1 ULB కుమారా, నీవు నా మాటలు అంగీకరించి, నా ఆజ్ఞలను నీ మనసులో ఉంచుకుంటే దేవుణ్ణి గూర్చిన వివేచన నీకు దొరుకుతుంది. BSB BSB: My son, if you accept my words and hide my commandments within you,
2 ULB జ్ఞానంపై మనసు నిలిపి హృదయపూర్వకంగా వివేచన అభ్యాసం చేసినప్పుడు, BSB BSB: if you incline your ear to wisdom and direct your heart to understanding,
3 ULB తెలివితేటల కోసం మొరపెట్టినప్పుడు, వివేచన కోసం వేడుకొన్నప్పుడు, BSB BSB: if you truly call out to insight and lift your voice to understanding,
4 ULB పోగొట్టుకున్న వెండిని వెతికినట్టు దాన్ని వెదికినప్పుడు, దాచుకున్న ధనం కోసం వెతికినట్టు జ్ఞానాన్ని వెతికినప్పుడు, BSB BSB: if you seek it like silver and search it out like hidden treasure,
5 ULB యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఉండడం ఎలా ఉంటుందో నువ్వు గ్రహిస్తావు. దేవుణ్ణి గూర్చిన విజ్ఞానం నీకు దొరుకుతుంది. BSB BSB: then you will discern the fear of the LORD and discover the knowledge of God.
6 ULB యెహోవా మాత్రమే జ్ఞానం అనుగ్రహిస్తాడు. తెలివి, వివేచన ఆయన మాటల్లో నిండి ఉంటాయి. BSB BSB: For the LORD gives wisdom; from His mouth come knowledge and understanding.
7 ULB యథార్థవంతులను ఆయన వర్ధిల్లజేస్తాడు. సరియైన మార్గం నుండి తప్పిపోకుండా నడుచుకునే వాళ్ళకు ఆయన రక్షణ కలుగజేస్తాడు. BSB BSB: He stores up sound wisdom for the upright; He is a shield to those who walk with integrity,
8 ULB న్యాయ ప్రవర్తన నుండి తొలగిపోకుండా ఆయన కనిపెట్టుకుని ఉంటాడు. తన భక్తులు మంచి ప్రవర్తనలో కొనసాగేలా ఆయన కావలి కాస్తాడు. BSB BSB: to guard the paths of justice and protect the way of His saints.
9 ULB అప్పుడు నీతి, న్యాయం, యథార్థత అనే మంచి మార్గాలు నువ్వు తెలుసుకుంటావు. BSB BSB: Then you will discern righteousness and justice and equity—every good path.
10 ULB జ్ఞానం నీ హృదయంలోకి చొచ్చుకుపోతుంది. తెలివి కలిగి ఉండడం నీకు ఇష్టంగా ఉంటుంది. BSB BSB: For wisdom will enter your heart, and knowledge will delight your soul.
11 ULB తెలివితేటలు నిన్ను కాపాడతాయి. వివేకం నీకు కాపలా కాస్తుంది. BSB BSB: Discretion will watch over you, and understanding will guard you,
12 ULB అది దుష్టులు నడిచే మార్గాల నుండి, మూర్ఖపు మాటలు మాట్లాడే వారి బారి నుండి నిన్ను కాపాడుతుంది. BSB BSB: to deliver you from the way of evil, from the man who speaks perversity,
13 ULB దుష్టులు చీకటి మార్గాల్లో నడవడం కోసం యథార్థమైన మార్గాలను విడిచిపెడతారు. BSB BSB: from those who leave the straight paths to walk in the ways of darkness,
14 ULB కీడు చేసేవాళ్ళు తమ పనుల వల్ల సంతోషిస్తారు. తీవ్రమైన మూర్ఖత్వంతో ప్రవర్తించే వాళ్ళను చూసి ఆనందిస్తారు. BSB BSB: from those who enjoy doing evil and rejoice in the twistedness of evil,
15 ULB తమ దుష్ట మార్గాలగుండా పయనిస్తారు. వాళ్ళు కపటంతో ఉంటారు. BSB BSB: whose paths are crooked and whose ways are devious.
16 ULB వ్యభిచారి వలలో పడకుండా, తియ్యగా మాట్లాడి మోసపుచ్చే వేశ్య బారి నుండి జ్ఞానం నిన్ను కాపాడుతుంది. BSB BSB: It will rescue you from the forbidden woman, from the stranger with seductive words
17 ULB అలాంటి స్త్రీ తన యవ్వనకాలంలో తన భర్తను విడిచిపెట్టి తన దేవుని నిబంధన పెడచెవిన పెడుతుంది. BSB BSB: who abandons the partner of her youth and forgets the covenant of her God.
18 ULB ఆ స్త్రీ ఇల్లు మరణానికి నడిపిస్తుంది. ఆ స్త్రీ నడిచే మార్గం శవాల దగ్గరికి చేరుతుంది. BSB BSB: For her house sinks down to death, and her tracks to the departed spirits.
19 ULB ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఎవ్వరూ వెనక్కి తిరిగిరారు. వాళ్ళు జీవమార్గం చేరుకోలేరు. BSB BSB: None who go to her return or negotiate the paths of life.
20 ULB నేను చెప్పే మాటలు విని ఆ విధంగా నడుచుకుంటే నువ్వు యథార్థవంతులు నడిచే మార్గంలో నడుచుకుంటావు. నీతిమంతుల ప్రవర్తన అనుసరిస్తావు. BSB BSB: So you will follow in the ways of the good, and keep to the paths of the righteous.
21 ULB నిజాయితీపరులు దేశంలో కాపురం ఉంటారు. సత్యవర్తనులు దేశంలో స్థిరంగా ఉంటారు. BSB BSB: For the upright will inhabit the land, and the blameless will remain in it;
22 ULB చెడ్డ పనులు చేసేవారు నిర్మూలం అవుతారు. నమ్మకద్రోహులు దేశంలో లేకుండా పోతారు. BSB BSB: but the wicked will be cut off from the land, and the unfaithful will be uprooted.
Select verses for actions: Enter goes to them and Escape comes back.