2 ULB నా తండ్రి లోగిలిలో ఎన్నో నివాస స్థలాలు ఉన్నాయి. అవి లేకపోతే మీతో చెప్పేవాణ్ణి. మీకు స్థలం సిద్ధం చెయ్యడానికి వెళ్తున్నాను. BSB BSB: In My Father’s house are many rooms. If it were not so, would I have told you that I am going there to prepare a place for you?
3 ULB నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధం చేస్తే, నేను మళ్ళీ వచ్చి, నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండేలా, నా దగ్గరికి మిమ్మల్ని తీసుకు వెళ్తాను. BSB BSB: And if I go and prepare a place for you, I will come back and welcome you into My presence, so that you also may be where I am.
4 ULB నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు, ఆ దారి కూడా తెలుసు” అన్నాడు. BSB BSB: You know the way to the place where I am going.”
5 ULB తోమా యేసుతో, “ప్రభూ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు. మాకు దారి ఎలా తెలుస్తుంది?” అన్నాడు. BSB BSB: “Lord,” said Thomas, “we do not know where You are going, so how can we know the way?”
7 ULB మీరు నన్ను తెలుసుకుని ఉంటే, నా తండ్రిని కూడా తెలుసుకుని ఉండేవాళ్ళే. ఇప్పటినుంచి మీకు ఆయన తెలుసు. ఆయనను మీరు చూశారు” అన్నాడు. BSB BSB: If you had known Me, you would know My Father as well. From now on you do know Him and have seen Him.”
8 ULB ఫిలిప్పు యేసుతో, “ప్రభూ, తండ్రిని మాకు చూపించు. అది మాకు చాలు” అన్నాడు. BSB BSB: Philip said to Him, “Lord, show us the Father, and that will be enough for us.”
10 ULB నేను తండ్రిలో, తండ్రి నాలో ఉన్నాం అని నువ్వు నమ్మడం లేదా? నేను మాట్లాడే మాటలు నా సొంత మాటలు కాదు. నాలో నివాసం ఉంటున్న తండ్రి తన పని చేస్తున్నాడు. BSB BSB: Do you not believe that I am in the Father and the Father is in Me? The words I say to you, I do not speak on My own. Instead, it is the Father dwelling in Me, performing His works.
11 ULB తండ్రిలో నేను, నాలో తండ్రి ఉన్నాం అని నమ్మండి. అదీ కాకపోతే, ఈ క్రియల గురించి అయినా నన్ను నమ్మండి. BSB BSB: Believe Me that I am in the Father and the Father is in Me—or at least believe on account of the works themselves.
12 ULB నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను, నా మీద నమ్మకం ఉంచినవాడు, నేను చేసే క్రియలు కూడా చేస్తాడు. అంతమాత్రమే కాదు, ఇంతకన్నా గొప్ప క్రియలు చేస్తాడు. ఎందుకంటే, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. BSB BSB: Truly, truly, I tell you, whoever believes in Me will also do the works that I am doing. He will do even greater things than these, because I am going to the Father.
13 ULB “మీరు నా పేరిట ఏం అడిగినా, అది నేను చేస్తాను. తద్వారా తండ్రికి తన కుమారుడిలో మహిమ కలుగుతుంది. BSB BSB: And I will do whatever you ask in My name, so that the Father may be glorified in the Son.
14 ULB మీరు నా పేరిట ఏం అడిగినా, అది నేను చేస్తాను. BSB BSB: If you ask Me for anything in My name, I will do it.
17 ULB ఆయన సత్యం అయిన ఆత్మ. లోకం ఆయనను చూడదు, తెలుసుకోదు కాబట్టి ఆయనను స్వీకరించదు. అయితే మీకు ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు. BSB BSB: the Spirit of truth. The world cannot receive Him, because it neither sees Him nor knows Him. But you do know Him, for He abides with you and will be in you.
18 ULB నేను మిమ్మల్ని అనాధలుగా విడిచిపెట్టను. మీకోసం నేను మళ్ళీ వస్తాను. BSB BSB: I will not leave you as orphans; I will come to you.
19 ULB కొద్దికాలం తరువాత ఇంక ఈ లోకం నన్ను చూడదు. కాని, మీరు నన్ను చూస్తారు. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు. BSB BSB: In a little while the world will see Me no more, but you will see Me. Because I live, you also will live.
20 ULB నేను నా తండ్రిలో, మీరు నాలో, నేను మీలో ఉన్నాం అని ఆ రోజు మీరు తెలుసుకుంటారు. BSB BSB: On that day you will know that I am in My Father, and you are in Me, and I am in you.
21 ULB నా ఆజ్ఞలను కలిగిఉండి, వాటిని పాటించేవాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. నేను అతన్ని ప్రేమించి, నన్ను అతనికి ప్రత్యక్షం చేసుకుంటాను” అన్నాడు. BSB BSB: Whoever has My commandments and keeps them is the one who loves Me. The one who loves Me will be loved by My Father, and I will love him and reveal Myself to him.”
22 ULB యూదా (ఇస్కరియోతు కాక వేరొక యూదా) యేసుతో, “ప్రభూ, నీవు లోకానికి కాకుండా మాకు మాత్రమే నిన్ను నీవు ప్రత్యక్షం చేసుకోడానికి కారణం ఏమిటి?” అన్నాడు. BSB BSB: Judas (not Iscariot) asked Him, “Lord, why are You going to reveal Yourself to us and not to the world?”
24 ULB నన్ను ప్రేమించని వాడు నా మాట ప్రకారం చెయ్యడు. మీరు వినే ఈ మాట నాది కాదు, నన్ను పంపిన తండ్రిది. BSB BSB: Whoever does not love Me does not keep My words. The word that you hear is not My own, but it is from the Father who sent Me.
25 ULB మీ మధ్య నేను బతికి ఉండగానే ఈ సంగతులు మీతో చెప్పాను. BSB BSB: All this I have spoken to you while I am still with you.
29 ULB ఈ సంగతి జరగక ముందే నేను మీతో చెప్పాను. ఎందుకంటే, ఇది నిజంగా జరిగినప్పుడు మీరు నమ్మాలని నా ఉద్దేశం. BSB BSB: And now I have told you before it happens, so that when it does happen, you will believe.
30 ULB ఇంతకన్నా ఎక్కువ మీతో మాట్లాడను. ఈ లోకాధికారి వస్తున్నాడు. అతనికి నా మీద అధికారం లేదు. BSB BSB: I will not speak with you much longer, for the prince of this world is coming, and he has no claim on Me.
31 ULB నేను నా తండ్రిని ప్రేమిస్తున్నానని ఈ లోకానికి తెలిసేలా, నా తండ్రి నాకు ఆజ్ఞాపించింది ఉన్నది ఉన్నట్టు నేను చేస్తాను. లేవండి, ఇక్కడి నుంచి వెళ్దాం.” BSB BSB: But I do exactly what the Father has commanded Me, so that the world may know that I love the Father. Get up! Let us go on from here.
Select verses for actions: Enter goes to them and Escape comes back.