1 ULB యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నామాన్ని ప్రకటన చేయండి. జాతుల్లో ఆయన కార్యాలను తెలియచేయండి. BSB BSB: Give thanks to the LORD, call upon His name; make known His deeds among the nations.
2 ULB ఆయనను గూర్చి పాడండి. ఆయనను కీర్తించండి. ఆయన ఆశ్చర్య కార్యాలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి. BSB BSB: Sing to Him, sing praises to Him; tell of all His wonders.
3 ULB ఆయన పరిశుద్ధ నామాన్నిబట్టి అతిశయించండి. యెహోవాను వెతికేవారు హృదయంలో సంతోషించుదురు గాక. BSB BSB: Glory in His holy name; let the hearts of those who seek the LORD rejoice.
4 ULB యెహోవాను వెదకండి. ఆయన బలాన్ని వెదకండి. ఆయన సన్నిధిని నిత్యం అన్వేషించండి. BSB BSB: Seek out the LORD and His strength; seek His face always.
5 ULB ఆయన సేవకుడైన అబ్రాహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతివారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. BSB BSB: Remember the wonders He has done, His marvels, and the judgments He has pronounced,
6 ULB ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. BSB BSB: O offspring of His servant Abraham, O sons of Jacob, His chosen ones.
7 ULB ఆయన మన దేవుడైన యెహోవా. ఆయన తీర్పులు భూమి అంతటా అమలు అవుతున్నాయి. BSB BSB: He is the LORD our God; His judgments carry throughout the earth.
8 ULB తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరాల వరకూ ఆయన గుర్తుంచుకుంటాడు. అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను, BSB BSB: He remembers His covenant forever, the word He ordained for a thousand generations—
9 ULB ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణాన్ని, నిత్యం ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. BSB BSB: the covenant He made with Abraham, and the oath He swore to Isaac.
10 ULB వారి సంఖ్య కొద్దిగా ఉన్నప్పుడు, ఆ కొద్ది మంది ఆ దేశంలో పరదేశులుగా ఉన్నప్పుడు, BSB BSB: He confirmed it to Jacob as a decree, to Israel as an everlasting covenant:
11 ULB కొలిచిన వారసత్వంగా కనాను దేశం మీకిస్తానని ఆయన చెప్పాడు. BSB BSB: “I will give you the land of Canaan as the portion of your inheritance.”
12 ULB ఆ మాట యాకోబుకు శాసనంగాను ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరచాడు. BSB BSB: When they were few in number, few indeed, and strangers in the land,
13 ULB వారు జనం నుండి జనానికి, రాజ్యం నుండి రాజ్యానికి తిరుగులాడుతుండగా BSB BSB: they wandered from nation to nation, from one kingdom to another.
14 ULB వారిని హింసించడానికి ఆయన ఎవరినీ అనుమతించలేదు. ఆయన వారి కోసం రాజులను శిక్షించాడు. BSB BSB: He let no man oppress them; He rebuked kings on their behalf:
15 ULB నేను అభిషేకించిన వారిని తాకవద్దు, నా ప్రవక్తలకు హాని చేయవద్దు అని ఆయన చెప్పాడు. BSB BSB: “Do not touch My anointed ones! Do no harm to My prophets!”
16 ULB దేశం మీదికి ఆయన కరువు రప్పించాడు. జీవనాధారమైన ధాన్యమంతా ధ్వంసం చేశాడు. BSB BSB: He called down famine on the land and cut off all their supplies of food.
17 ULB వారికంటే ముందుగా ఆయన ఒకణ్ణి పంపించాడు. వారు యోసేపును బానిసగా అమ్మేశారు. BSB BSB: He sent a man before them—Joseph, sold as a slave.
18 ULB వారు సంకెళ్లతో అతని కాళ్లు నొప్పించారు. ఇనుము అతని ప్రాణాన్ని బాధించింది. BSB BSB: They bruised his feet with shackles and placed his neck in irons,
19 ULB అతడు చెప్పిన సంగతి నెరవేరేదాకా యెహోవా వాక్కు అతణ్ణి పరీక్షించాడు. BSB BSB: until his prediction came true and the word of the LORD proved him right.
20 ULB రాజు వర్తమానం పంపి అతణ్ణి విడిపించాడు. ప్రజల పాలకుడు అతణ్ణి విడుదల చేశాడు. BSB BSB: The king sent and released him; the ruler of peoples set him free.
21 ULB ఇష్టప్రకారం అతడు తన అధిపతులపై పెత్తనం చెయ్యడానికి, తన పెద్దలకు బుద్ధి చెప్పడానికి, BSB BSB: He made him master of his household, ruler over all his substance,
22 ULB తన ఇంటికి యజమానిగా, తన ఆస్తి అంతటిపై అధికారిగా అతణ్ణి నియమించాడు. BSB BSB: to instruct his princes as he pleased and teach his elders wisdom.
23 ULB ఇశ్రాయేలు ఈజిప్టులోకి వచ్చాడు. యాకోబు హాము దేశంలో పరదేశిగా ఉన్నాడు. BSB BSB: Then Israel entered Egypt; Jacob dwelt in the land of Ham.
24 ULB ఆయన తన ప్రజల సంతానాన్ని వృద్ధి చేశాడు. వారి విరోధులకంటే వారికి అధికబలం దయచేశాడు. BSB BSB: And the LORD made His people very fruitful, more numerous than their foes,
25 ULB తన ప్రజలపై పగబట్టేలా తన సేవకుల పట్ల కుయుక్తిగా నడుచుకునేలా ఆయన వారి హృదయాలను మళ్ళించాడు. BSB BSB: whose hearts He turned to hate His people, to conspire against His servants.
26 ULB ఆయన తన సేవకుడైన మోషేను, తాను ఏర్పరచుకున్న అహరోనును పంపించాడు. BSB BSB: He sent Moses His servant, and Aaron, whom He had chosen.
27 ULB వారు ఐగుప్తీయుల మధ్య ఆయన సూచక క్రియలను, హాము దేశంలో మహత్కార్యాలను జరిగించారు. BSB BSB: They performed His miraculous signs among them, and wonders in the land of Ham.
28 ULB ఆయన అంధకారం పంపించి చీకటి కమ్మేలా చేశాడు. వారు ఆయన మాటను ఎదిరించలేదు. BSB BSB: He sent darkness, and it became dark—yet they defied His words.
29 ULB ఆయన వారి జలాలను రక్తంగా మార్చాడు. వారి చేపలను చంపాడు. BSB BSB: He turned their waters to blood and caused their fish to die.
30 ULB వారి దేశంలో కప్పలు నిండిపోయాయి. అవి వారి రాజుల గదుల్లోకి వచ్చాయి. BSB BSB: Their land teemed with frogs, even in their royal chambers.
31 ULB ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టాయి. వారి ప్రాంతాలన్నిటిలోకీ దోమలు వచ్చాయి. BSB BSB: He spoke, and insects swarmed—gnats throughout their country.
32 ULB ఆయన వారిమీద వడగండ్ల వాన కురిపించాడు. వారి దేశంలో అగ్నిజ్వాలలు పుట్టించాడు. BSB BSB: He gave them hail for rain, with lightning throughout their land.
33 ULB వారి ద్రాక్షతీగెలను, వారి అంజూరు చెట్లను పడగొట్టాడు. వారి ప్రాంతాల్లో వృక్షాలను విరగగొట్టాడు. BSB BSB: He struck their vines and fig trees and shattered the trees of their country.
34 ULB ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలు, లెక్కలేనన్ని చీడపురుగులు వచ్చాయి, BSB BSB: He spoke, and the locusts came—young locusts without number.
35 ULB అవి వారి దేశంలోని కూరగాయల చెట్లన్నిటిని, వారి భూమి పంటలను తినివేశాయి. BSB BSB: They devoured every plant in their land and consumed the produce of their soil.
36 ULB వారి దేశంలోని జ్యేష్ఠులను, వారి ప్రథమ సంతానాన్ని ఆయన హతం చేశాడు. BSB BSB: Then He struck all the firstborn in their land, the firstfruits of all their vigor.
37 ULB అక్కడనుండి తన ప్రజలను వెండి బంగారాలతో ఆయన రప్పించాడు. వారి గోత్రాల్లో నిస్సత్తువ చేత తొట్రిల్లేవాడొక్కడైనా లేడు. BSB BSB: He brought Israel out with silver and gold, and none among His tribes stumbled.
38 ULB వారివలన ఐగుప్తీయులకు భయం వేసింది. వారు వెళ్లిపోయినప్పుడు ఐగుప్తీయులు సంతోషించారు. BSB BSB: Egypt was glad when they departed, for the dread of Israel had fallen on them.
39 ULB వారికి నీడగా ఆయన మేఘాన్ని కల్పించాడు. రాత్రి వెలుగివ్వడానికి అగ్నిని కలగజేశాడు. BSB BSB: He spread a cloud as a covering and a fire to light up the night.
40 ULB వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించాడు. ఆకాశంలోనుండి ఆహారాన్నిచ్చి వారిని తృప్తి పరిచాడు. BSB BSB: They asked, and He brought quail and satisfied them with the bread of heaven.
41 ULB శిలను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చాయి. ఎడారుల్లో అవి ఏరులై ప్రవహించాయి. BSB BSB: He opened a rock, and water gushed out; it flowed like a river in the desert.
42 ULB ఎందుకంటే ఆయన తన పరిశుద్ధ వాగ్దానాన్ని, తన సేవకుడైన అబ్రాహామును జ్ఞాపకం చేసుకుని, BSB BSB: For He remembered His holy promise to Abraham His servant.
43 ULB తన ప్రజలను సంతోషంతోను, తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోను బయటికి రప్పించాడు. BSB BSB: He brought forth His people with rejoicing, His chosen with shouts of joy.
44 ULB అన్యజనుల భూములను ఆయన వారికప్పగించాడు. ఇతర జాతుల సౌభాగ్యాన్ని వారు స్వాధీనపరచుకున్నారు. BSB BSB: He gave them the lands of the nations, that they might inherit the fruit of others’ labor,
45 ULB వారు తన కట్టడలను గైకొనేలా, తన ధర్మశాస్త్రవిధులను ఆచరించేలా చేయడానికి ఆయనిలా చేశాడు. యెహోవాను స్తుతించండి. BSB BSB: that they might keep His statutes and obey His laws. Hallelujah!
Select verses for actions: Enter goes to them and Escape comes back.