2 ULB జ్ఞానం లేని మాటలు చెప్పి నా పథకాలను చెడగొడుతున్న వీడెవడు? BSB BSB: “Who is this who obscures My counsel by words without knowledge?
3 ULB పౌరుషంగా నీ నడుము బిగించుకో. నేను నీకు ప్రశ్న వేస్తాను. నాకు జవాబియ్యాలి. BSB BSB: Now brace yourself like a man; I will question you, and you shall inform Me.
5 ULB నీకు తెలిస్తే చెప్పు, దాని పరిమాణం ఎవరు నిర్ణయించారు? దానికి కొలతలు వేసిన దెవరు? BSB BSB: Who fixed its measurements? Surely you know! Or who stretched a measuring line across it?
6 ULB దాని పునాదులు దేనిపై ఉన్నాయి? ఉదయ నక్షత్రాలు కలిసి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందంగా జయజయధ్వానాలు చేస్తుండగా దాని మూలరాయి నిలబెట్టింది ఎవరు? BSB BSB: On what were its foundations set, or who laid its cornerstone,
8 ULB సముద్రం దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపులు వేసి దాన్ని మూసిన వాడెవడు? BSB BSB: Who enclosed the sea behind doors when it burst forth from the womb,
9 ULB నేను మేఘాలకు బట్టలు తొడిగినప్పుడు గాఢాంధకారాన్ని దానికి పొత్తిగుడ్డగా వేసినప్పుడు నువ్వు ఉన్నావా? BSB BSB: when I made the clouds its garment and thick darkness its blanket,
10 ULB సముద్రానికి నా సరిహద్దు నియమించి, దాని తలుపులను, గడియలను అమర్చినప్పుడు, BSB BSB: when I fixed its boundaries and set in place its bars and doors,
11 ULB <<నువ్వు ఇంతవరకే మరి దగ్గరికి రాకూడదు, ఇక్కడే నీ తరంగాల గర్వం అణిగిపోవాలి>> అని నేను సముద్రానికి చెప్పినప్పుడు నువ్వు ఉన్నావా? BSB BSB: and I declared: ‘You may come this far, but no farther; here your proud waves must stop’?
12 ULB నీ జీవితకాలమంతటిలో ఎప్పుడైనా ప్రాతఃకాలాన్ని రమ్మని ఆజ్ఞాపించావా? తెల్లవారి సూర్యోదయానికి దాని స్థానాన్ని నియమించావా? BSB BSB: In your days, have you commanded the morning or assigned the dawn its place,
13 ULB దుష్టులు దానిలో ఉండకుండా దులిపివేసేలా భూమి అంచులను అది ఒడిసి పట్టేలా ఉదయాన్ని పంపించావా? BSB BSB: that it might spread to the ends of the earth and shake the wicked out of it?
14 ULB ముద్ర బంకమట్టి రూపాన్ని మార్చినట్టు భూతలం రూపాంతరం చెందుతూ ఉంటుంది. దానిపై ఉన్నవన్నీ వస్త్రం మీది మడతల్లాగా స్పష్టంగా కనబడతాయి. BSB BSB: The earth takes shape like clay under a seal; its hills stand out like the folds of a garment.
15 ULB దుష్టుల వెలుగు వారి నుండి తొలిగిపోతుంది. వారు ఎత్తిన చెయ్యి విరగ్గొట్టబడుతుంది. BSB BSB: Light is withheld from the wicked, and their upraised arm is broken.
16 ULB సముద్రపు ఊటల్లోకి నువ్వు చొరబడ్డావా? సముద్రం అడుగున తిరుగులాడావా? BSB BSB: Have you journeyed to the vents of the sea or walked in the trenches of the deep?
17 ULB మరణద్వారాలు నీకు తెరుచుకున్నాయా? మరణాంధకార ద్వారాలను నువ్వు చూశావా? BSB BSB: Have the gates of death been revealed to you? Have you seen the gates of the shadow of death?
18 ULB భూమి వైశాల్యం ఎంతో నువ్వు గ్రహించావా? ఇదంతా నీకేమైనా తెలిస్తే చెప్పు. BSB BSB: Have you surveyed the extent of the earth? Tell Me, if you know all this.
19 ULB వెలుగు విశ్రాంతి తీసుకునే చోటుకు దారి ఏది? చీకటి అనేదాని ఉనికిపట్టు ఏది? BSB BSB: Where is the way to the home of light? Do you know where darkness resides,
20 ULB వెలుగును, చీకటిని అవి ఉద్యోగాలు చేసే చోటులకు నువ్వు తీసుకుపోగలవా? వాటి పని అయిపోయాక వాటిని మళ్లీ వాటి ఇళ్ళకు తీసుకుపోగలవా? BSB BSB: so you can lead it back to its border? Do you know the paths to its home?
21 ULB ఇవన్నీ నీకు తెలుసు కదా! నువ్వు అప్పటికే పుట్టావట గదా. నువ్వు బహు వృద్ధుడివి మరి. BSB BSB: Surely you know, for you were already born! And the number of your days is great!
22 ULB నువ్వు మంచును నిలవ చేసిన గిడ్డంగుల్లోకి వెళ్లావా? వడగండ్లను దాచి ఉంచిన కొట్లను నువ్వు చూశావా? ఆపత్కాలం కోసం యుద్ధ దినాల కోసం నేను వాటిని దాచి ఉంచాను. BSB BSB: Have you entered the storehouses of snow or observed the storehouses of hail,
24 ULB మెరుపులను వాటి వాటి దారుల్లోకి పంపించే చోటు ఏది? తూర్పు గాలి ఎక్కడనుండి బయలుదేరి భూమి మీద నఖముఖాలా వీస్తుంది? BSB BSB: In which direction is the lightning dispersed, or the east wind scattered over the earth?
25 ULB మనుషులు లేని తావుల్లో వర్షం కురిపించడానికి, నిర్జన ప్రదేశాల్లో వాన కురియడానికి, BSB BSB: Who cuts a channel for the flood or clears a path for the thunderbolt,
26 ULB చవిటి నేలలను, జన సంచారం లేని ఎడారులను తృప్తి పరచడానికి, అక్కడ లేత గడ్డి పరకలు మొలిపించడానికి, BSB BSB: to bring rain on a barren land, on a desert where no man lives,
27 ULB వర్ష ధారలకోసం కాలవలను, ఉరుములు గర్జించడానికి దారులను ఏర్పరచిన వాడెవడు? BSB BSB: to satisfy the parched wasteland and make it sprout with tender grass?
28 ULB వర్షానికి తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను కన్నది ఎవరు? BSB BSB: Does the rain have a father? Who has begotten the drops of dew?
29 ULB మంచు గడ్డ ఎవరి గర్భంలోనుండి వస్తుంది? ఆకాశం నుండి జాలువారే మంచును ఎవరు పుట్టించారు? BSB BSB: From whose womb does the ice emerge? Who gives birth to the frost from heaven,
30 ULB జలాలు దాక్కుని రాయిలాగా గడ్డకట్టుకుపోతాయి. అగాధజలాల ఉపరితలం ఘనీభవిస్తుంది. BSB BSB: when the waters become hard as stone and the surface of the deep is frozen?
31 ULB కృత్తిక నక్షత్రాలను నువ్వు బంధించగలవా? మృగశిరకు కట్లు విప్పగలవా? BSB BSB: Can you bind the chains of the Pleiades or loosen the belt of Orion?
32 ULB వాటి కాలాల్లో నక్షత్ర రాసులను వచ్చేలా చేయగలవా? సప్తర్షి నక్షత్రాలను వాటి ఉపనక్షత్రాలను నువ్వు నడిపించగలవా? BSB BSB: Can you bring forth the constellations in their seasons or lead out the Bear and her cubs?
33 ULB ఆకాశమండల నియమాలు నీకు తెలుసా? అది భూమిని పరిపాలించే విధానం నువ్వు స్థాపించగలవా? BSB BSB: Do you know the laws of the heavens? Can you set their dominion over the earth?
34 ULB జడివాన నిన్ను కప్పేలా మేఘాలకు గొంతెత్తి నువ్వు ఆజ్ఞ ఇయ్యగలవా? BSB BSB: Can you command the clouds so that a flood of water covers you?
35 ULB మెరుపులు బయలుదేరి వెళ్లి <<చిత్తం ఇదుగో ఉన్నాం>> అని నీతో చెప్పేలా నువ్వు వాటిని బయటికి రప్పించగలవా? BSB BSB: Can you send the lightning bolts on their way? Do they report to you, ‘Here we are’?
36 ULB మేఘాల్లో జ్ఞానం ఉంచిన వాడెవడు? పొగమంచుకు తెలివినిచ్చిన వాడెవడు? BSB BSB: Who has put wisdom in the heart or given understanding to the mind?
37 ULB నైపుణ్యంగా మేఘాలను లెక్కబెట్ట గలవాడెవడు? BSB BSB: Who has the wisdom to count the clouds? Or who can tilt the water jars of the heavens
38 ULB మట్టి గడ్డల్లోకి ధూళి దూరి అవి ఒక దానికొకటి అంటుకొనేలా మేఘ కలశాల్లో నుండి నీటిని ఒలికించగలిగింది ఎవరు? BSB BSB: when the dust hardens into a mass and the clods of earth stick together?
40 ULB సింహం పిల్లలు తమ గుహల్లో పడుకుని ఉన్నప్పుడు, తమ మాటుల్లో పొంచి ఉన్నప్పుడు నువ్వు వాటి ఆకలి తీరుస్తావా? BSB BSB: when they crouch in their dens and lie in wait in the thicket?
41 ULB కాకి పిల్లలు దేవునికి మొరపెట్టేటప్పుడు, ఆకలికి అలమటించేటప్పుడు వాటికి ఆహారం ఇచ్చేవాడెవడు? BSB BSB: Who provides food for the raven when its young cry out to God as they wander about for lack of food?
Select verses for actions: Enter goes to them and Escape comes back.