1 ULB బుద్ధిహీనుడై కుటిలంగా మాట్లాడే వాడి కంటే యథార్థంగా ప్రవర్తించే పేదవాడే గొప్ప. BSB BSB: Better a poor man who walks with integrity than a fool whose lips are perverse.
2 ULB ఆలోచన లేకుండా కోరికలుండడం మంచిది కాదు. తొందరపడి పరిగెత్తేవాడు దారి తప్పిపోతాడు. BSB BSB: Even zeal is no good without knowledge, and he who hurries his footsteps misses the mark.
3 ULB ఒకడి మూర్ఖత్వం వాడి బ్రతుకును ధ్వంసం చేస్తుంది. అలాటి వాడు యెహోవా మీద మండిపడతాడు. BSB BSB: A man’s own folly subverts his way, yet his heart rages against the LORD.
4 ULB సంపద స్నేహితులను సమకూరుస్తుంది. దరిద్రుడికి స్నేహితులు దూరమౌతారు. BSB BSB: Wealth attracts many friends, but a poor man is deserted by his friend.
5 ULB అబద్ద సాక్షికి శిక్ష తప్పదు. అబద్ధాలాడేవాడు తప్పించుకోలేడు. BSB BSB: A false witness will not go unpunished, and one who utters lies will not escape.
6 ULB ఉదార గుణం గలవారిని చాలామంది సహాయం కోసం అడుగుతారు. ఇచ్చేవాడికి అందరూ స్నేహితులే. BSB BSB: Many seek the favor of the prince, and everyone is a friend of the gift giver.
7 ULB పేదవాణ్ణి అతని బంధువులంతా ఏవగించుకుంటారు. అలాగైతే అతని స్నేహితులు మరింకెంతగా దూరమైపోతారు! వాడు వాళ్ళను పిలుస్తాడు గానీ వాళ్ళక్కడ ఉండరు. BSB BSB: All the brothers of a poor man hate him—how much more do his friends avoid him! He may pursue them with pleading, but they are nowhere to be found.
8 ULB బుద్ధి సంపాదించుకొనేవాడు తనకు తాను మేలు చేసుకుంటాడు. అవగాహన కలిగిన వాడు మేలైనదాన్ని కనుగొంటాడు. BSB BSB: He who acquires wisdom loves himself; one who safeguards understanding will find success.
9 ULB అబద్ద సాక్షికి శిక్ష తప్పదు. అబద్ధాలాడేవాడు నాశనమౌతాడు. BSB BSB: A false witness will not go unpunished, and one who pours out lies will perish.
10 ULB బుద్ధిహీనుడు సుఖ భోగాలనుభవించడం తగదు. ఒక బానిస రాజులపై ఏలుబడి చేయడం అంతకన్నా తగదు. BSB BSB: Luxury is unseemly for a fool—how much worse for a slave to rule over princes!
11 ULB విచక్షణ ఒక మనిషికి సహనం ఇస్తుంది. తప్పులు చూసీ చూడనట్టు పోవడం అతనికి ఘనత. BSB BSB: A man’s insight gives him patience, and his virtue is to overlook an offense.
12 ULB రాజు కోపం సింహగర్జన లాంటిది. అతని అనుగ్రహం గడ్డి మీద కురిసే మంచు లాంటిది. BSB BSB: A king’s rage is like the roar of a lion, but his favor is like dew on the grass.
13 ULB మూర్ఖుడైన కొడుకు తన తండ్రికి కీడు తెస్తాడు. గయ్యాళి భార్య ఆగకుండా పడుతూ ఉండే నీటి బిందువులతో సమానం. BSB BSB: A foolish son is his father’s ruin, and a quarrelsome wife is like a constant dripping.
14 ULB ఇల్లు, ధనం పూర్వికులనుండి వారసత్వంగా వస్తుంది. అయితే వివేకవతియైన ఇల్లాలిని ఇచ్చేది యెహోవాయే. BSB BSB: Houses and wealth are inherited from fathers, but a prudent wife is from the LORD.
15 ULB సోమరితనం గాఢనిద్రలో పడేస్తుంది. పని చేయడం ఇష్టం లేని వాడు పస్తులుంటాడు. BSB BSB: Laziness brings on deep sleep, and an idle soul will suffer hunger.
16 ULB ఆజ్ఞ పాటించేవాడు తన ప్రాణం కాపాడుకుంటాడు. తన ప్రవర్తన విషయం జాగ్రత్తగా చూసుకోనివాడు చచ్చిపోతాడు. BSB BSB: He who keeps a commandment preserves his soul, but he who is careless in his ways will die.
17 ULB పేదలను ఆదుకోవడం అంటే యెహోవాకు అప్పివ్వడమే. ఆయన తప్పకుండా ఆ రుణం తీరుస్తాడు. BSB BSB: Kindness to the poor is a loan to the LORD, and He will repay the lender.
18 ULB అనువైన కాలంలోనే నీ కుమారుణ్ణి శిక్షించు. అయితే వాణ్ణి చంపాలని చూడొద్దు. BSB BSB: Discipline your son, for in that there is hope; do not be party to his death.
19 ULB పట్టరాని కోపంతో మండిపడే వాడు తప్పకుండా అందుకు తగిన శిక్ష పొందుతాడు. నువ్వు వాణ్ణి తప్పించినా పదే పదే అదే పని నువ్వు చేయవలసి వస్తుంది. BSB BSB: A man of great anger must pay the penalty; if you rescue him, you will have to do so again.
20 ULB సలహా వినిపించుకో, సూచనలను అంగీకరించు. అలా చేశావంటే పెద్దవాడయ్యే నాటికి జ్ఞానివి అవుతావు. BSB BSB: Listen to counsel and accept discipline, that you may be wise the rest of your days.
21 ULB మనిషి హృదయంలో ఆలోచనలు అనేకం. అయితే యెహోవా ఉద్దేశాలే నిలబడతాయి. BSB BSB: Many plans are in a man’s heart, but the purpose of the LORD will prevail.
22 ULB మనిషి హృదయం కోరేది నిబద్ధతే. అబద్ధికుడికంటే దరిద్రుడే మేలు. BSB BSB: The desire of a man is loving devotion; better to be poor than a liar.
23 ULB యెహోవాకు చెందవలసిన భయభక్తులు ఆయనకి చెల్లించాలి. అది జీవ సాధనం. అది ఉన్న వాడు తృప్తిగా బ్రతుకుతాడు. BSB BSB: The fear of the LORD leads to life, that one may rest content, without visitation from harm.
24 ULB సోమరిపోతు గిన్నెలో చెయ్యి పెడతాడుగానీ తన నోటికి దాన్ని ఎత్తనైనా ఎత్తడు. BSB BSB: The slacker buries his hand in the dish; he will not even bring it back to his mouth.
25 ULB హేళన చేసే వారిని దండించు, అది చూసి ఆజ్ఞానులు బుద్ధి తెచ్చుకుంటారు. వివేకులను గద్దించినట్టయితే వారు జ్ఞానంలో ఎదుగుతారు. BSB BSB: Strike a mocker, and the simple will beware; rebuke the discerning man, and he will gain knowledge.
26 ULB తండ్రిని బాధిస్తూ తల్లిని తరిమేసేవాడు సిగ్గు, అపకీర్తి తెచ్చే కొడుకు. BSB BSB: He who assaults his father or evicts his mother is a son who brings shame and disgrace.
27 ULB కుమారా, బుద్ధి చెప్పే మాటలు వినడం మానుకుంటే జ్ఞాన వాక్కులకు నీవు దూరమై పోతావు. BSB BSB: If you cease to hear instruction, my son, you will stray from the words of knowledge.
28 ULB చెడిపోయిన సాక్షి న్యాయాన్ని గేలి చేస్తాడు. దుర్మార్గుల నోరు దోషాన్ని జుర్రుకుంటుంది. BSB BSB: A corrupt witness mocks justice, and a wicked mouth swallows iniquity.
29 ULB అపహాస్యం చేసేవారికి తీర్పు, బుద్ధిహీనుల వీపుకు దెబ్బలు. BSB BSB: Judgments are prepared for mockers, and beatings for the backs of fools.
Select verses for actions: Enter goes to them and Escape comes back.