1 ULB ఎండాకాలానికి మంచు ఎలానో కోతకాలానికి వర్షమెలానో అలానే బుద్ధి లేనివాడికి గౌరవం తగినది కాదు. BSB BSB: Like snow in summer and rain at harvest, honor does not befit a fool.
2 ULB రెక్కలు కొట్టుకుంటూ ఎగురుతున్న పిచ్చుక, రివ్వున ఎగిరిపోయే వానకోయిల ఎలా నేలకు దిగవో అలానే శాపానికి అర్హుడు కాని వాడికి శాపం తగలదు. BSB BSB: Like a fluttering sparrow or darting swallow, an undeserved curse does not come to rest.
3 ULB గుర్రానికి చెర్నాకోల. గాడిదకు కళ్ళెం. మూర్ఖుల వీపుకు బెత్తం. BSB BSB: A whip for the horse, a bridle for the donkey, and a rod for the backs of fools!
5 ULB వాడి మూర్ఖత్వం చొప్పున మూర్ఖుడికి జవాబివ్వు. అలా చేయకపోతే వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకుంటాడు. BSB BSB: Answer a fool according to his folly, lest he become wise in his own eyes.
6 ULB మూర్ఖుడితో కబురు పంపేవాడు కాళ్లు తెగగొట్టుకుని విషం తాగిన వాడితో సమానం. BSB BSB: Like cutting off one’s own feet or drinking violence is the sending of a message by the hand of a fool.
7 ULB అవిటి వాడి కాళ్ళలో బలం ఉండదు. బుద్ధిలేని వాడి నోటిలో సామెత కూడా అంతే. BSB BSB: Like lame legs hanging limp is a proverb in the mouth of a fool.
8 ULB బుద్ధిలేని వాణ్ణి గొప్ప చేసే వాడు వడిసెలలో రాయి కదలకుండా కట్టేసే వాడితో సమానం. BSB BSB: Like binding a stone into a sling is the giving of honor to a fool.
9 ULB మూర్ఖుల నోట సామెత మత్తులో ఉన్న వాడి చేతిలో ముల్లు గుచ్చుకున్నట్టు ఉంటుంది. BSB BSB: Like a thorn that goes into the hand of a drunkard is a proverb in the mouth of a fool.
10 ULB బుద్ధిలేని వాణ్ణి, లేదా అటుగా వెళ్తూ ఉండే ఎవరో ఒకరిని కూలికి పెట్టుకునే వాడు అందరినీ గాయపరచే విలుకాడితో సమానం. BSB BSB: Like an archer who wounds at random is he who hires a fool or passerby.
11 ULB తన మూర్ఖత్వాన్ని పదేపదే బయట పెట్టుకునే వాడు కక్కిన దాన్ని తినడానికి తిరిగే కుక్కతో సమానం. BSB BSB: As a dog returns to its vomit, so a fool repeats his folly.
12 ULB తానే జ్ఞాని అనుకునే వాణ్ణి చూసావా? వాణ్ణి సరి చేయడం కంటే మూర్ఖుణ్ణి సరి చేయడం తేలిక. BSB BSB: Do you see a man who is wise in his own eyes? There is more hope for a fool than for him.
13 ULB సోమరి <<దారిలో సింహం ఉంది>> అంటాడు. <<ఆరు బయట సింహం పొంచి ఉంది>> అంటాడు. BSB BSB: The slacker says, “A lion is in the road! A fierce lion roams the public square!”
14 ULB బందుల మీద తలుపు తిరుగుతుంది. తన మంచం మీద సోమరి అటూ ఇటూ పొర్లుతాడు. BSB BSB: As a door turns on its hinges, so the slacker turns on his bed.
15 ULB కంచంలో సోమరి తన చెయ్యి ముంచుతాడు. దాన్ని తిరిగి నోటికి ఎత్తుకోవడం అతనికి బద్ధకం. BSB BSB: The slacker buries his hand in the dish; it wearies him to bring it back to his mouth.
16 ULB సహేతుకమైన కారణాలు చూపగల ఏడుగురి కంటే సోమరి తానే జ్ఞానిననుకుంటాడు. BSB BSB: The slacker is wiser in his own eyes than seven men who answer discreetly.
17 ULB తనకు సంబంధంలేని పోట్లాటలో తల దూర్చేవాడు. దారినపోయే కుక్క చెవులు పట్టుకొనే వాడితో సమానం. BSB BSB: Like one who grabs a dog by the ears is a passerby who meddles in a quarrel not his own.
18 ULB తన పొరుగువాణ్ణి మోసపుచ్చి నేను నవ్వులాటకు చేశాననే వాడు నిప్పు బాణాలు విసిరే వెర్రి వాడితో సమానం. BSB BSB: Like a madman shooting firebrands and deadly arrows,
20 ULB కట్టెలు లేకపోతే మంట ఆరిపోతుంది. కొండేలు చెప్పేవాడు లేకపొతే జగడం చల్లారుతుంది. BSB BSB: Without wood, a fire goes out; without gossip, a conflict ceases.
21 ULB నిప్పు కణికెలకు బొగ్గులు, అగ్నికి కట్టెలు. పోట్లాటలు రేపడానికి కలహప్రియుడు. BSB BSB: Like charcoal for embers and wood for fire, so is a quarrelsome man for kindling strife.
22 ULB కొండేలు రుచిగల పదార్థాల వంటివి. అవి కడుపులోకి మెత్తగా దిగిపోతాయి. BSB BSB: The words of a gossip are like choice morsels that go down into the inmost being.
23 ULB చెడు హృదయం ఉండి ప్రేమగా మాట్లాడే పెదాలు ఉండడం మట్టి పెంకుపై పూసిన వెండి పూతతో సమానం. BSB BSB: Like glaze covering an earthen vessel are burning lips and a wicked heart.
24 ULB పగవాడు పెదాలతో మాయలు చేసి అంతరంగంలో కపటం దాచుకుంటాడు. BSB BSB: A hateful man disguises himself with his speech, but he lays up deceit in his heart.
25 ULB వాడు దయగా మాటలాడితే వాడి మాట నమ్మవద్దు. వాడి హృదయంలో ఏడు అసహ్యమైన విషయాలు ఉన్నాయి. BSB BSB: When he speaks graciously, do not believe him, for seven abominations fill his heart.
26 ULB వాడు తన ద్వేషాన్ని కపట వేషంతో కప్పుకుంటాడు. సమాజంలో వాడి చెడుతనం బట్టబయలు అవుతుంది. BSB BSB: Though his hatred is concealed by deception, his wickedness will be exposed in the assembly.
27 ULB గుంట తవ్వే వాడే దానిలో పడతాడు. రాతిని పొర్లించే వాడి మీదికే అది తిరిగి వస్తుంది. BSB BSB: He who digs a pit will fall into it, and he who rolls a stone will have it roll back on him.
28 ULB అబద్ధాలాడే నాలుక తాను నలగగొట్టిన వాళ్ళను ద్వేషిస్తుంది. ముఖస్తుతి మాటలు పలికే నోరు నాశనం తెస్తుంది. BSB BSB: A lying tongue hates those it crushes, and a flattering mouth causes ruin.
Select verses for actions: Enter goes to them and Escape comes back.