1 ULB నువ్వు జలరాక్షసిని గాలంతో లాగగలవా? దాని దవడలను తాడుతో బిగించగలవా? BSB BSB: “Can you pull in Leviathan with a hook or tie down his tongue with a rope?
2 ULB నువ్వు దాని ముక్కుకు పగ్గం వేయగలవా? దాని దవడకు కొంకి ఎక్కించగలవా? BSB BSB: Can you put a cord through his nose or pierce his jaw with a hook?
3 ULB అది నీకు విన్నపాలు చేస్తుందా? మృదువైన మాటలు నీతో పలుకుతుందా? BSB BSB: Will he beg you for mercy or speak to you softly?
4 ULB నువ్వు శాశ్వతంగా దాన్ని సేవకుడుగా చేసుకునేలా అది నీతో ఒప్పందం చేస్తుందా? BSB BSB: Will he make a covenant with you to take him as a slave for life?
5 ULB నువ్వు ఒక పిట్టతో ఆటలాడినట్టు దానితో ఆటలాడతావా? నీ పనిపిల్లలు ఆడుకోడానికి దాని కట్టివేస్తావా? BSB BSB: Can you pet him like a bird or put him on a leash for your maidens?
6 ULB బెస్తవాళ్ళు దానితో బేరాలు చేస్తారా? వారు దాన్ని తునకలు చేసి వర్తకులతో వ్యాపారం చేస్తారా? BSB BSB: Will traders barter for him or divide him among the merchants?
7 ULB దాని ఒంటినిండా ఇనప శూలాలు గుచ్చగలవా? దాని తలనిండా చేప అలుగులు గుచ్చగలవా? BSB BSB: Can you fill his hide with harpoons or his head with fishing spears?
8 ULB దాని మీద చెయ్యి వేసి చూడు, దానితో కలిగే పోరు నువ్వు గుర్తు చేసుకుంటే నువ్వు మళ్ళీ అలా చెయ్యవు. BSB BSB: If you lay a hand on him, you will remember the battle and never repeat it!
9 ULB దాన్ని చూస్తే చాలు, మనుషులు దాన్ని వశపరచుకోవచ్చనే ఆశ వదులుకుంటారు. దాని చూస్తే చాలు ఎవరికైనా గుండెలు అవిసిపోతాయి. BSB BSB: Surely hope of overcoming him is false. Is not the sight of him overwhelming?
10 ULB సముద్ర రాక్షసిని రేపడానికి తెగించే శూరుడు లేడు. అలా ఉండగా నా ఎదుట నిలవగలవాడెవడు? BSB BSB: No one is so fierce as to rouse Leviathan. Then who is able to stand against Me?
11 ULB నేను తిరిగి చెల్లించేలా నాకెవరైనా ఏమైనా ఇచ్చారా? ఆకాశం కింద ఉన్నదంతా నాదే గదా. BSB BSB: Who has given to Me that I should repay him? Everything under heaven is Mine.
12 ULB సముద్ర రాక్షసి కాళ్ళను గురించైనా దాని మహా బలాన్ని గురించైనా దాని చక్కని ఆకారాన్ని గురించైనా పలకకుండా మౌనంగా ఉండను. BSB BSB: I cannot keep silent about his limbs, his power and graceful form.
13 ULB ఎవడైనా దాని పై పొరలను లాగివేయగలడా? దాని రెండు కవచాలను గుచ్చి రంధ్రం చేయగలడా? BSB BSB: Who can strip off his outer coat? Who can approach him with a bridle?
14 ULB దాని భయంకరమైన కోరలు ఉన్న ముఖ ద్వారాలను తెరవగల వాడెవడు? BSB BSB: Who can open his jaws, ringed by his fearsome teeth?
15 ULB దాని వీపుకు దృఢమైన పొలుసులు అతికి ఉన్నాయి. విడదీయలేనంత గట్టిగా అవి కూర్చి ఉన్నాయి. BSB BSB: His rows of scales are his pride, tightly sealed together.
16 ULB అవి ఒకదానితో ఒకటి హత్తుకుని ఉన్నాయి. వాటి మధ్యకు గాలి ఏమాత్రం చొరబడదు. BSB BSB: One scale is so near to another that no air can pass between them.
17 ULB అవి ఒకదానితో ఒకటి అతికి ఉన్నాయి. వాటిని ఛేదించడం ఎవరివల్లా కాదు. BSB BSB: They are joined to one another; they clasp and cannot be separated.
18 ULB అది తుమ్మితే వెలుగు చిమ్ముతుంది. దాని కళ్ళు ఉదయకాలపు కనురెప్పల్లాగా ఉన్నాయి. BSB BSB: His snorting flashes with light, and his eyes are like the rays of dawn.
19 ULB దాని నోటి నుండి మండే నిప్పులు బయలుదేరుతాయి. అగ్ని కణాలు దాని నుండి లేస్తాయి. BSB BSB: Firebrands stream from his mouth; fiery sparks shoot forth!
20 ULB పొయ్యిపై మసులుతున్న కాగులోనుండి, బాగా గాలి విసిరి రాజబెట్టిన మంటలోనుండి లేచినట్టు దాని నాసికా రంధ్రాల్లో నుండి పొగ లేస్తుంది. BSB BSB: Smoke billows from his nostrils as from a boiling pot over burning reeds.
21 ULB దాని ఊపిరి నిప్పులను మండిస్తుంది. దాని నోటి నుండి జ్వాలలు బయలుదేరుతాయి. BSB BSB: His breath sets coals ablaze, and flames pour from his mouth.
22 ULB దాని మెడలో బలముంది. భయం దాని ఎదుట తాండవమాడుతూ ఉంటుంది. BSB BSB: Strength resides in his neck, and dismay leaps before him.
23 ULB దాని దళసరి కండరాలు గట్టిగా అతికి ఉన్నాయి. అవి దాని ఒంటిని గట్టిగా అంటి ఉన్నాయి. అవి ఊడి రావు. BSB BSB: The folds of his flesh are tightly joined; they are firm and immovable.
24 ULB దాని గుండె రాయి లాగా గట్టిగా ఉంది. అది తిరగలి కింది దిమ్మంత కఠినం. BSB BSB: His chest is as hard as a rock, as hard as a lower millstone!
25 ULB అది లేచేటప్పుడు మహామహులు సైతం భయపడతారు. భయంతో వారు వెనక్కి తగ్గుతారు. BSB BSB: When Leviathan rises up, the mighty are terrified; they withdraw before his thrashing.
26 ULB కత్తి దెబ్బ దాన్ని ఏమీ చెయ్యదు. ఈటె, బాణం, పదునైన ఏ అయుధమైనా పనికి రావు. BSB BSB: The sword that reaches him has no effect, nor does the spear or dart or arrow.
27 ULB అది ఇనుమును గడ్డిపోచగా, ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగా చూస్తుంది. BSB BSB: He regards iron as straw and bronze as rotten wood.
28 ULB బాణం దాన్ని తరిమి కొట్టలేదు. వడిసెల రాళ్లు దాని దృష్టికి పొట్టులాగా ఉన్నాయి. BSB BSB: No arrow can make him flee; slingstones become like chaff to him.
29 ULB గదలను అది గడ్డిపరకలుగా ఎంచుతుంది. అది రివ్వున ఎగిరి వచ్చే ఈటెను చూసి నవ్వుతుంది. BSB BSB: A club is regarded as straw, and he laughs at the sound of the lance.
30 ULB దాని ఉదర భాగాలు కరుకైన గాజు పెంకుల్లాగా ఉన్నాయి. అది బురద మీద నురిపిడి కొయ్యలాంటి తన తోకను పరచుకుంటుంది. BSB BSB: His undersides are jagged potsherds, spreading out the mud like a threshing sledge.
31 ULB కాగులో నీళ్ళు మసిలినట్టు మహాసముద్రాన్ని అది పొంగిస్తుంది. సముద్రాన్ని అది నూనెలాగా చేస్తుంది. BSB BSB: He makes the depths seethe like a cauldron; he makes the sea like a jar of ointment.
32 ULB అది తాను నడచిన దారిని తన వెనక ప్రకాశింప జేస్తుంది. చూసే వారు అగాధ జలం తెల్లగా ఉంది అనుకుంటారు. BSB BSB: He leaves a glistening wake behind him; one would think the deep had white hair!
33 ULB అది నిర్భయంగా జీవిస్తుంది. భూమి మీద దానికి సమానమైనది లేదు. BSB BSB: Nothing on earth is his equal—a creature devoid of fear!
34 ULB అది గర్వంగా ఉండే వాటిని తిరస్కారంగా చూస్తుంది. గర్వించే వాటన్నిటికీ అది రాజు. BSB BSB: He looks down on all the haughty; he is king over all the proud.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.