1 ULB దొంగ త్రాసు యెహోవాకు అసహ్యం. న్యాయమైన తూకం ఆయనకు ఇష్టం. BSB BSB: Dishonest scales are an abomination to the LORD, but an accurate weight is His delight.
2 ULB గర్వం వెనకాలే అవమానం బయలు దేరుతుంది. జ్ఞానం గలవారు వినయ విధేయతలు కలిగి ఉంటారు. BSB BSB: When pride comes, disgrace follows, but with humility comes wisdom.
3 ULB నిజాయితీ గల వారిని వారి న్యాయబుద్ధి నడిపిస్తుంది. దుర్మార్గుల మూర్ఖత్వం వారిని చెడగొడుతుంది. BSB BSB: The integrity of the upright guides them, but the perversity of the faithless destroys them.
4 ULB దేవుని ఉగ్రత దినం వచ్చినప్పుడు ఆస్తిపాస్తులు ఉపయోగపడవు. నీతిమంతులు మరణం నుండి తప్పించు కుంటారు. BSB BSB: Riches are worthless in the day of wrath, but righteousness brings deliverance from death.
5 ULB యథార్థవంతుల న్యాయ ప్రవర్తన వారి మార్గాన్ని సరళం చేస్తుంది. దుష్టులు తమ దుర్మార్గ క్రియలవల్ల కూలిపోతారు. BSB BSB: The righteousness of the blameless directs their path, but the wicked fall by their own wickedness.
6 ULB నిజాయితీపరుల మంచితనం వారికి విడుదల కలిగిస్తుంది. ద్రోహులు తమ దురాశ చేత చిక్కుల్లో పడతారు. BSB BSB: The righteousness of the upright delivers them, but the faithless are trapped by their own desires.
7 ULB దుష్టుడు చనిపోయినప్పుడు వాడి ఆశాభావం అంతరించిపోతుంది. బలవంతుడి కోరికలు భగ్నమైపోతాయి. BSB BSB: When the wicked man dies, his hope perishes, and the hope of his strength vanishes.
8 ULB ఉత్తముడు కష్టాల నుండి విడుదల పొందుతాడు. మూర్ఖులు కష్టాలు కొనితెచ్చుకుంటారు. BSB BSB: The righteous man is delivered from trouble; in his place the wicked man goes in.
9 ULB మూర్ఖుడు తన నోటి మాటచేత తన పొరుగువారికి నాశనం కలిగిస్తాడు. నీతిమంతులు తమ తెలివి ఉపయోగించి తప్పించుకుంటారు. BSB BSB: With his mouth the ungodly man destroys his neighbor, but through knowledge the righteous are rescued.
10 ULB నీతిమంతులు దీవెన పొందడం పట్టణానికి శుభదాయకం. దుర్మార్గులు నాశనమైతే ఆనంద ధ్వనులు మోగుతాయి. BSB BSB: When the righteous thrive, the city rejoices, and when the wicked perish, there are shouts of joy.
11 ULB నీతిమంతులు దీవెనలు పొందితే పట్టణం ఉన్నత స్థితికి చేరుతుంది. దుష్టుల మాటలు దాన్ని కూలిపోయేలా చేస్తాయి. BSB BSB: By the blessing of the upright a city is built up, but by the mouth of the wicked it is torn down.
12 ULB తన పొరుగువాణ్ణి కించపరిచేవాడు జ్ఞానహీనుడు. వివేకం గల వాడు మౌనం వహిస్తాడు. BSB BSB: Whoever shows contempt for his neighbor lacks judgment, but a man of understanding remains silent.
13 ULB చాడీలు చెబుతూ తిరిగేవాడు ఇతరుల గుట్టు బయటపెడతాడు. నమ్మకస్థుడు రహస్యాలు దాస్తాడు. BSB BSB: A gossip reveals a secret, but a trustworthy person keeps a confidence.
14 ULB మార్గదర్శకులు లేకపోతే ప్రజలు నాశనం అవుతారు. సలహాలిచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉండడం ప్రజలకు క్షేమకరం. BSB BSB: For lack of guidance, a nation falls, but with many counselors comes deliverance.
15 ULB పరాయివాడి కోసం హామీ ఉన్నవాడు కష్టాలపాలవుతాడు. హామీ ఉండని వాడు భయం లేకుండా ఉంటాడు. BSB BSB: He who puts up security for a stranger will surely suffer, but the one who hates indebtedness is secure.
16 ULB మృదు స్వభావం గల స్త్రీని అందరూ కీర్తిస్తారు. బలం గలవారు సంపద చేజిక్కుంచుకుంటారు. BSB BSB: A gracious woman attains honor, but ruthless men gain only wealth.
17 ULB దయగలవాడు చేసే మంచి పనులు అతనికి మేలు చేస్తాయి. దుష్టుడు తన దుష్ట కార్యాలవల్ల తన శరీరానికి ఆపద తెచ్చుకుంటాడు. BSB BSB: A kind man benefits himself, but a cruel man brings trouble on himself.
18 ULB దుష్టుల సంపద వాళ్ళను మోసపరుస్తుంది. నీతి అనే విత్తనం నాటేవాడు శాశ్వతమైన బహుమానం పొందుతాడు. BSB BSB: The wicked man earns an empty wage, but he who sows righteousness reaps a true reward.
19 ULB వాస్తవమైన నీతి జీవానికి మూలం. అదే పనిగా చెడ్డ కార్యాలు చేసేవాడు తన మరణానికి దగ్గరౌతాడు. BSB BSB: Genuine righteousness leads to life, but the pursuit of evil brings death.
20 ULB మూర్ఖులైన దుష్ట ప్రజలు యెహోవాకు అసహ్యులు. యథార్థవంతులను ఆయన ప్రేమిస్తాడు. BSB BSB: The perverse in heart are an abomination to the LORD, but the blameless in their walk are His delight.
21 ULB భక్తిహీనులకు తప్పకుండా శిక్ష పడుతుంది. నీతిమంతుల సంతతి విడుదల పొందుతారు. BSB BSB: Be assured that the wicked will not go unpunished, but the offspring of the righteous will escape.
22 ULB స్త్రీ ఎంత అందంగా ఉన్నప్పటికీ ఆమెకు వివేకం లేకపోతే ఆ స్త్రీ పంది ముక్కుకు తొడిగిన బంగారు ముక్కుపుడకతో సమానం. BSB BSB: Like a gold ring in a pig’s snout is a beautiful woman who lacks discretion.
23 ULB నీతిమంతులు ఉత్తమమైన వాటినే కోరుకుంటారు. దుష్టుల ఆశలు అహంకార పూరితం. BSB BSB: The desire of the righteous leads only to good, but the hope of the wicked brings wrath.
24 ULB ధారాళంగా ఇచ్చి అభివృద్ధి పొందిన వారు ఉన్నారు. తక్కువ ఇచ్చి దరిద్రులైన వారు కూడా ఉన్నారు. BSB BSB: One gives freely, yet gains even more; another withholds what is right, only to become poor.
25 ULB ఔదార్యం చూపేవారు వర్ధిల్లుతారు. నీళ్లు పోసేవాడికి నీళ్లు పోస్తారు. BSB BSB: A generous soul will prosper, and he who refreshes others will himself be refreshed.
26 ULB ధాన్యం అక్రమంగా నిల్వ చేసే వాణ్ణి ప్రజలు శపిస్తారు. దాన్ని సక్రమంగా అమ్మే వాడికి దీవెనలు కలుగుతాయి. BSB BSB: The people will curse the hoarder of grain, but blessing will crown the one who sells it.
27 ULB మేలు చేయాలని కోరేవాడు ఉపయోగకరమైన పనులు చేస్తాడు. కీడు చేయాలని కోరుకునే వాడికి కీడే కలుగుతుంది. BSB BSB: He who searches out good finds favor, but evil will come to him who seeks it.
28 ULB సంపదను నమ్ముకున్నవాడు చెదిరిపోతాడు. నీతిమంతులు చిగురుటాకుల వలే వృద్ధి చెందుతారు. BSB BSB: He who trusts in his riches will fall, but the righteous will thrive like foliage.
29 ULB తన ఇంటివారిని బాధపెట్టేవాడు గాలికి చెదిరి పోతాడు. వివేకం లేనివాడు జ్ఞానం గలవాడికి సేవకుడు అవుతాడు. BSB BSB: He who brings trouble on his house will inherit the wind, and the fool will be servant to the wise of heart.
30 ULB నీతిమంతులు జీవ వృక్ష ఫలాలు ఫలిస్తారు. జ్ఞానవంతులు ఇతరులను రక్షిస్తారు. BSB BSB: The fruit of the righteous is a tree of life, and he who wins souls is wise.
31 ULB నీతిమంతులు ఈ లోకంలో తగిన ప్రతిఫలం పొందుతారు. అలాగే, దుష్టులకు, పాపులకు తప్పనిసరిగా తగిన ప్రతిఫలం కలుగుతుంది గదా. BSB BSB: If the righteous receive their due on earth, how much more the ungodly and the sinner!
Select verses for actions: Enter goes to them and Escape comes back.