విధంగానే జరుగుతుంది గదా. BSB BSB: Are not their tent cords pulled up, so that they die without wisdom?’
Select verses for actions: Enter goes to them and Escape comes back.