2 ULB ఉత్తరీయం లాగా నీవు వెలుగును కప్పుకున్నావు. తెరను పరచినట్టు ఆకాశ విశాలాన్ని నీవు పరిచావు. BSB BSB: He wraps Himself in light as with a garment; He stretches out the heavens like a tent,
3 ULB జలాల్లో ఆయన తన గదుల దూలాలు వేశాడు. మేఘాలను తనకు వాహనంగా చేసుకుని గాలి రెక్కలమీద ప్రయాణిస్తున్నాడు. BSB BSB: laying the beams of His chambers in the waters above, making the clouds His chariot, walking on the wings of the wind.
4 ULB వాయువులను తనకు దూతలుగా అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగా యెహోవా చేసుకున్నాడు. BSB BSB: He makes the winds His messengers, flames of fire His servants.
5 ULB భూమి శాశ్వతంగా కదలకుండా ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరిచాడు. BSB BSB: He set the earth on its foundations, never to be moved.
6 ULB దాని మీద అగాధ జలాలను నీవు వస్త్రం లాగా కప్పావు. కొండలకు పైగా నీళ్లు నిలిచాయి. BSB BSB: You covered it with the deep like a garment; the waters stood above the mountains.
7 ULB నీవు గద్దించగానే అవి పారిపోయాయి. నీ ఉరుము ధ్వని విని అవి త్వరగా పారిపోయాయి. BSB BSB: At Your rebuke the waters fled; at the sound of Your thunder they hurried away—
8 ULB నీవు వాటికి నియమించిన చోటికి పోవడానికి అవి పర్వతాలెక్కాయి. పల్లాలకు దిగాయి. BSB BSB: the mountains rose and the valleys sank to the place You assigned for them—
9 ULB అవి మరలి వచ్చి భూమిని కప్పకుండేలా దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించావు. BSB BSB: You set a boundary they cannot cross, that they may never again cover the earth.
11 ULB అవి అడవి జంతువులన్నిటికీ దాహం తీరుస్తాయి. వాటివలన అడవి గాడిదలు సేదదీరుతాయి. BSB BSB: They give drink to every beast of the field; the wild donkeys quench their thirst.
12 ULB వాటి ఒడ్డున ఆకాశపక్షులు గూడు కట్టుకుంటాయి. కొమ్మల మధ్య అవి కిలకిలారావాలు చేస్తాయి. BSB BSB: The birds of the air nest beside the springs; they sing among the branches.
13 ULB తన మేడ గదుల్లోనుండి ఆయన కొండలకు జలధారలనిస్తాడు. నీ క్రియల ఫలం చేత భూమి తృప్తి పొందుతున్నది. BSB BSB: He waters the mountains from His chambers; the earth is satisfied by the fruit of His works.
15 ULB అందువల్ల భూమిలోనుండి ఆహారాన్నీ మనుషుల హృదయాన్ని సంతోషపెట్టే ద్రాక్షారసాన్నీ వారి ముఖాలకు మెరుపునిచ్చే తైలాన్నీ మనుషుల హృదయాన్ని బలపరిచే ఆహారాన్నీ ఆయన మొలకెత్తిస్తున్నాడు. BSB BSB: wine that gladdens the heart of man, oil that makes his face to shine, and bread that sustains his heart.
16 ULB యెహోవా వృక్షాలు ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షాలు నీటి వసతి గలిగి ఉన్నాయి. BSB BSB: The trees of the LORD have their fill, the cedars of Lebanon that He planted,
17 ULB అక్కడ పక్షులు తమ గూళ్లు కట్టుకుంటాయి. అక్కడ సరళవృక్షాలపై కొంగలు నివాసముంటున్నాయి. BSB BSB: where the birds build their nests; the stork makes her home in the cypresses.
18 ULB ఎత్తయిన కొండలు కొండమేకలకు ఉనికిపట్లు. బండరాళ్ళు కుందేళ్లకు ఆశ్రయస్థానాలు. BSB BSB: The high mountains are for the wild goats, the cliffs a refuge for the rock badgers.
19 ULB ఋతువులను సూచించడానికి ఆయన చంద్రుణ్ణి నియమించాడు. సూర్యుడికి అతడు అస్తమించవలసిన కాలం తెలుసు. BSB BSB: He made the moon to mark the seasons; the sun knows when to set.
20 ULB నీవు చీకటి కమ్మ జేయగా రాత్రి అవుతున్నది. అప్పుడు అడవిజంతువులన్నీ సంచరిస్తున్నాయి. BSB BSB: You bring darkness, and it becomes night, when all the beasts of the forest prowl.
22 ULB సూర్యుడు ఉదయించగానే అవి మరలిపోయి తమ గుహల్లో పడుకుంటాయి. BSB BSB: The sun rises, and they withdraw; they lie down in their dens.
23 ULB సాయంకాలం దాకా పాటుపడి తమ పనులు జరుపుకోడానికి మనుషులు బయలుదేరుతారు. BSB BSB: Man goes forth to his work and to his labor until evening.
24 ULB యెహోవా, నీ కార్యాలు ఎన్నెన్ని రీతులుగా ఉన్నాయో! జ్ఞానం చేత నీవు వాటన్నిటినీ నిర్మించావు. నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉంది. BSB BSB: How many are Your works, O LORD! In wisdom You have made them all; the earth is full of Your creatures.
25 ULB అదిగో విశాలమైన మహాసముద్రం. అందులో లెక్కలేనన్ని జలచరాలు, చిన్నవి పెద్దవి జీవరాసులు ఉన్నాయి. BSB BSB: Here is the sea, vast and wide, teeming with creatures beyond number, living things both great and small.
26 ULB అందులో ఓడలు నడుస్తున్నాయి. నీవు సృష్టించిన మొసళ్ళు దానిలో జలకాలాడుతూ ఉన్నాయి. BSB BSB: There the ships pass, and Leviathan, which You formed to frolic there.
28 ULB నీవు వాటికి అందిస్తే అవి కూర్చుకుంటాయి. నీవు గుప్పిలి విప్పితే అవి మంచివాటిని తిని తృప్తి చెందుతాయి. BSB BSB: When You give it to them, they gather it up; when You open Your hand, they are satisfied with good things.
29 ULB నీవు ముఖం దాచుకుంటే అవి కలత చెందుతాయి. నీవు వాటి ఊపిరి ఉపసంహరిస్తే అవి ప్రాణం విడిచి మట్టిపాలవుతాయి. BSB BSB: When You hide Your face, they are terrified; when You take away their breath, they die and return to dust.
30 ULB నీవు నీ ఊపిరి విడిస్తే అవి ఉనికిలోకి వస్తాయి. ఆ విధంగా నీవు మైదానాలను నూతనపరుస్తున్నావు. BSB BSB: When You send Your Spirit, they are created, and You renew the face of the earth.
31 ULB యెహోవా మహిమ నిత్యం ఉండుగాక. యెహోవా తన క్రియలను చూసి ఆనందించు గాక. BSB BSB: May the glory of the LORD endure forever; may the LORD rejoice in His works.
32 ULB ఆయన భూమిని చూడగా అది వణికి పోతుంది. ఆయన పర్వతాలను ముట్టగా అవి పొగరాజుకుంటాయి. BSB BSB: He looks on the earth, and it trembles; He touches the mountains, and they smolder.
33 ULB నా జీవితకాలమంతా నేను యెహోవాకు కీర్తనలు పాడతాను. నేనున్నంత కాలం నా దేవుణ్ణి కీర్తిస్తాను. BSB BSB: I will sing to the LORD all my life; I will sing praise to my God while I have my being.
34 ULB ఆయన్ను గూర్చిన నా ధ్యానం ఆయనకు ఇంపుగా ఉండు గాక. నేను యెహోవా విషయం సంతోషిస్తాను. BSB BSB: May my meditation be pleasing to Him, for I rejoice in the LORD.
35 ULB పాపులు భూమిపై లేకుండా పోవాలి. భక్తిహీనులు ఇక ఉండకపోదురు గాక. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. యెహోవాను స్తుతించండి. BSB BSB: May sinners vanish from the earth and the wicked be no more. Bless the LORD, O my soul. Hallelujah!
Select verses for actions: Enter goes to them and Escape comes back.