3 ULB నువ్వు మనుషులను తిరిగి మట్టిగా మారుస్తావు. మనుషులారా, తిరిగి రండి, అంటావు. BSB BSB: You return man to dust, saying, “Return, O sons of mortals.”
4 ULB నీ దృష్టిలో వెయ్యేళ్ళు గడిచిపోయిన నిన్నలాగా ఒక రాత్రిపూటలాగా ఉన్నాయి. BSB BSB: For in Your sight a thousand years are but a day that passes, or a watch of the night.
5 ULB వరదలో కొట్టుకుపోయినట్టు నువ్వు వారిని లాక్కెళ్ళిపోతావు, వాళ్ళు నిద్ర పోతారు. పచ్చ గడ్డిలాగా వాళ్ళు పొద్దున్నే చిగురిస్తారు. BSB BSB: You sweep them away in their sleep; they are like the new grass of the morning—
6 ULB ఉదయాన అది మొలిచి పెరుగుతుంది, సాయంకాలం అది వాడిపోయి ఎండిపోతుంది. BSB BSB: in the morning it springs up new, but by evening it fades and withers.
7 ULB నీ కోపం చేత మేము హరించుకుపోతున్నాం, నీ ఉగ్రత మమ్మల్ని భయపెడుతూ ఉంది. BSB BSB: For we are consumed by Your anger and terrified by Your wrath.
8 ULB మా అపరాధాలను నువ్వు నీ ఎదుట ఉంచుకున్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి. BSB BSB: You have set our iniquities before You, our secret sins in the light of Your presence.
9 ULB నీ ఉగ్రత భరిస్తూ మా జీవితం గడుపుతున్నాం. నిట్టూర్పులాగా మా జీవితకాలం త్వరగా గడిచిపోతుంది. BSB BSB: For all our days decline in Your fury; we finish our years with a sigh.
10 ULB మా బలము డెభ్భై ఏళ్ళు. ఆరోగ్యంగా ఉంటే ఎనభై ఏళ్ళుకూడా ఉండొచ్చు. అయినా మా శ్రేష్ట కాలం కష్టాలూ దుఃఖాలే. అవును, అవి త్వరగా గడిచిపోతాయి. మేము ఎగిరిపోతాం. BSB BSB: The length of our days is seventy years—or eighty if we are strong—yet their pride is but labor and sorrow, for they quickly pass, and we fly away.
11 ULB నీ కోపం ఎంత తీవ్రమో ఎవరికి తెలుసు? నీ ఆగ్రహం దానికి తగిన భయాన్ని రేపుతుందని ఎవరికి తెలుసు? BSB BSB: Who knows the power of Your anger? Your wrath matches the fear You are due.
12 ULB కాబట్టి మేము జ్ఞానంగా బ్రతికేలా మా బ్రతుకును గురించి ఆలోచించడం మాకు నేర్పు. BSB BSB: So teach us to number our days, that we may present a heart of wisdom.
13 ULB యెహోవా, తిరిగి రా! ఎంతకాలం పడుతుంది? నీ సేవకుల పట్ల జాలి పడు. BSB BSB: Return, O LORD! How long will it be? Have compassion on Your servants.
14 ULB ఉదయాన నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. అప్పుడు మేము మా రోజులన్నీ ఉల్లాసంగా ఆనందంగా గడుపుతాం. BSB BSB: Satisfy us in the morning with Your loving devotion, that we may sing for joy and be glad all our days.
15 ULB నువ్వు మమ్మల్ని బాధించిన రోజుల లెక్కప్రకారం మేము కష్టాలు అనుభవించిన సంవత్సరాలకు తగ్గట్టుగా మమ్మల్ని సంతోషపరచు. BSB BSB: Make us glad for as many days as You have afflicted us, for as many years as we have seen evil.
16 ULB నీ సేవకులకు నీ పని చూపించు, మా సంతానం నీ వైభవాన్ని చూడనివ్వు. BSB BSB: May Your work be shown to Your servants, and Your splendor to their children.
17 ULB మా యెహోవా దేవుని ప్రసన్నత మా మీద ఉండు గాక. మా చేతి పనిని మాకు సుస్థిరం చెయ్యి. నిజంగా, మా చేతి పనిని మాకు సుస్థిరం చెయ్యి. BSB BSB: May the favor of the Lord our God rest upon us; establish for us the work of our hands—yes, establish the work of our hands!
Select verses for actions: Enter goes to them and Escape comes back.