1 ULB సర్వోన్నతుడి చాటున నివసించే వాడు సర్వశక్తిశాలి నీడలో నిలిచి ఉంటాడు. BSB BSB: He who dwells in the shelter of the Most High will abide in the shadow of the Almighty.
2 ULB ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడు, అని నేను యెహోవాను గురించి చెబుతాను. BSB BSB: I will say to the LORD, “You are my refuge and my fortress, my God, in whom I trust.”
3 ULB వేటగాడు పన్నిన ఉచ్చు నుంచి ప్రాణాంతకవ్యాధి నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. BSB BSB: Surely He will deliver you from the snare of the fowler, and from the deadly plague.
4 ULB ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం దొరుకుతుంది. ఆయన నమ్మకత్వం నిన్ను కాపాడే కవచంగా ఉంటుంది. BSB BSB: He will cover you with His feathers; under His wings you will find refuge; His faithfulness is a shield and rampart.
5 ULB రాత్రిలో కలిగే భయభ్రాంతులకు, పగటివేళ ఎగిరి వచ్చే బాణాలకూ నువ్వు భయపడవు. BSB BSB: You will not fear the terror of the night, nor the arrow that flies by day,
6 ULB చీకట్లో తచ్చాడే రోగానికిగానీ మధ్యాహ్నం సోకే వ్యాధికి గానీ నువ్వు బెదిరిపోవు. BSB BSB: nor the pestilence that stalks in the darkness, nor the calamity that destroys at noon.
7 ULB నీ పక్కన వేయి మంది, నీ కుడిపక్కన పదివేల మంది నేలకూలినా అది నీ దరిదాపులకు రాదు. BSB BSB: Though a thousand may fall at your side, and ten thousand at your right hand, no harm will come near you.
8 ULB దుర్మార్గులకు పడే శిక్ష నువ్వు చూస్తూ ఉంటావు. BSB BSB: You will only see it with your eyes and witness the punishment of the wicked.
9 ULB యెహోవా నా ఆశ్రయం. మహోన్నతుణ్ణి నీకు కూడా శరణుగా చేసుకో. BSB BSB: Because you have made the LORD your dwelling—my refuge, the Most High—
10 ULB ఏ హానీ నిన్ను ముంచెత్తదు. ఏ ఆపదా నీ ఇంటి దరిదాపులకు రాదు. BSB BSB: no evil will befall you, no plague will approach your tent.
11 ULB నువ్వు చేసే వాటన్నిటిలో నిన్ను కాపాడడానికి ఆయన తన దూతలను పురమాయిస్తాడు. BSB BSB: For He will command His angels concerning you to guard you in all your ways.
12 ULB నువ్వు జారి బండ రాయిపై పడిపోకుండా వాళ్ళు నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు. BSB BSB: They will lift you up in their hands, so that you will not strike your foot against a stone.
13 ULB నువ్వు సింహాలనూ నాగుపాములను నీ కాళ్ళ కింద తొక్కుతావు, సింహం కూనలను, పాములను అణగదొక్కుతావు. BSB BSB: You will tread on the lion and cobra; you will trample the young lion and serpent.
14 ULB అతనికి నా మీద భక్తి విశ్వాసాలున్నాయి గనక నేనతన్ని రక్షిస్తాను. అతడు నా పట్ల స్వామిభక్తి గలవాడు గనక నేనతన్ని కాపాడతాను. BSB BSB: “Because he loves Me, I will deliver him; because he knows My name, I will protect him.
15 ULB అతడు నాకు మొరపెడితే నేనతనికి జవాబిస్తాను. కష్టాల్లో నేను అతనితో ఉంటాను, అతనికి విజయమిచ్చి అతన్ని సత్కరిస్తాను. BSB BSB: When he calls out to Me, I will answer him; I will be with him in trouble. I will deliver him and honor him.
16 ULB దీర్ఘాయుష్షుతో అతన్ని తృప్తిపరుస్తాను. నా రక్షణ అతనికి చూపిస్తాను. BSB BSB: With long life I will satisfy him and show him My salvation.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.