1 ULB నా రాజా, నా దేవా, నిన్ను ఘనపరుస్తాను. నీ నామాన్ని అన్నివేళలా కీర్తిస్తాను. BSB BSB: A Psalm of praise. Of David. I will exalt You, my God and King; I will bless Your name forever and ever.
2 ULB అనుదినం నిన్ను స్తుతిస్తాను. శాశ్వతకాలం నీ నామాన్ని కీర్తిస్తాను. BSB BSB: Every day I will bless You, and I will praise Your name forever and ever.
3 ULB యెహోవా ఘనత వహించినవాడు. ఆయన అధిక స్తుతులకు పాత్రుడు. ఆయన గొప్పతనాన్ని గ్రహించడం ఎవరి తరం కాదు. BSB BSB: Great is the LORD and greatly to be praised; His greatness is unsearchable.
4 ULB ఒక తరం వారు మరో తరం వారి ఎదుట కార్యాలు తెలియజేసి నిన్ను కొనియాడతారు. నీ పరాక్రమ కార్యాలను నెమరు వేసుకుంటారు. BSB BSB: One generation will commend Your works to the next, and will proclaim Your mighty acts—
5 ULB వారు నీ మహిమ వైభవాన్ని ధ్యానిస్తారు. నేను నీ అద్భుత క్రియలను తలపోసుకుంటాను. BSB BSB: the glorious splendor of Your majesty. And I will meditate on Your wondrous works.
6 ULB వారు నీ ఆశ్చర్య కార్యాల్లోని ప్రభావాన్ని వర్ణిస్తారు. నేను నీ ప్రతాపాన్ని వివరిస్తాను. BSB BSB: They will proclaim the power of Your awesome deeds, and I will declare Your greatness.
7 ULB నువ్వు కనపరిచే కరుణ ఉన్నతిని వాళ్ళు చాటిస్తారు. నీ నీతి క్రియలను వాళ్ళు ఆలపిస్తారు. BSB BSB: They will extol the fame of Your abundant goodness and sing joyfully of Your righteousness.
8 ULB యెహోవా దయ, వాత్సల్యం గలవాడు. ఆయన కోపం విషయంలో నిదానించే వాడు. నిబంధన విశ్వసనీయత ఆయనలో పొంగి పొరలుతూ ఉంది. BSB BSB: The LORD is gracious and compassionate, slow to anger and abounding in loving devotion.
9 ULB యెహోవా అందరికీ మేలు చేస్తాడు. సృష్టి అంతటి మీదా ఆయన వాత్సల్యం చూపుతాడు. BSB BSB: The LORD is good to all; His compassion rests on all He has made.
10 ULB యెహోవా నీ క్రియలన్నిటిని బట్టి నువ్వు స్తుతి ప్రశంసలకు పాత్రుడవు. నీ భక్తులు నిన్ను సన్నుతిస్తారు. BSB BSB: All You have made will give You thanks, O LORD, and Your saints will bless You.
11 ULB నీ భక్తులు నీ రాజ్యవైభవాన్ని గురించి, నీ ప్రభావాన్ని గురించి మాట్లాడుకుంటారు. BSB BSB: They will tell of the glory of Your kingdom and speak of Your might,
12 ULB మహోన్నతమైన నీ రాజ్య ప్రాభవాన్ని, నీ శక్తి సామర్ధ్యాలను ప్రజలకు తెలపడానికి నీ బలప్రభావాలను గూర్చి మాట్లాడతారు. BSB BSB: to make known to men Your mighty acts and the glorious splendor of Your kingdom.
13 ULB నీ రాజ్యం కలకాలం ఉంటుంది. నీ రాజ్య పరిపాలన తరతరాలు నిలిచి ఉంటుంది. BSB BSB: Your kingdom is an everlasting kingdom, and Your dominion endures through all generations. The LORD is faithful in all His words and kind in all His actions.
14 ULB కూలిపోతున్న వాళ్ళను యెహోవా స్థిరపరుస్తాడు. కృంగిన వాళ్ళను లేవనెత్తుతాడు. BSB BSB: The LORD upholds all who fall and lifts up all who are bowed down.
15 ULB జీవులన్నిటి కళ్ళు నీవైపే చూస్తున్నాయి. తగిన కాలంలో నువ్వు వాటికి ఆహారం పెడుతున్నావు. BSB BSB: The eyes of all look to You, and You give them their food in season.
16 ULB నీ గుప్పిలి విప్పి ప్రతి ప్రాణి ఆకలి తీరుస్తున్నావు. BSB BSB: You open Your hand and satisfy the desire of every living thing.
17 ULB యెహోవా తన విధానాలన్నిటిలో నిజాయితీగా ప్రవర్తిస్తాడు. ఆయన తన కృప ద్వారా పనులు సఫలం చేస్తాడు. BSB BSB: The LORD is righteous in all His ways and kind in all His deeds.
18 ULB ఆయన తనను వేడుకునే వాళ్ళందరికీ, తనకు యథార్ధంగా ప్రార్థన చేసే వాళ్ళందరికీ చేరువగా ఉన్నాడు. BSB BSB: The LORD is near to all who call on Him, to all who call out to Him in truth.
19 ULB తన భక్తుల కోరికలు ఆయన నెరవేరుస్తాడు. వాళ్ళ ప్రార్థన విని వాళ్ళను కాపాడతాడు. BSB BSB: He fulfills the desires of those who fear Him; He hears their cry and saves them.
20 ULB తనను ప్రేమించే వాళ్ళందరినీ యెహోవా కాపాడతాడు. అదే సమయంలో దుష్టులంతా నశించిపోయేలా చేస్తాడు. BSB BSB: The LORD preserves all who love Him, but all the wicked He will destroy.
21 ULB నా నోరు యెహోవాకు స్తుతి గీతాలు పాడుతుంది. శరీరం ఉన్నవాళ్ళంతా ఆయన పవిత్ర నామాన్ని సదాకాలం స్తుతిస్తారు గాక. BSB BSB: My mouth will declare the praise of the LORD; let every creature bless His holy name forever and ever.
Select verses for actions: Enter goes to them and Escape comes back.