1 ULB కుమారులారా, తండ్రి చెప్పే మంచి మాటలు విని వివేకం తెచ్చుకోండి. BSB BSB: Listen, my sons, to a father’s instruction; pay attention and gain understanding.
2 ULB నేను మీకు మంచి మాటలు చెబుతాను. నా మాటలు పెడచెవిన పెట్టకండి. BSB BSB: For I give you sound teaching; do not abandon my directive.
3 ULB నేను నా తండ్రి కుమారుణ్ణి. నా తల్లికి నేను అందమైన ఏకైక కుమారుణ్ణి. BSB BSB: When I was a son to my father, tender and the only child of my mother,
4 ULB ఆయన నాకు బోధ చేస్తూ ఇలా చెప్పాడు<<నేను చెప్పే మాటలు శ్రద్ధగా విని వాటిని నీ హృదయంలో నిలిచిపోనివ్వు. వాటిని విని వాటి ప్రకారం నడుచుకుంటే నువ్వు జీవిస్తావు. BSB BSB: he taught me and said, “Let your heart lay hold of my words; keep my commands and you will live.
5 ULB జ్ఞానం, వివేకం సంపాదించుకో. నా మాటలను విస్మరించ వద్దు, వాటినుండి తొలగిపోవద్దు. BSB BSB: Get wisdom, get understanding; do not forget my words or turn from them.
6 ULB జ్ఞానాన్ని విడిచిపెట్టకుండా ఉంటే అది నిన్ను కాపాడుతుంది. దాన్ని ప్రేమిస్తూ ఉంటే అది నిన్ను రక్షిస్తుంది. BSB BSB: Do not forsake wisdom, and she will preserve you; love her, and she will guard you.
7 ULB జ్ఞానం సంపాదించుకోవడమే బుద్ధి వివేకాలకు మూలం. జ్ఞానం కోసం నీకు ఉన్నదంతా ఖర్చు పెట్టు. BSB BSB: Wisdom is supreme; so acquire wisdom. And whatever you may acquire, gain understanding.
8 ULB నువ్వు జ్ఞానాన్ని గౌరవిస్తే అది నిన్ను గొప్ప చేస్తుంది. దాన్ని హత్తుకుని ఉంటే అది నీకు పేరు ప్రతిష్టలు తెస్తుంది. BSB BSB: Prize her, and she will exalt you; if you embrace her, she will honor you.
9 ULB అది నీ తలపై అందమైన పాగా ఉంచుతుంది. ప్రకాశవంతంగా వెలిగే అందమైన కిరీటం నీకు దయచేస్తుంది. BSB BSB: She will set a garland of grace on your head; she will present you with a crown of beauty.”
10 ULB కుమారా, నీవు నా మాటలు విని, వాటి ప్రకారం నడుచుకుంటే నీకు అధిక ఆయుష్షు కలుగుతుంది. BSB BSB: Listen, my son, and receive my words, and the years of your life will be many.
11 ULB జ్ఞానం కలిగి ఉండే మార్గం నీకు బోధించాను. యథార్థమైన బాటలో నిన్ను నడిపించాను. BSB BSB: I will guide you in the way of wisdom; I will lead you on straight paths.
12 ULB నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ అడుగులు చిక్కుపడవు. నీవు పరుగెత్తే సమయంలో నీ పాదాలు తొట్రుపడవు. BSB BSB: When you walk, your steps will not be impeded; when you run, you will not stumble.
13 ULB అది నీ ఊపిరి కనుక దాన్ని సంపాదించుకో. దాన్ని విడిచిపెట్టకుండా భద్రంగా పదిలం చేసుకో. BSB BSB: Hold on to instruction; do not let go. Guard it, for it is your life.
14 ULB భక్తిహీనుల గుంపులో చేరవద్దు. దుర్మార్గుల ఆలోచనలతో ఏకీభవించవద్దు. BSB BSB: Do not set foot on the path of the wicked or walk in the way of evildoers.
15 ULB అందులోకి వెళ్ళకుండా తప్పించుకు తిరుగు. దాని నుండి తొలగిపోయి ముందుకు సాగిపో. BSB BSB: Avoid it; do not travel on it. Turn from it and pass on by.
16 ULB ఇతరులకు కీడు చేస్తేనేగాని అలాంటి వాళ్లకి నిద్ర పట్టదు. ఎదుటి వారిని కించపరచకుండా వారు నిద్రపోరు. BSB BSB: For they cannot sleep unless they do evil; they are deprived of slumber until they make someone fall.
17 ULB వాళ్ళు దౌర్జన్యం చేసి తమ ఆహారం సంపాదించుకుంటారు. బలవంతంగా ద్రాక్షారసం లాక్కుని తాగుతారు. BSB BSB: For they eat the bread of wickedness and drink the wine of violence.
18 ULB ఉదయాన్నే మొదలైన సూర్యుని వెలుగు మరింతగా పెరుగుతున్నట్టు నీతిమంతుల మార్గం అంతకంతకూ ప్రకాశిస్తుంది. BSB BSB: The path of the righteous is like the first gleam of dawn, shining brighter and brighter until midday.
19 ULB దుష్టుల మార్గం చీకటిమయం. వాళ్ళు ఎక్కడెక్కడ పడిపోతారో వాళ్ళకే తెలియదు. BSB BSB: But the way of the wicked is like the darkest gloom; they do not know what makes them stumble.
20 ULB కుమారా, నేను చెప్పే మాటలు విను. నా నీతి బోధలు మనసులో ఉంచుకో. BSB BSB: My son, pay attention to my words; incline your ear to my sayings.
21 ULB నీ మార్గం అంతటిలో నుండి వాటిని అనుసరించు. నీ హృదయంలో వాటిని భద్రంగా దాచుకో. BSB BSB: Do not lose sight of them; keep them within your heart.
22 ULB అవి దొరికిన వారికి జీవం కలుగుతుంది. వాళ్ళ శరీరమంతటికీ ఆరోగ్యం కలిగిస్తాయి. BSB BSB: For they are life to those who find them, and health to the whole body.
23 ULB అన్నిటికంటే ముఖ్యంగా వాటిని నీ హృదయంలో భద్రంగా కాపాడుకో. అప్పుడు నీ హృదయంలో నుండి జీవధారలు ప్రవహిస్తాయి. BSB BSB: Guard your heart with all diligence, for from it flow springs of life.
24 ULB నీ నోటి నుండి కుటిలమైన మాటలు, మోసకరమైన మాటలు రానియ్యకు. BSB BSB: Put away deception from your mouth; keep your lips from perverse speech.
25 ULB నీ కంటిచూపు సూటిగా ఉండనియ్యి. నీ ఆలోచనల్లో ముందు చూపు కలిగి ఉండు. BSB BSB: Let your eyes look forward; fix your gaze straight ahead.
26 ULB నువ్వు నడిచే మార్గం సరళం చెయ్యి. అప్పుడు నీ దారులన్నీ స్థిరపడతాయి. BSB BSB: Make a level path for your feet, and all your ways will be sure.
27 ULB కుడివైపుకు గానీ, ఎడమవైపుకు గానీ తొలగిపోవద్దు. దుర్మార్గం వైపు నడవకుండా నీ అడుగులు తప్పించుకో.>> BSB BSB: Do not swerve to the right or to the left; turn your feet away from evil.
Select verses for actions: Enter goes to them and Escape comes back.