1 ULB యెహోవాను స్తుతించండి. యెహోవా దయాళుడు. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం ఉంటుంది. BSB BSB: Hallelujah! Give thanks to the LORD, for He is good; His loving devotion endures forever.
2 ULB యెహోవా పరాక్రమ కార్యాలను వర్ణించగలవాడెవడు? ఆయన కీర్తి అంతటినీ ఎవడు ప్రకటించగలడు? BSB BSB: Who can describe the mighty acts of the LORD or fully proclaim His praise?
3 ULB న్యాయం అనుసరించేవారు, ఎల్లవేళలా నీతిననుసరించి నడుచుకునేవారు ధన్యులు. BSB BSB: Blessed are those who uphold justice, who practice righteousness at all times.
4 ULB యెహోవా, నీవు ఏర్పరచుకున్నవారి క్షేమం నేను చూస్తూ నీ ప్రజలకు కలిగే సంతోషాన్ని బట్టి నేను సంతోషిస్తూ, BSB BSB: Remember me, O LORD, in Your favor to Your people; visit me with Your salvation,
5 ULB నీ వారసత్వ ప్రజతో కలిసి కొనియాడేలా నీ ప్రజల పట్ల నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకానికి తెచ్చుకో. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించు. BSB BSB: that I may see the prosperity of Your chosen ones, and rejoice in the gladness of Your nation, and give glory with Your inheritance.
6 ULB మా పితరుల్లాగానే మేము పాపం చేశాము. దోషాలు మూటగట్టుకుని భక్తిహీనులమైపోయాము. BSB BSB: We have sinned like our fathers; we have done wrong and acted wickedly.
7 ULB ఈజిప్టులో మా పూర్వీకులు నీ అద్భుతాలను గ్రహించలేదు. నీ కృపాబాహుళ్యం జ్ఞాపకం తెచ్చుకోలేదు. సముద్రం దగ్గర, ఎర్రసముద్రం దగ్గర వారు తిరుగు బాటు చేశారు. BSB BSB: Our fathers in Egypt did not grasp Your wonders or remember Your abundant kindness; but they rebelled by the sea, there at the Red Sea.
8 ULB అయినా తన మహా పరాక్రమాన్ని ప్రసిద్ధి చేయడానికి ఆయన తన నామాన్నిబట్టి వారిని రక్షించాడు. BSB BSB: Yet He saved them for the sake of His name, to make His power known.
9 ULB ఆయన ఎర్రసముద్రాన్ని గద్దించగా అది ఆరిపోయింది. మైదానం మీద నడిచినట్టు ఆయన వారిని అగాధజలాల్లో నడిపించాడు. BSB BSB: He rebuked the Red Sea, and it dried up; He led them through the depths as through a desert.
10 ULB పగవారి చేతిలోనుండి వారిని రక్షించాడు. శత్రువుల చేతిలోనుండి వారిని విమోచించాడు. BSB BSB: He saved them from the hand that hated them; He redeemed them from the hand of the enemy.
11 ULB నీళ్లు వారి శత్రువులను ముంచివేశాయి. వారిలో ఒక్కడైనా మిగల్లేదు. BSB BSB: The waters covered their foes; not one of them remained.
12 ULB అప్పుడు వారు ఆయన మాటలు నమ్మారు. ఆయన కీర్తిని గానం చేశారు. BSB BSB: Then they believed His promises and sang His praise.
13 ULB అయినా వారు ఆయన కార్యాలను వెంటనే మర్చిపోయారు. ఆయన ఆలోచన కోసం కనిపెట్టుకోలేదు. BSB BSB: Yet they soon forgot His works and failed to wait for His counsel.
14 ULB అరణ్యంలో వారు ఎంతో ఆశించారు. ఎడారిలో దేవుణ్ణి పరీక్షించారు. BSB BSB: They craved intensely in the wilderness and tested God in the desert.
15 ULB వారు కోరినది ఆయన వారికి ఇచ్చాడు. అయినా వారి ప్రాణాలకు ఆయన క్షీణత కలగజేశాడు. BSB BSB: So He granted their request, but sent a wasting disease upon them.
16 ULB వారు తమ శిబిరంలో మోషేపైనా యెహోవాకు ప్రతిష్ఠితుడు అహరోనుపైనా అసూయపడ్డారు. BSB BSB: In the camp they envied Moses, as well as Aaron, the holy one of the LORD.
17 ULB భూమి నెర్రె విచ్చి దాతానును మింగేసింది. అది అబీరాము బృందాన్ని కప్పేసింది. BSB BSB: The earth opened up and swallowed Dathan; it covered the assembly of Abiram.
18 ULB వారి మధ్యలో అగ్ని రగులుకుంది. దాని మంట భక్తిహీనులను కాల్చివేసింది. BSB BSB: Then fire blazed through their company; flames consumed the wicked.
19 ULB హోరేబులో వారు దూడను చేయించుకున్నారు. పోత పోసిన విగ్రహానికి మొక్కారు. BSB BSB: At Horeb they made a calf and worshiped a molten image.
20 ULB తమ దేవుని మహిమను వారు గడ్డి మేసే ఎద్దు రూపానికి మార్చివేశారు. BSB BSB: They exchanged their Glory for the image of a grass-eating ox.
21 ULB ఈజిప్టులో గొప్ప కార్యాలను, హాము దేశంలో ఆశ్చర్యకార్యాలను BSB BSB: They forgot God their Savior, who did great things in Egypt,
22 ULB ఎర్రసముద్రం దగ్గర భయం గొలిపే క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు. BSB BSB: wondrous works in the land of Ham, and awesome deeds by the Red Sea.
23 ULB అప్పుడు ఆయన <<నేను వారిని నశింపజేస్తాను>> అన్నాడు. అయితే ఆయన వారిని నశింపజేయకుండేలా ఆయన కోపం చల్లార్చడానికి ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిలో నిలిచి అడ్డుపడ్డాడు. BSB BSB: So He said He would destroy them—had not Moses His chosen one stood before Him in the breach to divert His wrath from destroying them.
24 ULB రమ్యమైన దేశాన్ని వారు నిరాకరించారు. ఆయన మాట నమ్మలేదు. BSB BSB: They despised the pleasant land; they did not believe His promise.
25 ULB యెహోవా మాట వినకుండా వారు తమ గుడారాల్లో సణుగుకున్నారు. BSB BSB: They grumbled in their tents and did not listen to the voice of the LORD.
26 ULB అప్పుడు అరణ్యంలో వారు కూలిపోయేలా చేయడానికి, BSB BSB: So He raised His hand and swore to cast them down in the wilderness,
27 ULB అన్యజనులలో వారి సంతానాన్ని కూల్చడానికి, దేశంలో వారిని చెదరగొట్టడానికి ఆయన వారిపై చెయ్యి ఎత్తాడు. BSB BSB: to disperse their offspring among the nations and scatter them throughout the lands.
28 ULB వారు బయల్పెయోరును హత్తుకుని, చచ్చిన వారికి అర్పించిన బలిమాంసాన్ని భుజించారు. BSB BSB: They yoked themselves to Baal of Peor and ate sacrifices offered to lifeless gods.
29 ULB వారు తమ క్రియలచేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు చెలరేగింది. BSB BSB: So they provoked the LORD to anger with their deeds, and a plague broke out among them.
30 ULB ఫీనెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయింది. BSB BSB: But Phinehas stood and intervened, and the plague was restrained.
31 ULB నిత్యం తరాలన్నిటిలో అతనికి ఆ పని నీతిగా ఎంచబడింది. BSB BSB: It was credited to him as righteousness for endless generations to come.
32 ULB మెరీబా జలాల దగ్గర వారు ఆయనకు కోపం పుట్టించారు. కాబట్టి వారి మూలంగా మోషేకు బాధ కలిగింది. BSB BSB: At the waters of Meribah they angered the LORD, and trouble came to Moses because of them.
33 ULB ఎలాగంటే వారు అతనికి విరక్తి పుట్టించారు. ఫలితంగా అతడు తొందరపడి మాట్లాడాడు. BSB BSB: For they rebelled against His Spirit, and Moses spoke rashly with his lips.
34 ULB యెహోవా వారికి ఆజ్ఞాపించినట్టు వారు అన్యజాతులను నాశనం చేయలేదు. BSB BSB: They did not destroy the peoples as the LORD had commanded them,
35 ULB అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. BSB BSB: but they mingled with the nations and adopted their customs.
36 ULB వారి విగ్రహాలకు పూజ చేశారు. అవి వారికి ఉరి అయినాయి. BSB BSB: They worshiped their idols, which became a snare to them.
37 ULB వారు తమ కొడుకులను, తమ కూతుళ్ళను దయ్యాలకు బలిగా అర్పించారు. BSB BSB: They sacrificed their sons and their daughters to demons.
38 ULB నిర్దోష రక్తం, అంటే తమ కొడుకుల రక్తం తమ కూతుళ్ళల రక్తం ఒలికించారు. కనాను జాతి వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించారు. ఆ రక్తం వలన దేశం అపవిత్రం అయిపోయింది. BSB BSB: They shed innocent blood—the blood of their sons and daughters, whom they sacrificed to the idols of Canaan, and the land was polluted with blood.
39 ULB తమ క్రియల వలన వారు అపవిత్రులైపోయారు. తమ నడవడిలో వ్యభిచారులయ్యారు. BSB BSB: They defiled themselves by their actions and prostituted themselves by their deeds.
40 ULB కాబట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద రగులుకుంది. ఆయన తన వారసత్వంపై అసహ్యపడ్డాడు. BSB BSB: So the anger of the LORD burned against His people, and He abhorred His own inheritance.
41 ULB ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించాడు. పగవారు వారిని ఏలారు. BSB BSB: He delivered them into the hand of the nations, and those who hated them ruled over them.
42 ULB శత్రువులు వారిని బాధపెట్టారు. వారు శత్రువుల చేతి కింద అణగారిపోయారు. BSB BSB: Their enemies oppressed them and subdued them under their hand.
43 ULB అనేక మార్లు ఆయన వారిని విడిపించాడు. అయినా వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేస్తూ వచ్చారు. తమ పాపం మూలంగా హీనదశకు వెళ్ళిపోయారు. BSB BSB: Many times He rescued them, but they were bent on rebellion and sank down in their iniquity.
44 ULB అయినా వారి రోదన తనకు వినబడగా వారికి కలిగిన బాధను ఆయన చూశాడు. BSB BSB: Nevertheless He heard their cry; He took note of their distress.
45 ULB వారిని తలంచుకుని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. తన నిబంధన విశ్వాస్యతను బట్టి వారిని కరుణించాడు. BSB BSB: And He remembered His covenant with them, and relented by the abundance of His loving devotion.
46 ULB వారిని చెరగొనిపోయిన వారికందరికీ వారంటే జాలి పుట్టించాడు. BSB BSB: He made them objects of compassion to all who held them captive.
47 ULB యెహోవా మా దేవా, మమ్మల్ని రక్షించు. మేము నీ పరిశుద్ధనామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా, నిన్ను స్తుతిస్తూ మేము గర్వించేలా అన్యజనుల్లో నుండి మమ్మల్ని పోగుచెయ్యి. BSB BSB: Save us, O LORD our God, and gather us from the nations, that we may give thanks to Your holy name, that we may glory in Your praise.
48 ULB ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగయుగాలకూ స్తుతినొందు గాక. ప్రజలందరూ ఆమేన్ అందురు గాక. యెహోవాను స్తుతించండి. BSB BSB: Blessed be the LORD, the God of Israel, from everlasting to everlasting. Let all the people say, “Amen!” Hallelujah!
Select verses for actions: Enter goes to them and Escape comes back.