1 ULB నువ్వు మొర్రపెట్టినప్పుడు నిన్ను ఆదుకున్నవాడు ఎవరైనా ఉంటారా? పరిశుద్ధ దూతల్లో ఎవరి వైపు నువ్వు చూస్తావు? BSB BSB: “Call out if you please, but who will answer? To which of the holy ones will you turn?
2 ULB తమ నికృష్ట స్థితిని బట్టి దుఃఖించడం వల్ల మూర్ఖులు నశిస్తారు. బుద్ధిహీనులు తమ అసూయ చేత మరణిస్తారు. BSB BSB: For resentment kills a fool, and envy slays the simple.
3 ULB మూర్ఖుడు వేరు పారడం నేను కనుగొన్నాను. అయితే వెంటనే అతని నివాసస్థలం శాపగ్రస్థమైనదని తెలుసుకున్నాను. BSB BSB: I have seen a fool taking root, but suddenly his house was cursed.
4 ULB అతని పిల్లలకు క్షేమం దూరం అవుతుంది. గుమ్మాల దగ్గరే వాళ్ళు నశించిపోతారు. వాళ్ళను విడిపించేవాడు ఎవ్వరూ లేరు. BSB BSB: His sons are far from safety, crushed in court without a defender.
5 ULB ఆకలితో ఉన్నవాళ్ళు అతని పంటను తినివేస్తారు. ముళ్ళ పొదల్లో ఉన్నదాని నుండి కూడా వాళ్ళు దోచుకుంటారు. వాళ్ళ ఆస్తి కోసం తహతహలాడే వాళ్ళు దాన్ని మింగేస్తారు. BSB BSB: The hungry consume his harvest, taking it even from the thorns, and the thirsty pant after his wealth.
6 ULB దుమ్ము నుండి కష్టాలు పుట్టవు. భూమిలోనుండి బాధ మొలవదు. BSB BSB: For distress does not spring from the dust, and trouble does not sprout from the ground.
7 ULB నిప్పురవ్వలు పైకి ఎగిసినట్టు మనుషులు బాధలు అనుభవించడానికే పుడుతున్నారు. BSB BSB: Yet man is born to trouble as surely as sparks fly upward.
8 ULB అయితే నేను నా దేవుడి ఆశ్రయం కోరేవాణ్ణి. నా సంగతులు దేవునికే అప్పగించే వాణ్ణి. BSB BSB: However, if I were you, I would appeal to God and lay my cause before Him—
9 ULB ఆయన ఘనమైన అద్భుత కార్యాలు చేసేవాడు. ఆ ఆశ్చర్య క్రియలు లెక్కకు మించినవి. BSB BSB: the One who does great and unsearchable things, wonders without number.
10 ULB ఆయన భూమి మీద వానలు కురిపిస్తాడు. పంట పొలాల మీద నీళ్లు ప్రవహింపజేస్తాడు. BSB BSB: He gives rain to the earth and sends water upon the fields.
11 ULB ఆ విధంగా ఆయన దీనులను ఉన్నతమైన స్థలాల్లో ఉంచుతాడు. దుఃఖపడే వాళ్ళకు ఊరట కలిగిస్తాడు. BSB BSB: He sets the lowly on high, so that mourners are lifted to safety.
12 ULB వంచకులు చేసే కుట్రలు నెరవేరకుండా వాళ్ళ ఆలోచనలు భగ్నం చేస్తాడు. BSB BSB: He thwarts the schemes of the crafty, so that their hands find no success.
13 ULB దేవుడు జ్ఞానుల యుక్తి మూలంగానే వాళ్ళను పట్టుకుంటాడు. కపట క్రియలు జరిగించేవాళ్ళ తలంపులు తారుమారు చేస్తాడు. BSB BSB: He catches the wise in their craftiness, and sweeps away the plans of the cunning.
14 ULB వెలుగు ఉండే సమయంలో వాళ్లను చీకటి కమ్ముకుంటుంది. ఒకడు రాత్రిలో తడుములాడినట్టు వాళ్ళు మధ్యాహ్న సమయంలో తడుములాడతారు. BSB BSB: They encounter darkness by day and grope at noon as in the night.
15 ULB బలాఢ్యుల నోటి నుంచి వచ్చే కత్తిలాంటి మాటల బారి నుండి, వాళ్ళ చేతి నుండి ఆయన దరిద్రులను రక్షిస్తాడు. BSB BSB: He saves the needy from the sword in their mouth and from the clutches of the powerful.
16 ULB కాబట్టి పేదవాళ్ళకు ఆశాభావం కలుగుతుంది. అన్యాయానికి నోరు మూతబడుతుంది. BSB BSB: So the poor have hope, and injustice shuts its mouth.
17 ULB దేవుడు ఎవరిని గద్దించి శిక్షకు పాత్రునిగా చేస్తాడో వాడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడైన దేవుని క్రమశిక్షణకు విధేయత చూపించు. BSB BSB: Blessed indeed is the man whom God corrects; so do not despise the discipline of the Almighty.
18 ULB ఆయన గాయాలు రేపుతాడు, ఆయనే బాగు చేస్తాడు. ఆయన దెబ్బ తీస్తాడు, తన చేతులతో ఆయనే స్వస్థపరుస్తాడు. BSB BSB: For He wounds, but He also binds; He strikes, but His hands also heal.
19 ULB ఆరు కష్టాలు కలిగినప్పుడు వాటి నుండి నిన్ను విడిపిస్తాడు. ఏడు కష్టాలు వచ్చినా నీకు ఏ అపాయం కలుగదు. BSB BSB: He will rescue you from six calamities; no harm will touch you in seven.
20 ULB కరువుకాటకాల వల్ల కలిగే మరణం నుండి, యుద్ధ సమయంలో కత్తివాత నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. BSB BSB: In famine He will redeem you from death, and in battle from the stroke of the sword.
21 ULB దూషణ మాటల వల్ల కలిగే అవమానం నుండి నిన్ను తప్పిస్తాడు. నీపై వినాశనం విరుచుకుపడినా నువ్వు దానికి భయపడవు. BSB BSB: You will be hidden from the scourge of the tongue, and will not fear havoc when it comes.
22 ULB కరువులు, ప్రళయాలు వచ్చినా నువ్వు వాటిని లక్ష్యపెట్టవు. క్రూర మృగాలకు నీవు భయపడవు. BSB BSB: You will laugh at destruction and famine, and need not fear the beasts of the earth.
23 ULB నీ పొలంలోని రాళ్ళతో కూడా నీవు ఒప్పందం చేసుకుంటావు. అడవి జంతువులతో సఖ్యంగా ఉంటావు. BSB BSB: For you will have a covenant with the stones of the field, and the wild animals will be at peace with you.
24 ULB నువ్వు నివసించే నీ గుడారం క్షేమకరమని నువ్వు తెలుసుకుంటావు. నీ గొర్రెల దొడ్డిలోకి వెళ్తే ఒక్కటి కూడా తప్పిపోలేదని గ్రహిస్తావు. BSB BSB: You will know that your tent is secure, and find nothing amiss when inspecting your home.
25 ULB నీ సంతానం విస్తరిస్తుందనీ, నీ వారసులు భూమి మీద పచ్చికలాగా వృద్ధి చెందుతారనీ నీకు నిశ్చయత కలుగుతుంది. BSB BSB: You will know that your offspring will be many, your descendants like the grass of the earth.
26 ULB ధాన్యం పనలను కళ్ళానికి మోసుకు పోయినట్టు నిండు వృద్ధాప్యంలో నువ్వు సమాధికి చేరతావు. BSB BSB: You will come to the grave in full vigor, like a sheaf of grain gathered in season.
27 ULB ఈ విషయాలన్నీ మేము తరచి తరచి పరిశీలించాం. ఇవన్నీ వాస్తవాలు. నీకు ఉపయోగపడే ఈ మాటలన్నీ జాగ్రత్తగా విని అర్థం చేసుకో. BSB BSB: Indeed, we have investigated, and it is true! So hear it and know for yourself.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.