2 ULB నా దేవా, పగలు నేను మొరపెడతాను, కాని నువ్వు జవాబివ్వవు. రాత్రివేళ నేను మౌనంగా ఉండను! BSB BSB: I cry out by day, O my God, but You do not answer, and by night, but I have no rest.
3 ULB నువ్వు పవిత్రుడవు. ఇశ్రాయేలు చేసే స్తుతులతో రాజుగా సింహాసనం మీద కూర్చుని ఉంటావు. BSB BSB: Yet You are holy, enthroned on the praises of Israel.
4 ULB మా పితరులు నీలో నమ్మకం ఉంచారు. నువ్వు వాళ్ళను రక్షించావు. BSB BSB: In You our fathers trusted; they trusted and You delivered them.
5 ULB వాళ్ళు నీకు మొరపెట్టినప్పుడు విడుదల పొందారు. వాళ్ళు నీలో నమ్మకం ఉంచి నిరుత్సాహపడలేదు. BSB BSB: They cried out to You and were set free; they trusted in You and were not disappointed.
6 ULB కాని నేను మనిషిని కాదు. పురుగును. మనుషుల ద్వేషం అనుభవించాను, మానవాళికి అవమానంగా ఉన్నాను. BSB BSB: But I am a worm and not a man, scorned by men and despised by the people.
7 ULB నన్ను చూసిన వాళ్ళందరూ నన్ను ఆక్షేపిస్తున్నారు. నన్ను వెక్కిరిస్తూ, నన్ను చూసి తలలు ఆడిస్తున్నారు. BSB BSB: All who see me mock me; they sneer and shake their heads:
8 ULB అతడు యెహోవాలో నమ్మకం పెట్టుకున్నాడు, యెహోవా అతన్ని రక్షించనివ్వండి. అతడు ఆయనలో ఆనందిస్తున్నాడు గనక యెహోవా అతన్ని రక్షించనివ్వండి, అని వాళ్ళు అంటున్నారు. BSB BSB: “He trusts in the LORD, let the LORD deliver him; let the LORD rescue him, since He delights in him.”
9 ULB ఎందుకంటే గర్భంలోనుంచి నన్ను తీసిన వాడివి నువ్వే. నేను నా తల్లి రొమ్ములపై ఉన్నప్పుడే నీపై నమ్మకం పుట్టించావు. BSB BSB: Yet You brought me forth from the womb; You made me secure at my mother’s breast.
10 ULB గర్భంలో ఉండగానే నేను నీ మీద ఆధారపడ్డాను. నేను నా తల్లి కడుపులో ఉన్నప్పటినుంచి నువ్వే నా దేవుడివి. BSB BSB: From birth I was cast upon You; from my mother’s womb You have been my God.
11 ULB ఆపద ముంచుకు వచ్చింది. నాకు దూరంగా ఉండకు. నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. BSB BSB: Be not far from me, for trouble is near and there is no one to help.
12 ULB చాలా ఎద్దులు, బలమైన బాషాను దేశపు వృషభాలు నన్ను చుట్టుముట్టాయి. BSB BSB: Many bulls surround me; strong bulls of Bashan encircle me.
13 ULB వేటను చీలుస్తూ, గర్జిస్తూ ఉన్న సింహంలాగా వాళ్ళు తమ నోళ్లు పెద్దగా తెరిచారు. BSB BSB: They open their jaws against me like lions that roar and maul.
14 ULB నన్ను నీళ్ళలా పారబోస్తున్నారు. నా ఎముకలన్నీ స్థానం తప్పాయి. నా హృదయం మైనంలా ఉంది. నా అంతర్భాగాల్లో అది కరిగిపోతూ ఉంది. BSB BSB: I am poured out like water, and all my bones are disjointed. My heart is like wax; it melts away within me.
15 ULB నా బలం చిల్లపెంకులా ఎండిపోయింది. నా నాలుక నా దవడకు అంటుకుంటూ ఉంది. మరణ ధూళిలో నువ్వు నన్ను పడుకోబెట్టావు. BSB BSB: My strength is dried up like a potsherd, and my tongue sticks to the roof of my mouth. You lay me in the dust of death.
16 ULB కుక్కలు నన్ను చుట్టుముట్టాయి, దుష్టులు గుంపుగూడి నన్ను ఆవరించారు. వాళ్ళు నా చేతులను నా పాదాలను పొడిచారు. BSB BSB: For dogs surround me; a band of evil men encircles me; they have pierced my hands and feet.
17 ULB నా ఎముకలన్నీ నేను లెక్కపెట్టగలను. వాళ్ళు నా వైపు తేరి చూస్తున్నారు. BSB BSB: I can count all my bones; they stare and gloat over me.
18 ULB నా వస్త్రాలు పంచుకుంటున్నారు. నా అంగీ కోసం చీట్లు వేస్తున్నారు. BSB BSB: They divide my garments among them and cast lots for my clothing.
19 ULB యెహోవా, దూరంగా ఉండకు. నా బలమా, త్వరపడి నాకు సహాయం చెయ్యి. BSB BSB: But You, O LORD, be not far off; O my Strength, come quickly to help me.
20 ULB ఖడ్గం నుంచి నా ప్రాణాన్ని, కుక్కల పంజాలనుంచి నా విలువైన ప్రాణాన్ని రక్షించు. BSB BSB: Deliver my soul from the sword, my precious life from the power of wild dogs.
21 ULB సింహం నోటి నుండి నన్ను రక్షించు. అడవిదున్న కొమ్ములనుంచి నన్ను రక్షించు. BSB BSB: Save me from the mouth of the lion; at the horns of the wild oxen You have answered me!
22 ULB నీ నామం నా సోదరులకు ప్రచారం చేస్తాను. సమాజం మధ్య నిన్ను స్తుతిస్తాను. BSB BSB: I will proclaim Your name to my brothers; I will praise You in the assembly.
23 ULB యెహోవా పట్ల భయం ఉన్నవారలారా, ఆయన్ని స్తుతించండి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయన్ని ఘనపరచండి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయన్ని చూసి విస్మయం చెందండి. BSB BSB: You who fear the LORD, praise Him! All descendants of Jacob, honor Him! All offspring of Israel, revere Him!
25 ULB మహా సమాజంలో నీ నుండి నా స్తుతి వస్తుంది. ఆయనపట్ల భయభక్తులు కలిగిన వారి ఎదుట నా మొక్కుబడులు చెల్లిస్తాను. BSB BSB: My praise for You resounds in the great assembly; I will fulfill my vows before those who fear You.
26 ULB బాధితులు భోజనం చేసి తృప్తి పొందుతారు. యెహోవాను వెదికేవాళ్ళు ఆయనను స్తుతిస్తారు. వారి హృదయాలు శాశ్వతకాలం జీవిస్తాయి గాక. BSB BSB: The poor will eat and be satisfied; those who seek the LORD will praise Him. May your hearts live forever!
27 ULB భూనివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా వైపు తిరుగుతారు. జాతుల కుటుంబాలన్నీ ఆయన ఎదుట వంగి నమస్కారం చేస్తాయి. BSB BSB: All the ends of the earth will remember and turn to the LORD. All the families of the nations will bow down before Him.
28 ULB ఎందుకంటే రాజ్యం యెహోవాదే. జాతులను పాలించేవాడు ఆయనే. BSB BSB: For dominion belongs to the LORD and He rules over the nations.
29 ULB భూమి మీద వర్ధిల్లుతున్న వాళ్ళందరూ ఆరాధిస్తారు. తమ సొంత ప్రాణాలు కాపాడుకోలేని వాళ్ళు, మట్టిలోకి దిగిపోతున్న వాళ్ళందరూ ఆయన ఎదుట వంగి నమస్కరిస్తారు. BSB BSB: All the rich of the earth will feast and worship; all who go down to the dust will kneel before Him—even those unable to preserve their lives.
30 ULB రానున్న ఒక తరం వాళ్ళు ఆయన్ని సేవిస్తారు. తమ తరవాతి తరానికి ప్రభువును గురించి చెబుతారు. BSB BSB: Posterity will serve Him; they will declare the Lord to a new generation.
31 ULB వాళ్ళు వచ్చి ఆయన న్యాయ విధానం గురించి చెబుతారు. ఆయన క్రియలను ఇంకా పుట్టని వారికి చెబుతారు! BSB BSB: They will come and proclaim His righteousness to a people yet unborn—all that He has done.
Select verses for actions: Enter goes to them and Escape comes back.