1 ULB చెడ్డ వారిని చూసి నువ్వు క్షోభపడకు. అధర్మంగా ప్రవర్తించే వాళ్ళని చూసి అసూయ పడకు. BSB BSB: Of David. Do not fret over those who do evil; do not envy those who do wrong.
2 ULB ఎందుకంటే వాళ్ళు గడ్డిలాగా త్వరలోనే ఎండిపోతారు. పచ్చటి మొక్కల్లా వాడి పోతారు. BSB BSB: For they wither quickly like grass and wilt like tender plants.
3 ULB యెహోవాలో నమ్మకం ఉంచు. ఏది మంచిదో దాన్నే చెయ్యి. దేశంలో స్థిరపడి విశ్వసనీయతను ఆచరించు. BSB BSB: Trust in the LORD and do good; dwell in the land and cultivate faithfulness.
4 ULB తర్వాత యెహోవాలో ఆనందించు. నీ హృదయంలోని ఆశలన్నిటినీ ఆయన తీరుస్తాడు. BSB BSB: Delight yourself in the LORD, and He will give you the desires of your heart.
5 ULB నీ జీవిత గమనాన్ని యెహోవాకు అప్పగించు. ఆయనలో నమ్మకముంచు. ఆయన నీ తరుపున పని చేస్తాడు. BSB BSB: Commit your way to the LORD; trust in Him, and He will do it.
6 ULB పగటి వెలుగులా నీ న్యాయవర్తననూ, మధ్యాహ్నపు వెలుగులా నీ నిర్దోషత్వాన్నీ ఆయన చూపిస్తాడు. BSB BSB: He will bring forth your righteousness like the dawn, your justice like the noonday sun.
7 ULB యెహోవా ఎదుట మౌనంగా ఉండు. సహనంతో ఆయన కోసం వేచి ఉండు. దుర్మార్గాలు చేసి ఎవరన్నా విజయం సాధిస్తే చింతించకు. ఎవరన్నా కుట్రలు చేస్తే విచారించకు. BSB BSB: Be still before the LORD and wait patiently for Him; do not fret when men prosper in their ways, when they carry out wicked schemes.
8 ULB కోపపడకు. నిరుత్సాహపడకు. చింతపడకు. దానివల్ల సమస్యలు కలుగుతాయి. BSB BSB: Refrain from anger and abandon wrath; do not fret—it can only bring harm.
9 ULB దుర్మార్గకార్యాలు చేసే వాళ్ళు నిర్మూలం అవుతారు. కానీ యెహోవా కోసం వేచి చూసే వాళ్ళు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. BSB BSB: For the evildoers will be cut off, but those who hope in the LORD will inherit the land.
10 ULB ఇక కొద్ది కాలంలోగా దుర్మార్గుడు లేకుండా పోతాడు. అతడున్న స్థలాన్ని నువ్వు ఎంత వెదికినా అతడు కనిపించడు. BSB BSB: Yet a little while, and the wicked will be no more; though you look for them, they will not be found.
11 ULB నమ్రత గలవాళ్ళు భూమిని స్వాధీనం చేసుకుంటారు. గొప్ప సమృద్ధి కలిగి సంతోషిస్తారు. BSB BSB: But the meek will inherit the land and delight in abundant prosperity.
12 ULB దుష్టుడు ధర్మాత్ముడికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తాడు. వాడు అతనికి విరోధంగా పళ్ళు కొరుకుతాడు. BSB BSB: The wicked scheme against the righteous and gnash their teeth at them,
13 ULB వాళ్ళ సమయం అయిపోవచ్చింది కాబట్టి ప్రభువు వాళ్ళను చూసి నవ్వుతాడు. BSB BSB: but the Lord laughs, seeing that their day is coming.
14 ULB అణచివేతకి గురైన వాళ్ళనీ పేదలనీ నిరుత్సాహపరచడానికీ, నిజాయితీగా ఉండేవాళ్ళనీ చంపడానికీ దుష్టులు తమ కత్తులు దూశారు. తమ విల్లును వంచారు. BSB BSB: The wicked have drawn the sword and bent the bow to bring down the poor and needy, to slay those whose ways are upright.
15 ULB వాళ్ళ కత్తులు వాళ్ళ గుండెల్నే చీల్చివేస్తాయి. వాళ్ళ విల్లులు విరిగిపోతాయి. BSB BSB: But their swords will pierce their own hearts, and their bows will be broken.
16 ULB దుష్టుల దగ్గర ఉన్న సమృద్ధి కంటే ధర్మాత్ముడి దగ్గర ఉన్న కొంచెమే శ్రేష్ఠమైనది. BSB BSB: Better is the little of the righteous than the abundance of many who are wicked.
17 ULB దుష్టుల చేతులు విరిగిపోతాయి. కానీ యెహోవా ధర్మాత్ములను కాపాడతాడు. BSB BSB: For the arms of the wicked will be broken, but the LORD upholds the righteous.
18 ULB యెహోవా నిందారహితులను ప్రతిరోజూ కనిపెట్టుకుని ఉంటాడు. వాళ్ళ వారసత్వం నిత్యమూ ఉంటుంది. BSB BSB: The LORD knows the days of the blameless, and their inheritance will last forever.
19 ULB రోజులు బాగా లేనప్పుడు వాళ్ళకు అవమానం కలగదు. కరువు కాలంలో వాళ్ళకు చాలినంత ఆహారం ఉంటుంది. BSB BSB: In the time of evil they will not be ashamed, and in the days of famine they will be satisfied.
20 ULB అయితే దుష్టులు నశించిపోతారు. యెహోవా విరోధుల కీర్తి పచ్చిక బయళ్ళ చందంగా ఉంటుంది. వాళ్ళు సమసిపోయి పొగలాగా కనిపించకుండా పోతారు. BSB BSB: But the wicked and enemies of the LORD will perish like the glory of the fields. They will vanish; like smoke they will fade away.
21 ULB దుష్టులు అప్పు చేస్తారు, కానీ తిరిగి చెల్లించరు. కానీ ధర్మాత్ములు దయతో దానం చేస్తారు. BSB BSB: The wicked borrow and do not repay, but the righteous are gracious and giving.
22 ULB యెహోవా ఆశీర్వదించిన వాళ్ళు భూమిని స్వాధీనం చేసుకుంటారు. ఆయన ఎవరినైతే శపిస్తాడో వాళ్ళు నాశనమౌతారు. BSB BSB: Surely those He blesses will inherit the land, but the cursed will be destroyed.
23 ULB దేవుని దృష్టిలో ఏ వ్యక్తి మార్గం కొనియాడదగ్గదిగా ఉందో ఆ వ్యక్తి నడతను యెహోవా స్థిరపరుస్తాడు. BSB BSB: The steps of a man are ordered by the LORD who takes delight in his journey.
24 ULB యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కాబట్టి అతడు తన మార్గంలో తడబడినా కిందపడడు. BSB BSB: Though he falls, he will not be overwhelmed, for the LORD is holding his hand.
25 ULB నేను ఒకప్పుడు చిన్నవాడిగా ఉన్నాను. ఇప్పుడు పెద్దవాణ్ణి అయ్యాను. అయితే నీతిమంతుడు అనాథ కావడం గానీ, లేదా అతడి పిల్లలు అడుక్కోవడం గానీ నేను చూడలేదు. BSB BSB: I once was young and now am old, yet never have I seen the righteous abandoned or their children begging for bread.
26 ULB అతడు రోజంతా దయతో అప్పులిస్తూ ఉంటాడు. అతని పిల్లలు ఆశీర్వాదంగా ఉంటారు. BSB BSB: They are ever generous and quick to lend, and their children are a blessing.
27 ULB చెడు నుండి మళ్ళుకో. ఏది మంచిదో దాన్ని చెయ్యి. అప్పుడు నువ్వు కలకాలం సురక్షితంగా ఉంటావు. BSB BSB: Turn away from evil and do good, so that you will abide forever.
28 ULB ఎందుకంటే యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు. విశ్వాసంతో తనను అనుసరించే వాళ్ళను ఆయన విడిచిపెట్టడు. వాళ్ళను శాశ్వతంగా భద్రపరుస్తాడు. అయితే దుర్మార్గుల సంతానం నాశనం అవుతుంది. BSB BSB: For the LORD loves justice and will not forsake His saints. They are preserved forever, but the offspring of the wicked will be cut off.
29 ULB నీతిమంతులు భూమిని స్వాధీనం చేసుకుంటారు. అక్కడ వాళ్ళు కలకాలం జీవిస్తారు. BSB BSB: The righteous will inherit the land and dwell in it forever.
30 ULB నీతిమంతుని నోరు జ్ఞానాన్ని పలుకుతుంది. అది న్యాయాన్ని అధికం చేస్తుంది. BSB BSB: The mouth of the righteous man utters wisdom, and his tongue speaks justice.
31 ULB అతని హృదయంలో అతని దేవుని ధర్మశాస్త్రం ఉంది. అతని అడుగులు జారవు. BSB BSB: The law of his God is in his heart; his steps do not falter.
32 ULB దుర్మార్గుడు ధర్మాత్ముణ్ణి గమనిస్తూ ఉంటాడు. అతణ్ణి చంపడానికి చూస్తూ ఉంటాడు. BSB BSB: Though the wicked lie in wait for the righteous, and seek to slay them,
33 ULB అయితే యెహోవా అతణ్ణి దుష్టుడి చేతిలో వదిలిపెట్టడు. అతనికి తీర్పు జరిగే సమయంలో నేరం మోపడు. BSB BSB: the LORD will not leave them in their power or let them be condemned under judgment.
34 ULB యెహోవా కోసం వేచి ఉండు. ఆయన మార్గాన్ని అనుసరించు. భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఆయన నిన్ను లేపుతాడు. దుర్మార్గులు నిర్మూలమైనప్పుడు నువ్వు చూస్తావు. BSB BSB: Wait for the LORD and keep His way, and He will raise you up to inherit the land. When the wicked are cut off, you will see it.
35 ULB భీకరుడైన దుర్మార్గుడు స్వంత నేలలో పెరిగిన పెద్ద పచ్చని చెట్టులా విస్తరించడం నేను చూశాను. BSB BSB: I have seen a wicked, ruthless man flourishing like a well-rooted native tree,
36 ULB అయితే నేను ఆ దారిన వెళ్ళినప్పుడు నేను వాడి కోసం చూశానుగానీ వాడు నాకు కనిపించలేదు. BSB BSB: yet he passed away and was no more; though I searched, he could not be found.
37 ULB చిత్తశుద్ధి కలిగిన వ్యక్తిని గమనించు. యథార్ధంగా ఉండే వాణ్ణి కనిపెట్టు. శాంతి కోసం జీవించేవాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది. BSB BSB: Consider the blameless and observe the upright, for posterity awaits the man of peace.
38 ULB పాపులు సమూలంగా నాశనం అవుతారు. దుర్మార్గుడికి భవిష్యత్తు ఉండదు. BSB BSB: But the transgressors will all be destroyed; the future of the wicked will be cut off.
39 ULB నీతిపరులకు యెహోవా దగ్గరనుండే ముక్తి కలుగుతుంది. వేదన సమయంలో ఆయన వాళ్ళను కాపాడతాడు. BSB BSB: The salvation of the righteous is from the LORD; He is their stronghold in time of trouble.
40 ULB యెహోవా వాళ్ళని దుర్మార్గుల బారినుంచి రక్షిస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఆయనలో ఆశ్రయం పొందారు. BSB BSB: The LORD helps and delivers them; He rescues and saves them from the wicked, because they take refuge in Him.
Select verses for actions: Enter goes to them and Escape comes back.