1 ULB అప్పుడు షూహీయుడు బిల్దదు ఇలా అన్నాడు. BSB BSB: Then Bildad the Shuhite replied:
2 ULB నువ్వు ఇలాంటి మాటలు ఎంతసేపు మాట్లాడతావు? నీ మాటలు సుడిగాలిలాగా బయటకు వస్తున్నాయి. BSB BSB: “How long will you go on saying such things? The words of your mouth are a blustering wind.
3 ULB దేవుడు తన చట్టాలను రద్దు చేస్తాడా? సర్వశక్తుడైన దేవుడు న్యాయం జరిగించకుండా ఉంటాడా? BSB BSB: Does God pervert justice? Does the Almighty pervert what is right?
4 ULB ఒకవేళ నీ కొడుకులు ఆయన దృష్టిలో ఏదైనా పాపం చేశారేమో. వాళ్ళు జరిగించిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని శిక్షకు అప్పగించాడేమో. BSB BSB: When your children sinned against Him, He gave them over to their rebellion.
5 ULB నువ్వు జాగ్రత్తగా దేవుని కోసం కనిపెట్టు. సర్వశక్తుడైన దేవుణ్ణి వేడుకో. BSB BSB: But if you would earnestly seek God and ask the Almighty for mercy,
6 ULB నువ్వు పవిత్రుడివీ నిజాయితీపరుడివీ అయితే ఆయన తప్పకుండా నిన్ను పట్టించుకుంటాడు. నీ ప్రవర్తనకు తగినట్టుగా నీకున్న పూర్వస్థితి తిరిగి కలిగిస్తాడు. BSB BSB: if you are pure and upright, even now He will rouse Himself on your behalf and restore your righteous estate.
7 ULB నీ స్థితి మొదట్లో కొద్దిగా ఉన్నప్పటికీ చివరకు ఎంతో గొప్పగా వృద్ధి చెందుతుంది. BSB BSB: Though your beginnings were modest, your latter days will flourish.
8 ULB మనం నిన్నటి మనుషులం. మనకు ఏమీ తెలియదు. భూమిపై మనం జీవించిన రోజులు నీడలాగా ఉన్నాయి. BSB BSB: Please inquire of past generations and consider the discoveries of their fathers.
9 ULB గడిచిన తరాల గురించి ఆలోచించు. వాళ్ళ పూర్వికులు పరిశోధించి తెలుసుకున్న విషయాలు జాగ్రత్తగా తెలుసుకో. BSB BSB: For we were born yesterday and know nothing; our days on earth are but a shadow.
10 ULB వాళ్ళు తమ అనుభవాలను బట్టి నీకు ఉపదేశిస్తారు గదా. అన్ని విషయాలు నీకు చెబుతారు గదా. BSB BSB: Will they not teach you and tell you, and speak from their understanding?
11 ULB బురద లేకుండా జమ్ము గడ్డి పెరుగుతుందా? నీళ్లు లేకుండా రెల్లు మొలుస్తుందా? BSB BSB: Does papyrus grow where there is no marsh? Do reeds flourish without water?
12 ULB దాన్ని కోయకముందు ఎంతో పచ్చగా కనిపిస్తుంది. అయితే ఇతర మొక్కలతో పోల్చితే అది తొందరగా వాడిపోతుంది. BSB BSB: While the shoots are still uncut, they dry up more quickly than grass.
13 ULB దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేవాళ్ళ స్థితి అలాగే ఉంటుంది. భక్తిహీనుల కోరికలు నిరర్థకమౌతాయి. వాళ్ళ కోరికలు తీరక భంగపడతారు. BSB BSB: Such is the destiny of all who forget God; so the hope of the godless will perish.
14 ULB ఎందుకంటే వాళ్ళు ఆశ్రయించినది సాలెపురుగు గూడు వంటిది. BSB BSB: His confidence is fragile; his security is in a spider’s web.
15 ULB అతడు దాని మీద ఆధారపడినప్పుడు అది పడిపోతుంది. దాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు అది విడిపోతుంది. BSB BSB: He leans on his web, but it gives way; he holds fast, but it does not endure.
16 ULB భక్తిహీనుడు ఎండాకాలంలో పచ్చగా ఉండే మొక్కలాంటివాడు. అతని తీగెలు అతని తోట మీద పాకుతూ అల్లుకుంటాయి. BSB BSB: He is a well-watered plant in the sunshine, spreading its shoots over the garden.
17 ULB అతని వేళ్లు గట్టు చుట్టూ ఆవరిస్తాయి. రాళ్లు ఉన్న భూమిలోకి పాతుకుపోవాలని అతడు ప్రయత్నిస్తూ ఉంటాడు. BSB BSB: His roots wrap around the rock heap; he looks for a home among the stones.
18 ULB అతడున్న ప్రాంతం నుండి దేవుడు అతణ్ణి పెరికివేసినప్పుడు ఆ స్థలం అతనితో <<నువ్వు నాకు తెలియదు, నేను నిన్ను ఎన్నడూ చూడలేదు>> అంటుంది. BSB BSB: If he is uprooted from his place, it will disown him, saying, ‘I never saw you.’
19 ULB అతని సంతోషకరమైన స్థితికి అంతం ఇలాగే ఉంటుంది. ఆ ప్రాంతంలో భూమిలో నుండి వేరే మొక్కలు మొలుస్తాయి. BSB BSB: Surely this is the joy of his way; yet others will spring from the dust.
20 ULB ఆలోచించు, దేవుడు యథార్థవంతునికి అన్యాయం చేయడు. అలానే దుర్మార్గుల చెయ్యి అందుకోడు. BSB BSB: Behold, God does not reject the blameless, nor will He strengthen the hand of evildoers.
21 ULB ఇక నుండి ఆయన నీ నోటిని నవ్వుతో నింపుతాడు. నీ పెదవులపై కేరింతలు ఉంచుతాడు. BSB BSB: He will yet fill your mouth with laughter, and your lips with a shout of joy.
22 ULB నీపై పగ పెంచుకునే వాళ్ళు అవమానం పాలవుతారు. దుష్టుల గుడారాలు లేకుండా పోతాయి. BSB BSB: Your enemies will be clothed in shame, and the tent of the wicked will be no more.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.