1 ULB భూమి మీద మనుషులు జీవించే కాలం కాయకష్టం వంటిది కాదా? వాళ్ళ దినాలు కూలి పని చేసే వాడి జీవనం వంటిది కాదా? BSB BSB: “Is not man consigned to labor on earth? Are not his days like those of a hired hand?
2 ULB బానిసత్వంలో ఉన్నవాడు గూడు కోరుకున్నట్టు, కూలి కోసం పనివాడు ఎదురు చూస్తున్నట్టు నేను ఉన్నాను. BSB BSB: Like a slave he longs for shade; like a hireling he waits for his wages.
3 ULB నా ఆశలు నెరవేరక నెలల తరబడి గడపవలసి వచ్చింది. నా కోసం ఆయాసంతో కూడిన రాత్రులు నియమితమై ఉన్నాయి. BSB BSB: So I am allotted months of futility, and nights of misery are appointed to me.
4 ULB నేను పండుకున్నప్పుడల్లా ఆ రాత్రి ఎప్పుడు గడుస్తుందా, ఎప్పుడు నిద్ర నుండి లేస్తానా అనుకుంటాను. తెల్లవారే వరకూ ఇటూ అటూ దొర్లుతూ మధనపడతాను. BSB BSB: When I lie down I think: ‘When will I get up?’ But the night drags on, and I toss and turn until dawn.
5 ULB నా శరీరమంతా పురుగులతో, మట్టిపెళ్లలతో కప్పి ఉంది. నా చర్మంపై గడ్డలు గట్టిపడి మళ్ళీ మెత్తగా అయిపోయి బాధ పెడతాయి. BSB BSB: My flesh is clothed with worms and encrusted with dirt; my skin is cracked and festering.
6 ULB నేత పనివాడి చేతిలోని నాడెలాగా నా రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. ఎలాంటి నిరీక్షణ లేకుండా అవి గతించిపోతున్నాయి. BSB BSB: My days are swifter than a weaver’s shuttle; they come to an end without hope.
7 ULB నా ప్రాణం కేవలం ఊపిరి వంటిదని జ్ఞాపకం చేసుకోండి. ఇకపై నా కళ్ళకు ఎలాంటి మంచీ కనబడదు. BSB BSB: Remember that my life is but a breath. My eyes will never again see happiness.
8 ULB నన్ను చూసినవారి కళ్ళకు ఇకపై నేను కనిపించను. నీ కళ్ళు నా కోసం చూసినప్పుడు నేను లేకుండా పోతాను. BSB BSB: The eye that beholds me will no longer see me. You will look for me, but I will be no more.
9 ULB మేఘాలు చెదిరిపోయి మాయమైపోయిన విధంగా పాతాళానికి దిగిపోయిన వాడు మళ్లీ పైకి రాడు. BSB BSB: As a cloud vanishes and is gone, so he who goes down to Sheol does not come back up.
10 ULB ఇక అతడు ఎప్పటికీ తన ఇంటికి తిరిగి రాడు. అతడు నివసించిన స్థలం ఇక అతణ్ణి గుర్తించదు. BSB BSB: He never returns to his house; his place remembers him no more.
11 ULB అందువల్ల నేను నోరు మూసుకుని ఉండను. నా ఆత్మలో వేదన ఉంది. నా వేదన కొద్దీ నేను మాట్లాడతాను. నా మనసులోని వేదనను బట్టి మూలుగుతూ ఉంటాను. BSB BSB: Therefore I will not restrain my mouth; I will speak in the anguish of my spirit; I will complain in the bitterness of my soul.
12 ULB నేనేమైనా సముద్రం వంటివాడినా? సముద్ర రాక్షసినా? నన్ను నువ్వెందుకు కాపలా కాస్తున్నావు? BSB BSB: Am I the sea, or the monster of the deep, that You must keep me under guard?
13 ULB నా పడక నాకు ఆధారం అవుతుందని, నా పరుపు నా బాధకు ఉపశమనం కలిగిస్తుందని అనుకున్నాను. BSB BSB: When I think my bed will comfort me and my couch will ease my complaint,
14 ULB అయితే నువ్వు కలలు రప్పించి నన్ను బెదిరిస్తున్నావు. దర్శనాల ద్వారా నేను వణికిపోయేలా చేస్తున్నావు. BSB BSB: then You frighten me with dreams and terrify me with visions,
15 ULB అందుకని నన్ను ఉరి తీయాలని కోరుతున్నాను. నా అస్థిపంజరాన్ని నేను చూసుకోవడం కన్నా చనిపోవడమే నాకు ఇష్టం. BSB BSB: so that I would prefer strangling and death over my life in this body.
16 ULB జీవితం అంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ఎల్లకాలం బతికి ఉండడం నాకు ఇష్టం లేదు. నా జోలికి రావద్దు. నేను బతికే దినాలు ఆవిరిలాగా ఉన్నాయి. BSB BSB: I loathe my life! I would not live forever. Leave me alone, for my days are but a breath.
17 ULB మనిషి ఎంతటి వాడు? మనిషిని గొప్పవాడిగా ఎంచడం ఎందుకు? అతని మీద నీ మనస్సు నిలపడం ఎందుకు? BSB BSB: What is man that You should exalt him, that You should set Your heart upon him,
18 ULB ప్రతి ఉదయమూ నువ్వు అతణ్ణి దర్శిస్తావెందుకు? క్షణక్షణమూ అతన్ని పరీక్షిస్తావెందుకు? BSB BSB: that You attend to him every morning, and test him every moment?
19 ULB నన్ను చూస్తూ నువ్వు ఎంతకాలం గడుపుతావు? నేను గుటక వేసే వరకూ నన్ను విడిచిపెట్టవా? BSB BSB: Will You never look away from me, or leave me alone to swallow my spittle?
20 ULB మనుషులను కనిపెట్టి చూసే వాడా, ఒకవేళ నేను పాపం చేసినా అది నీకు వ్యతిరేకంగా ఎందుకు చేస్తాను? నాకు నేనే భారంగా ఉన్నాను. నీ దృష్టి నాపై ఎందుకు నిలిపావు? BSB BSB: If I have sinned, what have I done to You, O watcher of mankind? Why have You made me Your target, so that I am a burden to You?
21 ULB నా అతిక్రమాలను నువ్వెందుకు క్షమించవు? నా పాపాలను ఎందుకు తుడిచివేయవు? నేనిప్పుడు మట్టిలో కలసిపోతాను. నన్ను జాగ్రత్తగా వెదకుతావు గానీ నేను ఉండను. BSB BSB: Why do You not pardon my transgression and take away my iniquity? For soon I will lie down in the dust; You will seek me, but I will be no more.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.