1 ULB దేవా, నీ నిబంధన కృప కారణంగా నన్ను కనికరించు. నీ అధికమైన కరుణను బట్టి నా దోషాలను తుడిచివెయ్యి. BSB BSB: For the choirmaster. A Psalm of David. When Nathan the prophet came to him after his adultery with Bathsheba. Have mercy on me, O God, according to Your loving devotion; according to Your great compassion, blot out my transgressions.
2 ULB నా అతిక్రమం పోయేలా నన్ను శుభ్రంగా కడుగు. నా పాపం నుండి నన్ను పవిత్రపరచు. BSB BSB: Wash me clean of my iniquity and cleanse me from my sin.
3 ULB నా అతిక్రమాలేంటో నాకు తెలుసు. నేను చేసిన పాపం నా కళ్ళ ఎదుటే ఉంది. BSB BSB: For I know my transgressions, and my sin is always before me.
4 ULB నీకు వ్యతిరేకంగా, కేవలం నీకే వ్యతిరేకంగా నేను పాపం చేశాను. నీ దృష్టికి ఏది దుర్మార్గమో దాన్నే నేను చేశాను. నువ్వు మాట్లాడేటప్పుడు సత్యం మాట్లాడుతావు. నువ్వు తీర్పు తీర్చేటప్పుడు న్యాయవంతుడిగా ఉంటావు. BSB BSB: Against You, You only, have I sinned and done what is evil in Your sight, so that You may be proved right when You speak and blameless when You judge.
6 ULB ఇదిగో, నువ్వు నా హృదయంలో నమ్మదగ్గవాడుగా ఉండాలని నువ్వు కోరుతున్నావు. నా హృదయంలో జ్ఞానాన్ని తెలుసుకునేలా చేస్తావు. BSB BSB: Surely You desire truth in the inmost being; You teach me wisdom in the inmost place.
7 ULB నన్ను హిస్సోపుతో శుభ్రం చెయ్యి. నేను పవిత్రుణ్ణి అవుతాను. నన్ను కడుగు. నేను మంచు కంటే తెల్లగా ఉంటాను. BSB BSB: Purify me with hyssop, and I will be clean; wash me, and I will be whiter than snow.
8 ULB నువ్వు విరిచిన ఎముకలు హర్షించడానికై ఆనందమూ, సంతోషమూ నాకు వినిపించు. BSB BSB: Let me hear joy and gladness; let the bones You have crushed rejoice.
9 ULB నా పాపాలనుండి నీ ముఖం తిప్పుకో. నా దోషాలన్నిటినీ తుడిచి పెట్టు. BSB BSB: Hide Your face from my sins and blot out all my iniquities.
10 ULB దేవా, నాలో పవిత్రమైన హృదయం సృష్టించు. నాలో సరైన మనస్సును పునరుద్దరించు. BSB BSB: Create in me a clean heart, O God, and renew a right spirit within me.
11 ULB నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయవద్దు. నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయవద్దు. BSB BSB: Cast me not away from Your presence; take not Your Holy Spirit from me.
12 ULB నీ రక్షణలోని ఆనందాన్ని నాలో తిరిగి దయచెయ్యి. అంగీకరించే ఆత్మతో నన్ను బలపరచు. BSB BSB: Restore to me the joy of Your salvation, and sustain me with a willing spirit.
13 ULB అప్పుడు అతిక్రమాలు చేసేవాళ్ళకు నీ మార్గాలు బోధిస్తాను. అప్పుడు పాపులు నీ వైపు తిరుగుతారు. BSB BSB: Then I will teach transgressors Your ways, and sinners will return to You.
14 ULB నా రక్షణకు ఆధారమైన దేవా, రక్తాన్ని చిందించినందుకు నన్ను క్షమించు. నీ నీతిన్యాయాలను బట్టి నేను ఆనందంతో బిగ్గరగా గానం చేస్తాను. BSB BSB: Deliver me from bloodguilt, O God, the God of my salvation, and my tongue will sing of Your righteousness.
15 ULB ప్రభూ, నా పెదాలను తెరువు. నా నోరు నీకు స్తుతి పాడుతుంది. BSB BSB: O Lord, open my lips, and my mouth will declare Your praise.
16 ULB నీకు బలుల్లో సంతోషం ఉండదు. ఒకవేళ నువ్వు బలినే కోరుకుంటే నేను అర్పిస్తాను. దహన బలుల్లో నీకు సంతోషం ఉండదు. BSB BSB: For You do not delight in sacrifice, or I would bring it; You take no pleasure in burnt offerings.
17 ULB విరిగిన మనస్సే దేవునికి సమర్పించే నిజమైన బలి. దేవా, విరిగి పరితాపం చెందిన హృదయాన్ని నువ్వు తిరస్కరించవు. BSB BSB: The sacrifices of God are a broken spirit; a broken and a contrite heart, O God, You will not despise.
18 ULB నీ సంతోషాన్ని బట్టి సీయోనుకు మేలు చెయ్యి. యెరూషలేము గోడలను తిరిగి నిర్మించు. BSB BSB: In Your good pleasure, cause Zion to prosper; build up the walls of Jerusalem.
19 ULB అప్పుడు నీతిమయమైన బలులు నీకు సంతోషం కలిగిస్తాయి. దహనబలుల్లోనూ, సర్వాంగ బలుల్లోనూ నువ్వు సంతోషిస్తావు. అప్పుడు ప్రజలు నీ బలిపీఠంపై ఎద్దులను అర్పిస్తారు. BSB BSB: Then You will delight in righteous sacrifices, in whole burnt offerings; then bulls will be offered on Your altar.
Select verses for actions: Enter goes to them and Escape comes back.