1 ULB ఇవికూడా సొలొమోను సామెతలే. యూదారాజు హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి రాసారు. BSB BSB: These are additional proverbs of Solomon, which were copied by the men of Hezekiah king of Judah:
3 ULB ఆకాశాల ఎత్తు, భూమి లోతు, రాజుల అభిప్రాయం అగమ్యగోచరం. BSB BSB: As the heavens are high and the earth is deep, so the hearts of kings cannot be searched.
4 ULB వెండిలోని కల్మషం తీసేస్తే లోహకారుడు తన పనితనంతో వస్తువు తయారు చేస్తాడు. BSB BSB: Remove the dross from the silver, and a vessel for a silversmith will come forth.
5 ULB రాజు సముఖం నుండి దుష్టులను తొలగించ గలిగితే అతని సింహాసనం నీతిమూలంగా స్థిరం అవుతుంది. BSB BSB: Remove the wicked from the king’s presence, and his throne will be established in righteousness.
6 ULB రాజు ఎదుట నీ గొప్ప చెప్పుకోకు. గొప్పవారికి కేటాయించిన చోట ఉండవద్దు. BSB BSB: Do not exalt yourself in the presence of the king, and do not stand in the place of great men;
7 ULB నీవు గమనించి చూసిన ప్రధాని ఎదుట ఎవరైనా నిన్ను తగ్గించడం కంటే <<ఈ పైచోటికి రా>> అని అతడు నీతో చెప్పడం మంచిది కదా. BSB BSB: for it is better to be told, “Come up here!” than to be demoted in the presence of the prince. Even what you have seen with your own eyes,
8 ULB అనాలోచితంగా న్యాయ స్థానానికి పోవద్దు. చివరికి నీ పొరుగువాడు నిన్ను అవమాన పరచి <<ఇక నువ్వేమి చేస్తావు?>> అని నీతో అంటాడు కదా. BSB BSB: do not bring hastily to court. Otherwise, what will you do in the end when your neighbor puts you to shame?
9 ULB నీ పొరుగువాడితో నీవు వాదులాడ వచ్చు గానీ ఎదుటి వ్యక్తి గుట్టు నలుగురిలో రట్టు చెయ్యవద్దు. BSB BSB: Argue your case with your neighbor without betraying another’s confidence,
10 ULB అలా చేస్తే వినేవాడు నిన్ను అవమానపరుస్తాడేమో. ఆ విధంగా నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి మాసిపోదు. BSB BSB: lest he who hears you bring shame upon you, and your infamy never go away.
11 ULB సమయోచితంగా పలికిన మాట వెండి పళ్ళెంలో పొదిగిన బంగారు పండ్ల వంటిది. BSB BSB: A word fitly spoken is like apples of gold in settings of silver.
12 ULB బంగారు చెవిపోగులు ఎలాటివో స్వర్ణాభరణాలు ఎలాటివో వినే వాడి చెవికి జ్ఞానం గల ఉపదేశకుడు అలాటి వాడు. BSB BSB: Like an earring of gold or an ornament of fine gold is a wise man’s rebuke to a listening ear.
13 ULB నమ్మకమైన దూత తనను పంపిన వారిపాలిట కోతకాలపు మంచు చల్లదనం వంటి చల్లదనం గలవాడు. వాడు తన యజమానుల హృదయానికి ఆహ్లాదం కలిగిస్తాడు. BSB BSB: Like the cold of snow in the time of harvest is a trustworthy messenger to those who send him; he refreshes the soul of his masters.
14 ULB ఏమీ ఇవ్వకుండానే ఇచ్చానని సొంత డబ్బా వాయించుకునే వాడు వర్షం లేని మబ్బుతో గాలితో సమానం. BSB BSB: Like clouds and wind without rain is the man who boasts of gifts never given.
15 ULB సహనంతో న్యాయాధిపతిని ఒప్పించవచ్చు. సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టగలదు. BSB BSB: Through patience a ruler can be persuaded, and a gentle tongue can break a bone.
16 ULB నీకు తేనె దొరికితే మితంగా తిను. మితిమీరి తింటే ఒకవేళ కక్కి వేస్తావేమో. BSB BSB: If you find honey, eat just what you need, lest you have too much and vomit it up.
17 ULB మాటిమాటికి నీ పొరుగువాడి ఇంటికి వెళ్లకు. అతడు విసికిపోయి నిన్ను ద్వేషిస్తాడేమో. BSB BSB: Seldom set foot in your neighbor’s house, lest he grow weary and hate you.
18 ULB తన పొరుగువాడిపై అబద్ధ సాక్ష్యం పలికేవాడు యుద్ధంలో వాడే గదలాంటి వాడు, కత్తిలాంటి వాడు. వాడియైన బాణం వంటివాడు. BSB BSB: Like a club or sword or sharp arrow is a man who bears false witness against his neighbor.
19 ULB కష్టకాలంలో విశ్వాస ఘాతకుణ్ణి ఆశ్రయించడం విరిగిన పన్నుతో, కీలు వసిలిన కాలుతో సమానం. BSB BSB: Like a broken tooth or a foot out of joint is confidence in a faithless man in time of trouble.
20 ULB దుఃఖితుడి ఎదుట పాటలు వినిపించేవాడు చలి రోజున పైబట్ట తీసివేసే వాడితోను సూరేకారం మీద చిరక పోసే వాడితోను సమానం. BSB BSB: Like one who removes a garment on a cold day or vinegar poured on a wound is one who sings songs to a heavy heart.
21 ULB నీ పగవాడు ఆకలిగా ఉంటే వాడికి అన్నం పెట్టు. దాహంతో ఉంటే వాడికి మంచినీళ్ళు ఇవ్వు. BSB BSB: If your enemy is hungry, give him food to eat, and if he is thirsty, give him water to drink.
22 ULB అలా చేస్తే వాడి తలపై నిప్పులు కుప్పగా పోసిన వాడివౌతావు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిస్తాడు. BSB BSB: For in so doing, you will heap burning coals on his head, and the LORD will reward you.
23 ULB ఉత్తర వాయువు వాన తెస్తుంది. అలానే గుట్టు బయట పెట్టేవాడి ముఖం గంభీరంగా ఉంటుంది. BSB BSB: As the north wind brings forth rain, so a backbiting tongue brings angry looks.
24 ULB గయ్యాళితో పెద్ద భవంతిలో ఉండడం కంటే మిద్దెమీద ఒక మూలన ఉండడమే హాయి. BSB BSB: Better to live on a corner of the roof than to share a house with a quarrelsome wife.
25 ULB దప్పిగొన్నవాడికి చల్లని నీరు ఎలాగో దూరదేశం నుండి వచ్చిన శుభసమాచారం అలా. BSB BSB: Like cold water to a weary soul is good news from a distant land.
26 ULB కలకలు అయిపోయిన ఊట, చెడిపోయిన నీటిబుగ్గ, ఉత్తముడు దుష్టుడికి లోబడి ఉండడం ఒకటే. BSB BSB: Like a muddied spring or a polluted well is a righteous man who gives way to the wicked.
27 ULB తేనె మితిమీరి తినడం మంచిది కాదు. గొప్ప కోసం అదే పనిగా పాకులాడడం అలాటిదే. BSB BSB: It is not good to eat too much honey or to search out one’s own glory.
28 ULB ప్రాకారం లేక పాడైన పురం ఎంతో తన మనస్సు అదుపు చేసుకోలేని వాడు అంతే. BSB BSB: Like a city whose walls are broken down is a man who does not control his temper.
Select verses for actions: Enter goes to them and Escape comes back.