1 ULB యెహోవాకు కృతజ్ఞతలు చెప్పడం, మహోన్నతుడా, నీ నామానికి స్తుతి పాడడం మంచిది. BSB BSB: A Psalm. A song for the Sabbath day. It is good to praise the LORD, and to sing praises to Your name, O Most High,
2 ULB ఉదయాన నీ కృపను ప్రతి రాత్రీ నీ విశ్వసనీయతను తెలియజేయడం మంచిది. BSB BSB: to proclaim Your loving devotion in the morning and Your faithfulness at night
3 ULB పది తీగల వాయిద్యంతో, సితారా మాధుర్యంతో స్తుతించడం మంచిది. BSB BSB: with the ten-stringed harp and the melody of the lyre.
4 ULB ఎందుకంటే యెహోవా, నీ పనులతో నువ్వు నన్ను సంతోషపరుస్తున్నావు. నీ చేతిపనులబట్టి నేను ఆనందంగా పాడతాను. BSB BSB: For You, O LORD, have made me glad by Your deeds; I sing for joy at the works of Your hands.
5 ULB యెహోవా, నీ పనులు ఘనమైనవి! నీ ఆలోచనలు ఎంతో లోతైనవి. BSB BSB: How great are Your works, O LORD, how deep are Your thoughts!
6 ULB పశుప్రాయులకు ఇవేమీ తెలియదు. తెలివిలేనివాడు అర్థం చేసుకోలేడు. BSB BSB: A senseless man does not know, and a fool does not understand,
7 ULB దుర్మార్గులు పచ్చని గడ్డి మొక్కల్లాగా మొలిచినా చెడ్డపనులు చేసే వాళ్ళంతా వర్ధిల్లినా నిత్యనాశనానికే గదా! BSB BSB: that though the wicked sprout like grass, and all evildoers flourish, they will be forever destroyed.
8 ULB అయితే యెహోవా, నువ్వే శాశ్వతంగా పరిపాలిస్తావు. BSB BSB: But You, O LORD, are exalted forever!
9 ULB యెహోవా, నీ శత్రువులను చూడు, చెడ్డపనులు చేసే వాళ్ళంతా చెదరిపోతారు. BSB BSB: For surely Your enemies, O LORD, surely Your enemies will perish; all evildoers will be scattered.
10 ULB అడవి దున్న కొమ్ముల్లాగా నువ్వు నా కొమ్ము పైకెత్తావు. కొత్త నూనెతో నన్ను అభిషేకించావు. BSB BSB: But You have exalted my horn like that of a wild ox; with fine oil I have been anointed.
11 ULB నా శత్రువుల అధోగతిని నా కన్నులు చూశాయి. దుష్టులైన నా విరోధుల పతనం నా చెవులు విన్నాయి. BSB BSB: My eyes see the downfall of my enemies; my ears hear the wailing of my wicked foes.
12 ULB నీతిమంతులు ఖర్జూర చెట్టులాగా అభివృద్ధి చెందుతారు. లెబానోనులోని దేవదారు చెట్టులాగా వాళ్ళు ఎదుగుతారు. BSB BSB: The righteous will flourish like a palm tree, and grow like a cedar in Lebanon.
13 ULB వాళ్ళు యెహోవా ఇంటిలో నాటుకుని ఉంటారు. వాళ్ళు మన దేవుని ఆవరణాల్లో వర్ధిల్లుతారు. BSB BSB: Planted in the house of the LORD, they will flourish in the courts of our God.
14 ULB యెహోవా యథార్థవంతుడని తెలియచేయడం కోసం వాళ్ళు ముసలితనంలో కూడా ఫలిస్తారు. తాజాగా పచ్చగా ఉంటారు. BSB BSB: In old age they will still bear fruit; healthy and green they will remain,
15 ULB ఆయనే నా ఆధార శిల, ఆయనలో ఎలాంటి అన్యాయమూ లేదు. BSB BSB: to proclaim, “The LORD is upright; He is my Rock, and in Him there is no unrighteousness.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.