1 ULB కుమారా, నేను బోధించే ఉపదేశాన్ని మనసులో ఉంచుకో. నేను బోధించే ఆజ్ఞలు హృదయపూర్వకంగా ఆచరించు. BSB BSB: My son, do not forget my teaching, but let your heart keep my commandments;
2 ULB అవి నీకు మనశ్శాంతితో కూడిన ఆయుష్షును, సుఖంగా జీవించే కాలాన్ని కలగజేస్తాయి. BSB BSB: for they will add length to your days, years and peace to your life.
3 ULB అన్ని వేళలా దయ, సత్య ప్రవర్తన కలిగి ఉండు. వాటిని మెడలో హారాలుగా ధరించుకో. నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకో. BSB BSB: Never let loving devotion or faithfulness leave you; bind them around your neck, write them on the tablet of your heart.
4 ULB అప్పుడు దేవుని కృప, మనుషుల కృప పొంది నీతిమంతుడవని అనిపించుకుంటావు. BSB BSB: Then you will find favor and high regard in the sight of God and man.
5 ULB నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో. BSB BSB: Trust in the LORD with all your heart, and lean not on your own understanding;
6 ULB ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు. BSB BSB: in all your ways acknowledge Him, and He will make your paths straight.
7 ULB నేను జ్ఞానం గలవాణ్ణి అనుకోవద్దు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండి చెడుతనానికి దూరంగా ఉండు. BSB BSB: Be not wise in your own eyes; fear the LORD and turn away from evil.
8 ULB అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగుతాయి. BSB BSB: This will bring healing to your body and refreshment to your bones.
9 ULB యెహోవాకు నీ రాబడి మొత్తంలో ప్రథమ ఫలం, నీ ఆస్తిలో వాటా ఇచ్చి ఆయనను ఘనపరచు. BSB BSB: Honor the LORD with your wealth and with the firstfruits of all your crops;
10 ULB అలా చేస్తే నీ వాకిట్లో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. నీ గానుగల్లో కొత్త ద్రాక్షారసం పొంగి పారుతుంది. BSB BSB: then your barns will be filled with plenty, and your vats will overflow with new wine.
11 ULB కుమారా, యెహోవా బోధను తిరస్కరించకు. ఆయన గద్దించినప్పుడు విసుగు తెచ్చుకోకు. BSB BSB: My son, do not reject the discipline of the LORD, and do not loathe His rebuke;
12 ULB ఒక తండ్రి తన ప్రియమైన కొడుకును ఎలా గద్దిస్తాడో అలాగే యెహోవా తాను ప్రేమించే వాళ్ళను గద్దిస్తాడు. BSB BSB: for the LORD disciplines the one He loves, as does a father the son in whom he delights.
13 ULB జ్ఞానం సంపాదించుకుని, వివేకం కలిగి ఉన్న మనిషి ధన్యుడు. BSB BSB: Blessed is the man who finds wisdom, the man who acquires understanding,
14 ULB వెండి వలన పొందే లాభం కన్నా జ్ఞానం సంపాదించుకోవడం మంచిది. మేలిమి బంగారం సంపాదించుకోవడం కన్నా జ్ఞానం వలన లాభం పొందడం ఉత్తమం. BSB BSB: for she is more profitable than silver, and her gain is better than fine gold.
15 ULB రత్నాల కంటే జ్ఞానం శ్రేష్ఠమైనది. అది నీకు ఇష్టమైన అన్ని వస్తువుల కంటే విలువైనది. BSB BSB: She is more precious than rubies; nothing you desire compares with her.
16 ULB జ్ఞానం కుడి చేతిలో సుదీర్ఘమైన ఆయుష్షు, ఎడమ చేతిలో సంపదలు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. BSB BSB: Long life is in her right hand; in her left hand are riches and honor.
17 ULB అది నడిపించే దారులు రమ్యమైనవి. దాని విధానాలు క్షేమం కలిగించేవి. BSB BSB: All her ways are pleasant, and all her paths are peaceful.
18 ULB దాన్ని అనుసరించే వాళ్ళకు అది జీవఫలాలిచ్చే వృక్షం. దాన్ని అలవరచుకునే వాళ్ళు ధన్యజీవులు. BSB BSB: She is a tree of life to those who embrace her, and those who lay hold of her are blessed.
19 ULB తన జ్ఞానంతో యెహోవా భూమిని సృష్టించాడు. వివేకంతో ఆయన ఆకాశ మండలాలను స్థిరపరచాడు. BSB BSB: The LORD founded the earth by wisdom and established the heavens by understanding.
20 ULB ఆయన తెలివివల్ల జలరాసులు అగాథం నుండి ప్రవహిస్తున్నాయి. ఆకాశంలోని మేఘాలు మంచు బిందువులు కురిపిస్తున్నాయి. BSB BSB: By His knowledge the watery depths were broken open, and the clouds dripped with dew.
21 ULB కుమారా, లోతైన జ్ఞానాన్ని, వివేకాన్ని పదిలం చేసుకో. వాటిని నీ మనసులో నుండి తొలగి పోనివ్వకు. BSB BSB: My son, do not lose sight of this: Preserve sound judgment and discernment.
22 ULB జ్ఞానం, వివేకాలు నీకు ప్రాణప్రదంగా, నీ మెడలో అలంకారాలుగా ఉంటాయి. BSB BSB: They will be life to your soul and adornment to your neck.
23 ULB అప్పుడు నువ్వు నడిచే మార్గాల్లో భద్రంగా ఉంటావు. నీ నడక ఎప్పుడూ తొట్రుపడదు. BSB BSB: Then you will go on your way in safety, and your foot will not stumble.
24 ULB పండుకొనే సమయంలో నీకు భయం వెయ్యదు. నీవు పండుకుని హాయిగా నిద్రపోతావు. BSB BSB: When you lie down, you will not be afraid; when you rest, your sleep will be sweet.
25 ULB అకస్మాత్తుగా భయం వేస్తే కలవరపడకు. దుర్మార్గులు నాశనం అవుతున్నప్పుడు అది చూసి నువ్వు భయపడవద్దు. BSB BSB: Do not fear sudden danger or the ruin that overtakes the wicked,
26 ULB యెహోవాయే నీకు అండగా ఉంటాడు. నీ కాలు ఊబిలో చిక్కుకోకుండా ఆయన నిన్ను కాపాడతాడు. BSB BSB: for the LORD will be your confidence and will keep your foot from the snare.
27 ULB అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి నీకు అవకాశం ఉన్నప్పుడు దాన్ని చేయడానికి వెనకడుగు వెయ్యవద్దు. BSB BSB: Do not withhold good from the deserving when it is within your power to act.
28 ULB నీ పొరుగువాడు కోరినది నీ దగ్గర ఉంటే <<రేపు ఇస్తాను పోయి రా>> అనవద్దు. BSB BSB: Do not tell your neighbor, “Come back tomorrow and I will provide”—when you already have the means.
29 ULB నీ పొరుగువాడు నీ దగ్గర భయం ఏమీ లేకుండా జీవిస్తున్నప్పుడు అతనికి కీడు తలపెట్టవద్దు. BSB BSB: Do not devise evil against your neighbor, for he trustfully dwells beside you.
30 ULB నీకేమీ కీడు తలపెట్టని వాడితో కారణం లేకుండా పోట్లాడవద్దు. BSB BSB: Do not accuse a man without cause, when he has done you no harm.
31 ULB దౌర్జన్యం చేసేవాణ్ణి చూసి అసూయ పడవద్దు. వాడు చేసే పనులు నువ్వు చెయ్యాలని ఏమాత్రం కోరుకోవద్దు. BSB BSB: Do not envy a violent man or choose any of his ways;
32 ULB కుటిల బుద్ధి గలవాణ్ణి యెహోవా అసహ్యించుకుంటాడు. నీతిమంతులకు ఆయన తోడుగా ఉంటాడు. BSB BSB: for the LORD detests the perverse, but He is a friend to the upright.
33 ULB దుర్మార్గుల ఇళ్ళ మీదికి యెహోవా శాపాలు పంపిస్తాడు. నీతిమంతులు నివసించే స్థలాలను ఆయన దీవిస్తాడు. BSB BSB: The curse of the LORD is on the house of the wicked, but He blesses the home of the righteous.
34 ULB ఎగతాళి చేసేవాళ్ళను ఆయన ఎగతాళి చేస్తాడు. దీనమనస్సు గలవారిని ఆయన కనికరిస్తాడు. BSB BSB: He mocks the mockers, but gives grace to the humble.
35 ULB జ్ఞానం గలవారు పేరుప్రతిష్టలు సంపాదించుకుంటారు. జ్ఞానం లేనివాళ్ళు అవమానాలకు గురౌతారు. BSB BSB: The wise will inherit honor, but fools are held up to shame.
Select verses for actions: Enter goes to them and Escape comes back.