1 ULB అడవిలోని కొండమేకలు ఈనే కాలం నీకు తెలుసా? లేళ్లు పిల్లలు పెట్టే కాలం నువ్వు గ్రహించగలవా? BSB BSB: “Do you know when mountain goats give birth? Have you watched the doe bear her fawn?
2 ULB అవి కడుపుతో ఉండే నెలలెన్నో నువ్వు లెక్క పెట్టగలవా? అవి ఈనే కాలం తెలుసా? BSB BSB: Can you count the months they are pregnant? Do you know the time they give birth?
3 ULB అవి వంగి తమ పిల్లలను కంటాయి. వాటి పురిటి నొప్పులు తీరుతాయి. BSB BSB: They crouch down and bring forth their young; they deliver their newborn.
4 ULB వాటి పిల్లలు పుష్టిగా పర్రల్లో పెరుగుతాయి. అవి తల్లులను విడిచిపెట్టి పోయి మళ్లీ వాటి దగ్గరికి తిరిగి రావు. BSB BSB: Their young ones thrive and grow up in the open field; they leave and do not return.
5 ULB అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? గంతులు వేసే గాడిద కట్లు విప్పిన వాడెవడు? BSB BSB: Who set the wild donkey free? Who released the swift donkey from the harness?
6 ULB నేను అడివిని దానికి ఇల్లుగాను ఉప్పుపర్రను దానికి నివాసస్థలంగాను నియమించాను. BSB BSB: I made the wilderness his home and the salt flats his dwelling.
7 ULB పట్టణపు రణగొణధ్వనులను చూసి అది తిరస్కారంగా నవ్వుతుంది. తోలేవాడి అదిలింపులు అది వినదు. BSB BSB: He scorns the tumult of the city and never hears the shouts of a driver.
8 ULB పర్వతాల వరుస దానికి మేతభూమి. అన్ని రకాల పచ్చని మొలకలను అది వెతుక్కుంటుంది. BSB BSB: He roams the mountains for pasture, searching for any green thing.
9 ULB అడివి దున్న నీకు సంతోషంగా ఊడిగం చేస్తుందా? అది నీ కొట్టంలో ఉండడానికి ఒప్పుకుంటుందా? BSB BSB: Will the wild ox consent to serve you? Will he stay by your manger at night?
10 ULB పగ్గం వేసి అడివి దున్నను నాగలి దున్నించ గలవా? దాన్ని తోలుకుపోయి పల్లాలను చదును చేయించగలవా? BSB BSB: Can you hold him to the furrow with a harness? Will he plow the valleys behind you?
11 ULB అది మహా బలిష్ఠమైనదని దాన్ని నువ్వు నమ్ముతావా? చెయ్యమని దానికి నీ పని అప్పగిస్తావా? BSB BSB: Can you rely on his great strength? Will you leave your hard work to him?
12 ULB అది నీ ధాన్యాన్ని ఇంటికి తెస్తుందని దానిపై ఆధారపడతావా? కళ్ళంలో ఉన్న ధాన్యాన్ని అది పోగు చేస్తుందని నమ్ముతావా? BSB BSB: Can you trust him to bring in your grain and gather it to your threshing floor?
13 ULB నిప్పుకోడి గర్వంగా రెక్కలు ఆడిస్తుంది. కానీ అవి ప్రేమపూర్వకమైన రెక్కలా, ఈకలా? BSB BSB: The wings of the ostrich flap joyfully, but cannot match the pinions and feathers of the stork.
14 ULB లేదు సుమా, అది దాని గుడ్లు నేలపై పెడుతుంది. ఇసుకే వాటిని పొదుగుతుంది. BSB BSB: For she leaves her eggs on the ground and lets them warm in the sand.
15 ULB దేని పాదమైనా వాటిని తొక్కుతుందని అయినా, అడవిజంతువు ఏదైనా వాటిని చితకగొడుతుందేమోనని అయినా అది మర్చిపోతుంది. BSB BSB: She forgets that a foot may crush them, or a wild animal may trample them.
16 ULB తన పిల్లలు తనవి కానట్టు వాటి పట్ల అది కఠినంగా ఉంటుంది. దాని కష్టం వ్యర్థమైపోయినా దానికి చింత లేదు. BSB BSB: She treats her young harshly, as if not her own, with no concern that her labor was in vain.
17 ULB దేవుడు దాన్ని తెలివిలేనిదిగా చేశాడు. ఆయన దానికి వివేచనాశక్తి ఇవ్వలేదు. BSB BSB: For God has deprived her of wisdom; He has not endowed her with understanding.
18 ULB అది వడిగా పరిగెత్తితే గుర్రాన్ని, దానిపై స్వారీ చేసే వాణ్ణి చూసి హేళనగా నవ్వుతుంది. BSB BSB: Yet when she proudly spreads her wings, she laughs at the horse and its rider.
19 ULB గుర్రానికి నువ్వు బలం ఇచ్చావా? జూలు వెంట్రుకలతో దాని మెడను నువ్వే కప్పావా? BSB BSB: Do you give strength to the horse or adorn his neck with a mane?
20 ULB మిడతవలె అది కదం తొక్కేలా చేశావా? దాని సకిలింపు ధ్వని భీకరం. BSB BSB: Do you make him leap like a locust, striking terror with his proud snorting?
21 ULB అది కాలు దువ్వి తన బలాన్నిబట్టి రేగిపోతుంది. అది ఆయుధాలను ఎదుర్కోడానికి ముందుకు దూకుతుంది. BSB BSB: He paws in the valley and rejoices in his strength; he charges into battle.
22 ULB అది భయాన్ని వెక్కిరిస్తుంది. హడలిపోదు. కత్తిని చూసి వెనక్కి తగ్గదు. BSB BSB: He laughs at fear, frightened of nothing; he does not turn back from the sword.
23 ULB దాని వీపుపై అంబుల పొది, తళతళలాడే ఈటెలు బల్లేలు గలగలలాడినప్పుడు, BSB BSB: A quiver rattles at his side, along with a flashing spear and lance.
24 ULB పట్టరాని కోపంతో అది పరుగులు పెడుతుంది. అది భేరీనాదం విని ఉరకలు వేస్తుంది. BSB BSB: Trembling with excitement, he devours the distance; he cannot stand still when the ram’s horn sounds.
25 ULB బాకా ధ్వని వినబడినప్పుడెల్లా అది హుంకరిస్తుంది. దూరం నుండి యుద్ధవాసన పసిగడుతుంది. సేనాధిపతుల సింహనాదాలను, కదనఘోషను వింటుంది. BSB BSB: At the blast of the horn, he snorts with fervor. He catches the scent of battle from afar, the shouts of captains and the cry of war.
26 ULB డేగ నీ జ్ఞానం చేతనే ఎగురుతుందా? అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కుకు చాస్తుందా? BSB BSB: Does the hawk take flight by your understanding and spread his wings toward the south?
27 ULB గరుడ పక్షి నీ ఆజ్ఞకు లోబడే ఆకాశవీధి కెక్కుతుందా? తన గూడును ఎత్తయిన చోట కట్టుకుంటుందా? BSB BSB: Does the eagle soar at your command and make his nest on high?
28 ULB అది కొండశిఖరాలపై నివసిస్తుంది. కొండకొనపై ఎవరూ ఎక్కలేని చోట గూడు కట్టుకుంటుంది. BSB BSB: He dwells on a cliff and lodges there; his stronghold is on a rocky crag.
29 ULB అక్కడ నుండి తన ఎరను వెతుకుతుంది. దాని కళ్ళు దాన్ని దూరం నుండి కనిపెడతాయి. BSB BSB: From there he spies out food; his eyes see it from afar.
30 ULB దాని పిల్లలు రక్తం తాగుతాయి. హతులైనవారు ఎక్కడ ఉంటారో అక్కడే అది ఉంటుంది. BSB BSB: His young ones feast on blood; and where the slain are, there he is.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.