1 ULB శక్తిశాలి, దేవుడు అయిన యెహోవా ఆదేశిస్తున్నాడు. పొద్దు పొడిచే దిశ నుండి పొద్దు గుంకే దిశ వరకూ ఉన్న ప్రజలందర్నీ రమ్మని పిలుస్తున్నాడు. BSB BSB: A Psalm of Asaph. The Mighty One, God the LORD, speaks and summons the earth from where the sun rises to where it sets.
2 ULB పరిపూర్ణ సౌందర్యం అయిన సీయోనులో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. BSB BSB: From Zion, perfect in beauty, God shines forth.
3 ULB మన దేవుడు వస్తున్నాడు. ఆయన మౌనంగా ఉండడు. ఆయనకు ముందుగా భీకర అగ్ని కబళించుకుంటూ వెళ్తుంది. ఆయన చుట్టూ ప్రచండ గాలులు వీస్తున్నాయి. BSB BSB: Our God approaches and will not be silent! Consuming fire precedes Him, and a tempest rages around Him.
4 ULB తన ప్రజలకు న్యాయం తీర్చడానికి ఆయన ఆకాశాలనూ భూమినీ పిలుస్తున్నాడు. BSB BSB: He summons the heavens above, and the earth, that He may judge His people:
5 ULB బలి అర్పణ ద్వారా నాతో నిబంధన చేసుకున్న నా విశ్వాస పాత్రులను నా దగ్గరకు సమకూర్చండి అని పిలుస్తున్నాడు. BSB BSB: “Gather to Me My saints, who made a covenant with Me by sacrifice.”
6 ULB ఆకాశాలు ఆయన నీతిని ప్రకటిస్తున్నాయి. ఎందుకంటే దేవుడు తానే న్యాయాధిపతిగా ఉన్నాడు. BSB BSB: And the heavens proclaim His righteousness, for God Himself is Judge. Selah
7 ULB నా ప్రజలారా, వినండి. నేను మాట్లాడతాను. నేను దేవుణ్ణి. మీ దేవుణ్ణి. BSB BSB: “Hear, O My people, and I will speak, O Israel, and I will testify against you: I am God, your God.
8 ULB నీ బలుల విషయమై నేను నిన్ను నిందించడం లేదు. మీ దహనబలులు ఎప్పుడూ నా ఎదుటే ఉన్నాయి. BSB BSB: I do not rebuke you for your sacrifices, and your burnt offerings are ever before Me.
9 ULB నీ ఇంటి నుండి ఎద్దునైనా, నీ మందలోని మేకపోతులనైనా నేను తీసుకోను. BSB BSB: I have no need for a bull from your stall or goats from your pens,
10 ULB ఎందుకంటే అడవిలో ఉన్న ప్రతి మృగమూ నాదే. వెయ్యి కొండలపై తిరుగాడే పశువులన్నీ నావే. BSB BSB: for every beast of the forest is Mine—the cattle on a thousand hills.
11 ULB కొండల్లోని పక్షులన్నీ నాకు తెలుసు. పొలాల్లోని మృగాలు నా వశమే. BSB BSB: I know every bird in the mountains, and the creatures of the field are Mine.
12 ULB నాకు ఒకవేళ ఆకలివేస్తే అది నీకు చెప్పను. ఎందుకంటే ఈ ప్రపంచమంతా నాదే. భూమిలో ఉండేదంతా నాదే. BSB BSB: If I were hungry, I would not tell you, for the world is Mine, and the fullness thereof.
13 ULB ఎద్దుల మాంసం నేను తింటానా? మేకల రక్తం తాగుతానా? BSB BSB: Do I eat the flesh of bulls, or drink the blood of goats?
14 ULB దేవునికి నీ కృతజ్ఞతార్పణ సమర్పించు. మహోన్నతుడికి నీ ప్రమాణాలను నెరవేర్చు. BSB BSB: Sacrifice a thank offering to God, and fulfill your vows to the Most High.
15 ULB సమస్యలు చుట్టుముట్టిన రోజున నాకు ప్రార్థించు. నేను నిన్ను కాపాడతాను. నువ్వు నన్ను కీర్తిస్తావు. BSB BSB: Call upon Me in the day of trouble; I will deliver you, and you will honor Me.”
16 ULB కానీ దుర్మార్గులతో దేవుడు ఇలా అంటున్నాడు. నా నియమాలను ప్రకటించడానికి నీకేం పని? నా నిబంధన నీ నోట పలకాల్సిన అవసరం ఏమిటి? BSB BSB: To the wicked, however, God says, “What right have you to recite My statutes and to bear My covenant on your lips?
17 ULB ఆదేశాలను నువ్వు అసహ్యించుకుంటావు. నా మాటలు పట్టించుకోకుండా తోసివేస్తావు. BSB BSB: For you hate My instruction and cast My words behind you.
18 ULB నువ్వు దొంగను చూసి వాడితో ఏకీభవిస్తావు. వ్యభిచారం చేసే వాళ్ళతో కలుస్తావు. BSB BSB: When you see a thief, you befriend him, and throw in your lot with adulterers.
19 ULB ఎవరికైనా అపకారం తలపెట్టడానికి నోరు తెరుస్తావు. నీ నాలుక వంచన చేస్తుంది. BSB BSB: You unleash your mouth for evil and harness your tongue to deceit.
20 ULB కూర్చుని నీ సోదరుడికి వ్యతిరేకంగా మాట్లాడుతావు. నీ స్వంత సోదరుడిపై అపనిందలు మోపుతావు. BSB BSB: You sit and malign your brother; you slander your own mother’s son.
21 ULB నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నా నేను మౌనంగానే ఉన్నాను. దాంతో నన్ను నీతో సమానంగా జమ కట్టావు. కానీ నేను నువ్వు చేసిన పనులన్నిటినీ నీ కళ్ళ ఎదుటికి తీసుకువస్తాను. నిన్ను గద్దిస్తాను. BSB BSB: You have done these things, and I kept silent; you thought I was just like you. But now I rebuke you and accuse you to your face.
22 ULB దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళు ఈ సంగతి ఆలోచించండి. లేదా నేను మిమ్మల్ని ముక్కలుగా చీల్చి వేస్తాను. మీకు సహాయం చేయడానికి ఎవరూ రారు. BSB BSB: Now consider this, you who forget God, lest I tear you to pieces, with no one to rescue you:
23 ULB కృతజ్ఞతార్పణ అర్పించే వాడు నన్ను స్తుతిస్తున్నాడు. తన ప్రయాణం సరైన మార్గంలో చేయాలని ఆలోచించే వాళ్లకు నేను దేవుని ముక్తిని చూపిస్తాను. BSB BSB: He who sacrifices a thank offering honors Me, and to him who rightly orders his way, I will show the salvation of God.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.