1 ULB యెహోవా దయాళుడు. ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యం ఉంటుంది. BSB BSB: Give thanks to the LORD, for He is good; His loving devotion endures forever.
2 ULB యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుతారు గాక. విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించిన వారూ, BSB BSB: Let the redeemed of the LORD say so, whom He has redeemed from the hand of the enemy
3 ULB తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి నానాదేశాల నుండి ఆయన పోగు చేసినవారూ ఆ మాట పలుకుతారు గాక. BSB BSB: and gathered from the lands, from east and west, from north and south.
4 ULB వారు అరణ్యమార్గాల్లో ఎడారి త్రోవల్లో తిరుగులాడుతూ ఉండే వారు. నివాస పురమేదీ వారికి దొరకలేదు. BSB BSB: Some wandered in desert wastelands, finding no path to a city in which to dwell.
5 ULB ఆకలి దప్పుల వల్ల వారి ప్రాణం వారిలో సొమ్మసిల్లిపోయింది. BSB BSB: They were hungry and thirsty; their soul fainted within them.
6 ULB వారు కష్టకాలంలో యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడు. BSB BSB: Then they cried out to the LORD in their trouble, and He delivered them from their distress.
7 ULB వారొక నివాస పురం చేరేలా చక్కని దారిలో ఆయన వారిని నడిపించాడు. BSB BSB: He led them on a straight path to reach a city where they could live.
8 ULB ఆయన నిబంధన విశ్వసనీయతను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలనుబట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. BSB BSB: Let them give thanks to the LORD for His loving devotion and His wonders to the sons of men.
9 ULB ఎందుకంటే దాహం గొన్న వారిని ఆయన తృప్తిపరచాడు. ఆకలి గొన్నవారిని మేలుతో నింపాడు. BSB BSB: For He satisfies the thirsty and fills the hungry with good things.
10 ULB చీకటిలో మసక చీకటిలో కొందరు బాధతో, ఇనప గొలుసులతో బంధితులై కూర్చున్నారు. BSB BSB: Some sat in darkness and in the shadow of death, prisoners in affliction and chains,
11 ULB దేవుని మాటపై తిరుగుబాటు చేసినందువల్ల, మహోన్నతుని సూచనలను త్రోసిపుచ్చినందువల్ల ఇది జరిగింది. BSB BSB: because they rebelled against the words of God and despised the counsel of the Most High.
12 ULB కడగండ్ల మూలంగా ఆయన వారి హృదయాలను లొంగదీశాడు. వారు తొట్రుపడినప్పుడు ఆదుకునేవాడు లేకపోయాడు. BSB BSB: He humbled their hearts with hard labor; they stumbled, and there was no one to help.
13 ULB కష్టకాలంలో వారు యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి దురవస్థలోనుండి వారిని విడిపించాడు BSB BSB: Then they cried out to the LORD in their trouble, and He saved them from their distress.
14 ULB వారి కట్లను తెంపివేసి చీకటిలోనుండి, మరణాంధకారంలో నుండి వారిని బయటికి రప్పించాడు. BSB BSB: He brought them out of darkness and the shadow of death and broke away their chains.
15 ULB ఆయన కృపను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్యకార్యాలను బట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. BSB BSB: Let them give thanks to the LORD for His loving devotion and His wonders to the sons of men.
16 ULB ఎందుకంటే ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టాడు, ఇనపగడియలను విరగగొట్టాడు. BSB BSB: For He has broken down the gates of bronze and cut through the bars of iron.
17 ULB బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తన చేత, తమ దోషం చేత, బాధ కొనితెచ్చుకుంటారు. BSB BSB: Fools, in their rebellious ways, and through their iniquities, suffered affliction.
18 ULB భోజనపదార్థాలన్నీ వారి ప్రాణానికి అసహ్యమై పోతాయి. వారు మరణద్వారాలను సమీపిస్తారు. BSB BSB: They loathed all food and drew near to the gates of death.
19 ULB కష్టకాలంలో వారు యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు. BSB BSB: Then they cried out to the LORD in their trouble, and He saved them from their distress.
20 ULB ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించాడు. BSB BSB: He sent forth His word and healed them; He rescued them from the Pit.
21 ULB ఆయన కృపను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలనుబట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. BSB BSB: Let them give thanks to the LORD for His loving devotion and His wonders to the sons of men.
22 ULB వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురు గాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యాలను ప్రకటించుదురు గాక. BSB BSB: Let them offer sacrifices of thanksgiving and declare His works with rejoicing.
23 ULB ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేసేవారు మహాజలాల మీద తిరుగుతూ వ్యాపారం చేసేవారు BSB BSB: Others went out to sea in ships, conducting trade on the mighty waters.
24 ULB యెహోవా కార్యాలను, సముద్రంలో ఆయన చేసే అద్భుతాలను చూశారు. BSB BSB: They saw the works of the LORD, and His wonders in the deep.
25 ULB ఆయన సెలవియ్యగా తుఫాను పుట్టింది. అది దాని తరంగాలను పైకెత్తింది. BSB BSB: For He spoke and raised a tempest that lifted the waves of the sea.
26 ULB వారు ఆకాశందాకా ఎక్కుతూ అగాధానికి దిగుతూ ఉన్నారు. బాధతో వారి ప్రాణం కరిగిపోయింది. BSB BSB: They mounted up to the heavens, then sunk to the depths; their courage melted in their anguish.
27 ULB మత్తెక్కిన వారివలె వారు ముందుకి, వెనక్కి దొర్లుతూ ఇటు అటు తూలుతూ ఉన్నారు. వారు ఏమీ తోచక ఉన్నారు. BSB BSB: They reeled and staggered like drunkards, and all their skill was useless.
28 ULB బాధకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడు. BSB BSB: Then they cried out to the LORD in their trouble, and He brought them out of their distress.
29 ULB ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగాలు అణిగిపోయాయి. BSB BSB: He calmed the storm to a whisper, and the waves of the sea were hushed.
30 ULB అవి నిమ్మళమైపోయాయని వారు సంతోషించారు. వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించాడు. BSB BSB: They rejoiced in the silence, and He guided them to the harbor they desired.
31 ULB ఆయన కృపను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. BSB BSB: Let them give thanks to the LORD for His loving devotion and His wonders to the sons of men.
32 ULB జనసమాజంలో వారాయనను ఘనపరచుదురు గాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక. BSB BSB: Let them exalt Him in the assembly of the people and praise Him in the council of the elders.
33 ULB ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను, BSB BSB: He turns rivers into deserts, springs of water into thirsty ground,
34 ULB దేశనివాసుల చెడుతనాన్ని బట్టి సారవంతమైన భూమిని చవిటిపర్రగాను మార్చాడు. BSB BSB: and fruitful land into fields of salt, because of the wickedness of its dwellers.
35 ULB అడివిని నీటిమడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల తావుగాను ఆయన మార్చాడు. BSB BSB: He turns a desert into pools of water and a dry land into flowing springs.
36 ULB వారు అక్కడ నివాసస్థలం ఏర్పరచుకునేలా పొలంలో విత్తనాలు చల్లి, ద్రాక్షతోటలు నాటి, BSB BSB: He causes the hungry to settle there, that they may establish a city in which to dwell.
37 ULB వాటివలన మంచి పంటలు పండిస్తూ ఉండేలా ఆయన ఆకలిగొన్న వారిని అక్కడ కాపురముంచాడు. BSB BSB: They sow fields and plant vineyards that yield a fruitful harvest.
38 ULB ఆయన వారిని ఆశీర్వదించగా వారికి సంతానాభివృద్ధి కలిగింది. ఆయన వారి పశువులను తగ్గిపోనియ్యలేదు. BSB BSB: He blesses them, and they multiply greatly; He does not let their herds diminish.
39 ULB వారు బాధ వలనా ఇబ్బంది వలనా దుఃఖం వలనా తగ్గిపోయినప్పుడు, BSB BSB: When they are decreased and humbled by oppression, evil, and sorrow,
40 ULB శత్రువులు రాజులను తృణీకరిస్తూ దారిలేని ఎడారిలో వారిని తిరుగులాడజేశాడు. BSB BSB: He pours out contempt on the nobles and makes them wander in a trackless wasteland.
41 ULB అలాటి దరిద్రుల బాధను పొగొట్టి వారిని లేవనెత్తాడు. వారి వంశాన్ని మందవలె వృద్ధి చేశాడు. BSB BSB: But He lifts the needy from affliction and increases their families like flocks.
42 ULB యథార్థవంతులు దాన్ని చూసి సంతోషిస్తారు. మోసగాళ్ళు మౌనంగా ఉంటారు. BSB BSB: The upright see and rejoice, and all iniquity shuts its mouth.
43 ULB బుద్ధిమంతుడు ఈ విషయాలను ఆలోచిస్తాడు. యెహోవా కృపాతిశయాలను ప్రజలు తలపోస్తారు గాక. BSB BSB: Let him who is wise pay heed to these things and consider the loving devotion of the LORD.
Select verses for actions: Enter goes to them and Escape comes back.