1 ULB గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారాలకంటే దయ మరింత అభిలషించ దగినవి. BSB BSB: A good name is more desirable than great riches; favor is better than silver and gold.
2 ULB ఐశ్వర్యవంతులు, దరిద్రులు వీరిద్దరినీ సృష్టించింది యెహోవాయే. BSB BSB: The rich and the poor have this in common: The LORD is Maker of them all.
3 ULB బుద్ధిమంతుడు అపాయం రావడం చూసి దాక్కుంటాడు. ఆజ్ఞానులు అనాలోచనగా పోయి బాధలు కొని తెచ్చుకుంటారు. BSB BSB: The prudent see danger and take cover, but the simple keep going and suffer the consequences.
4 ULB యెహోవా పట్ల భయభక్తులు వినయాన్ని, ఐశ్వర్యాన్ని, ఘనతను, జీవాన్ని తెస్తాయి. BSB BSB: The rewards of humility and the fear of the LORD are wealth and honor and life.
5 ULB ముళ్ళు, ఉచ్చులు మూర్ఖుల దారిలో ఉన్నాయి. తనను కాపాడుకొనేవాడు వాటికి దూరంగా ఉంటాడు. BSB BSB: Thorns and snares lie on the path of the perverse; he who guards his soul stays far from them.
6 ULB పసివాడు నడవాల్సిన మార్గమేదో వాడికి నేర్పించు. వయసు పైబడినా వాడు అందులోనుండి తొలగడు. BSB BSB: Train up a child in the way he should go, and when he is old he will not depart from it.
7 ULB ఐశ్వర్యవంతుడు పేదలపై పెత్తనం చేస్తాడు. అప్పుచేసిన వాడు అప్పిచ్చిన వాడికి బానిస. BSB BSB: The rich rule over the poor, and the borrower is slave to the lender.
8 ULB దుర్మార్గాన్ని విత్తనంగా చల్లేవాడు కీడు అనే పంట కోసుకుంటాడు. వాడి క్రోధమనే కర్ర నిరర్థకమై పోతుంది. BSB BSB: He who sows injustice will reap disaster, and the rod of his fury will be destroyed.
9 ULB ఉదార గుణం గలవాడికి దీవెన. ఎందుకంటే అతడు తన ఆహారంలో కొంత పేదవాడికి ఇస్తాడు. BSB BSB: A generous man will be blessed, for he shares his bread with the poor.
10 ULB తిరస్కారబుద్ధి గలవాణ్ణి వెళ్ళగొట్టు. కలహాలు, పోరాటాలు, అవమానాలు వాటంతట అవే సద్దు మణుగుతాయి. BSB BSB: Drive out the mocker, and conflict will depart; even quarreling and insults will cease.
11 ULB శుద్ధ హృదయాన్ని ప్రేమిస్తూ ఇంపైన మాటలు పలికే వాడికి రాజు స్నేహితుడౌతాడు. BSB BSB: He who loves a pure heart and gracious lips will have the king for a friend.
12 ULB జ్ఞానం గలవాడిపై యెహోవా చూపు నిలుపుకుని అతణ్ణి కాపాడతాడు. విశ్వాస ఘాతకుల మాటలు ఆయన కొట్టి పారేస్తాడు. BSB BSB: The LORD’s eyes keep watch over knowledge, but He frustrates the words of the faithless.
13 ULB సోమరి <<బయట సింహం ఉంది, బయటికి వెళ్తే చచ్చిపోతాను>> అంటాడు. BSB BSB: The slacker says, “There is a lion outside! I will be slain in the streets!”
14 ULB వేశ్య నోరు లోతైన గొయ్యి. యెహోవా శాపాన్ని మూటగట్టుకున్నవాడు దానిలో పడతాడు. BSB BSB: The mouth of an adulteress is a deep pit; he who is under the wrath of the LORD will fall into it.
15 ULB పిల్లవాడి హృదయంలో మూఢత్వం సహజంగానే ఉంటుంది. బెత్తంతో విధించే శిక్ష దాన్ని వాడిలోనుండి తోలివేస్తుంది. BSB BSB: Foolishness is bound up in the heart of a child, but the rod of discipline drives it far from him.
16 ULB తన ఆస్తిపాస్తులు పెంచుకోవాలని పేదలను పీడించే వారికి, ధనవంతులకే ఇచ్చే వాడికి నష్టమే కలుగుతుంది. BSB BSB: Oppressing the poor to enrich oneself or giving gifts to the rich will surely lead to poverty.
17 ULB శ్రద్ధగా జ్ఞానుల ఉపదేశం ఆలకించు. నేనిచ్చే తెలివిని పొందడానికి మనసు లగ్నం చెయ్యి. BSB BSB: Incline your ear and hear the words of the wise—apply your mind to my knowledge—
18 ULB నీ అంతరంగంలో వాటిని నిలుపుకోవడం, అవన్నీ నీ పెదవులపై ఉండడం ఎంతో రమ్యం. BSB BSB: for it is pleasing when you keep them within you and they are constantly on your lips.
19 ULB నీవు యెహోవాను ఆశ్రయించేలా నీకు, అవును, నీకే గదా నేను ఈ రోజున వీటిని ఉపదేశించాను? BSB BSB: So that your trust may be in the LORD, I instruct you today—yes, you.
20 ULB వివేకం, విచక్షణ గల శ్రేష్ఠమైన సూక్తులు నేను నీకోసం రాయలేదా? BSB BSB: Have I not written for you thirty sayings about counsel and knowledge,
21 ULB నిన్ను పంపేవారికి నీవు యథార్థంగా జవాబులిచ్చేలా, నమ్మదగిన సత్యవాక్కులు నీకు నేర్పించ లేదా? BSB BSB: to show you true and reliable words, that you may soundly answer those who sent you?
22 ULB పేదవాడు గదా అని పేదవాణ్ణి దోచుకోవద్దు. పట్టణ ద్వారాల దగ్గర నిస్సహాయులను నలగ గొట్టవద్దు. BSB BSB: Do not rob a poor man because he is poor, and do not crush the afflicted at the gate,
23 ULB యెహోవా వారి పక్షంగా వాదిస్తాడు. వారిని దోచుకొనేవారి ప్రాణాలు ఆయన దోచుకుంటాడు. BSB BSB: for the LORD will take up their case and will plunder those who rob them.
24 ULB కోపం అదుపులో ఉంచుకోలేని వాడితో స్నేహం చెయ్య వద్దు. క్రోధంతో రంకెలు వేసే వాడి దగ్గరికి వెళ్ల వద్దు. BSB BSB: Do not make friends with an angry man, and do not associate with a hot-tempered man,
25 ULB నువ్వు కూడా వాడి ధోరణి నేర్చుకుని నీ ప్రాణానికి ఉరి తెచ్చుకుంటావేమో జాగ్రత్త. BSB BSB: or you may learn his ways and entangle yourself in a snare.
26 ULB అప్పులకు హామీ ఉండకు. ఇతరుల బాకీలకు పూచీ తీసుకోకు. BSB BSB: Do not be one who gives pledges, who puts up security for debts.
27 ULB ఆ అప్పు తీర్చడానికి నీ దగ్గర ఏమీ లేకపోతే వాడు నువ్వు పడుకునే పరుపు తీసుకు పోకుండా ఆపడం ఎలా? BSB BSB: If you have nothing with which to pay, why should your bed be taken from under you?
28 ULB నీ పూర్వీకులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. BSB BSB: Do not move an ancient boundary stone which your fathers have placed.
29 ULB తన పనిలో నిపుణతగల వాణ్ణి చూసావా? వాడు రాజుల సమక్షంలోనే నిలబడతాడు, మామూలు వాళ్ళ ఎదుట కాదు. BSB BSB: Do you see a man skilled in his work? He will be stationed in the presence of kings; he will not stand before obscure men.
Select verses for actions: Enter goes to them and Escape comes back.