1 ULB నా ఆశ్రయశిల అయిన యెహోవాకు స్తుతి. నా చేతులకు, వేళ్లకు యుద్ధ నైపుణ్యం నేర్పించేవాడు ఆయనే. BSB BSB: Of David. Blessed be the LORD, my Rock, who trains my hands for war, my fingers for battle.
2 ULB నీవే నా నిబంధన విశ్వసనీయుడివి, నా దుర్గానివి. ఆయనే నన్ను కాపాడే ఎత్తయిన నా గోపురం. నేను దాగి ఉండే నా డాలు ఆయనే. ఆయన పైనే నేను ఆధారపడతాను. జాతులు నాకు లోబడేలా అణిచేవాడు యెహోవానే. BSB BSB: He is my steadfast love and my fortress, my stronghold and my deliverer. He is my shield, in whom I take refuge, who subdues peoples under me.
3 ULB యెహోవా, నువ్వు మనుషులను లక్ష్యపెట్టడానికి వాళ్ళు ఎంతటి వాళ్ళు? వాళ్ళ గురించి ఆలోచించడానికి వాళ్ళకున్న అర్హత ఏమిటి? BSB BSB: O LORD, what is man, that You regard him, the son of man that You think of him?
4 ULB మనిషి కేవలం శ్వాస వంటివాడు. వాళ్ళ రోజులు కదిలిపోతున్న నీడలాగా ఉన్నాయి. BSB BSB: Man is like a breath; his days are like a passing shadow.
5 ULB యెహోవా, ఆకాశాలను కృంగజేసి కిందికి దిగిరా. పర్వతాలను తాకి అవి పొగలు వెళ్ళగక్కేలా చెయ్యి. BSB BSB: Part Your heavens, O LORD, and come down; touch the mountains, that they may smoke.
6 ULB మెరుపులు మెరిపించి శత్రువులను చెదరగొట్టు. నీ బాణాలు వేసి వాళ్ళను ఓడించు. BSB BSB: Flash forth Your lightning and scatter them; shoot Your arrows and rout them.
7 ULB ఆకాశం నుండి నీ చెయ్యి చాపి నన్ను తప్పించు. మహా జలప్రవాహాల నుండి, విదేశీయుల చేతిలోనుండి నన్ను విడిపించు. BSB BSB: Reach down from on high; set me free and rescue me from the deep waters, from the grasp of foreigners,
8 ULB వాళ్ళు వంచన మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ కుడిచేతులు మోసంతో నిండి ఉన్నాయి. BSB BSB: whose mouths speak falsehood, whose right hands are deceitful.
9 ULB దేవా, నిన్ను గురించి నేనొక కొత్త గీతం పాడతాను. పదితంతుల సితారా మోగిస్తూ నిన్ను కీర్తిస్తాను. BSB BSB: I will sing to You a new song, O God; on a harp of ten strings I will make music to You—
10 ULB రాజులకు విజయం ఇచ్చేది నువ్వే. దుర్మార్గుల కత్తివేటు నుండి నీ సేవకుడైన దావీదును తప్పించే వాడివి నువ్వే. BSB BSB: to Him who gives victory to kings, who frees His servant David from the deadly sword.
11 ULB విదేశీయుల చేతుల్లోనుంచి నన్ను విడిపించు. వాళ్ళు వంచన మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ కుడిచేతులు మోసంతో నిండి ఉన్నాయి. BSB BSB: Set me free and rescue me from the grasp of foreigners, whose mouths speak falsehood, whose right hands are deceitful.
12 ULB యవ్వనంలో ఉన్న మా కొడుకులు మొక్కల్లాగా ఏపుగా ఎదగాలి. మా కూతుళ్ళు రాజభవనం కోసం చెక్కిన మూల స్తంభాల్లాగా ఉండాలి. BSB BSB: Then our sons will be like plants nurtured in their youth, our daughters like corner pillars carved to adorn a palace.
13 ULB మా గోదాముల్లో రకరకాల ధాన్య నిధులు నిండాలి. మా పచ్చిక మైదానాల్లో మా గొర్రెలు వేలు, పదివేలు పిల్లలు పెట్టాలి. BSB BSB: Our storehouses will be full, supplying all manner of produce; our flocks will bring forth thousands, tens of thousands in our fields.
14 ULB అప్పుడు మా పశువులు ఎన్నో దూడలు ఈనతాయి. అవేవీ మా కంచెలు విరగ్గొట్టుకుని పరుగులెత్తకుండా ఉండాలి. మా వీధుల్లో ఎలాటి గలాటా ఉండకూడదు. BSB BSB: Our oxen will bear great loads. There will be no breach in the walls, no going into captivity, and no cry of lament in our streets.
15 ULB ఇలాంటి దీవెనలు గల ప్రజలు ధన్యులు. యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో వాళ్ళు ధన్యజీవులు. BSB BSB: Blessed are the people of whom this is so; blessed are the people whose God is the LORD.
Select verses for actions: Enter goes to them and Escape comes back.