1 ULB యెహోవా యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు. BSB BSB: And the LORD said to Job:
2 ULB ఆక్షేపణలు చేయాలని చూసేవాడు సర్వశక్తుడైన దేవుణ్ణి సరిదిద్దాలని చూడవచ్చా? దేవునితో వాదించేవాడు ఇప్పుడు జవాబియ్యాలి. BSB BSB: “Will the faultfinder contend with the Almighty? Let him who argues with God give an answer.”
3 ULB అప్పుడు యోబు యెహోవాకు ఇలా జవాబిచ్చాడు. BSB BSB: Then Job answered the LORD:
4 ULB చూడు, నేను నీచుణ్ణి. నేను నీకు ఏమని ప్రత్యుత్తరమిస్తాను? నా నోటి మీద చెయ్యి ఉంచుకుంటాను. BSB BSB: “Behold, I am insignificant. How can I reply to You? I place my hand over my mouth.
5 ULB ఒక సారి మాట్లాడాను. నేను మళ్ళీ నోరెత్తను. రెండు సార్లు మాట్లాడాను. ఇకపై పలకను. BSB BSB: I have spoken once, but I have no answer—twice, but I have nothing to add.”
6 ULB అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు. BSB BSB: Then the LORD answered Job out of the whirlwind and said:
7 ULB పౌరుషం తెచ్చుకుని నీ నడుము కట్టుకో. నేను నీకు ప్రశ్నవేస్తాను. జవాబియ్యి. BSB BSB: “Now brace yourself like a man; I will question you, and you shall inform Me.
8 ULB నేను అన్యాయం చేసానని అంటావా? నిర్దోషివని నువ్వు తీర్పు పొందడం కోసం నా మీద అపరాధం మోపుతావా? BSB BSB: Would you really annul My justice? Would you condemn Me to justify yourself?
9 ULB దేవునికి ఉన్న బాహుబలం నీకు ఉందా? ఆయన ఉరుము ధ్వనిలాంటి స్వరంతో నువ్వు గర్జించగలవా? BSB BSB: Do you have an arm like God’s? Can you thunder with a voice like His?
10 ULB ఆడంబర మహాత్మ్యాలతో నిన్ను నువ్వు అలంకరించుకో. గౌరవప్రభావాలు ధరించుకో. BSB BSB: Then adorn yourself with majesty and splendor, and clothe yourself with honor and glory.
11 ULB నీ ఆగ్రహాన్ని నలుదెసలా విసిరి వెయ్యి. గర్విష్టులందరినీ చూసి వారిని కూలగొట్టు. BSB BSB: Unleash the fury of your wrath; look on every proud man and bring him low.
12 ULB గర్విష్టులైన వారిని చూసి వారిని అణగదొక్కు. దుష్టులు ఎక్కడుంటే అక్కడ వారిని అణిచి వెయ్యి. BSB BSB: Look on every proud man and humble him; trample the wicked where they stand.
13 ULB కనబడకుండా వారినందరినీ బూడిదలో పాతిపెట్టు. సమాధిలో వారిని బంధించు. BSB BSB: Bury them together in the dust; imprison them in the grave.
14 ULB అప్పుడు నీ కుడి చెయ్యి నిన్ను రక్షించగలదని నేను నిన్ను గూర్చి ఒప్పుకుంటాను. BSB BSB: Then I will confess to you that your own right hand can save you.
15 ULB నిన్ను చేసినట్టే నేను చేసిన మరొక జీవి నీటి ఏనుగును నువ్వు చూశావు గదా? ఎద్దులాగా అది గడ్డి మేస్తుంది. BSB BSB: Look at Behemoth, which I made along with you. He feeds on grass like an ox.
16 ULB చూడు, దాని శక్తి దాని నడుములో ఉంది. దాని బలం దాని కడుపు నరాల్లో ఉంది. BSB BSB: See the strength of his loins and the power in the muscles of his belly.
17 ULB దేవదారు చెట్టు ఊగినట్టు దాని తోక ఊగుతుంది. దాని తొడ కండరాలు దృఢంగా అతికి ఉన్నాయి. BSB BSB: His tail sways like a cedar; the sinews of his thighs are tightly knit.
18 ULB దాని ఎముకలు ఇత్తడి గొట్టాల్లాగా ఉన్నాయి. దాని కాళ్ళు ఇనప కడ్డీల్లాగా ఉన్నాయి. BSB BSB: His bones are tubes of bronze; his limbs are rods of iron.
19 ULB అది దేవుడు సృష్టించిన వాటిలో ముఖ్యమైనది. దాన్ని చేసిన దేవుడే దాన్ని ఓడించ గలడు. BSB BSB: He is the foremost of God’s works; only his Maker can draw the sword against him.
20 ULB పర్వతాలు దానికి మేత మొలిపిస్తాయి. అడవి మృగాలన్నీ అక్కడ ఆడుకుంటాయి. BSB BSB: The hills yield him their produce, while all the beasts of the field play nearby.
21 ULB తామర చెట్ల కింద జమ్ముగడ్డి చాటున పర్రలో అది పండుకుంటుంది. BSB BSB: He lies under the lotus plants, hidden among the reeds of the marsh.
22 ULB తామర తూడులు దానికి నీడనిస్తాయి. సెలయేరు ఒడ్డున ఉన్న నిరవంజి చెట్లు దాని చుట్టూ ఉంటాయి. BSB BSB: The lotus plants conceal him in their shade; the willows of the brook surround him.
23 ULB నదీప్రవాహం పొంగి పొర్లినా అది భయపడదు. యొర్దాను లాంటి ప్రవాహం పొంగి దాని ముట్టె దాకా వచ్చినా అది బెదరదు. BSB BSB: Though the river rages, Behemoth is unafraid; he remains secure, though the Jordan surges to his mouth.
24 ULB ఎవరైనా దాన్ని కొక్కీ వేసి పట్టుకోగలరా? ముక్కుకు పగ్గం వేయగలరా? BSB BSB: Can anyone capture him as he looks on, or pierce his nose with a snare?
Select verses for actions: Enter goes to them and Escape comes back.