1 ULB బంగారం ఎలా మెరుగు మాసింది! మేలిమి బంగారం ఎలా మాసిపోయింది! ప్రతి వీధి మొదట్లో ప్రతిష్టితమైన రాళ్లు చెల్లాచెదరుగా పారేసి ఉన్నాయి. BSB BSB: How the gold has become tarnished, the pure gold has become dull! The gems of the temple lie scattered on every street corner.
2 ULB సీయోను కుమారులు శ్రేష్ఠులు. వాళ్ళు మేలిమి బంగారం కంటే విలువైన వాళ్ళు. అయితే వాళ్ళు ఇప్పుడు కుమ్మరి చేసిన మట్టికుండల్లాగా అందరూ వారిని చూస్తున్నారు. BSB BSB: How the precious sons of Zion, once worth their weight in pure gold, are now esteemed as jars of clay, the work of a potter’s hands!
3 ULB నక్కలైనా చన్నిచ్చి తమ పిల్లలకు పాలు ఇస్తాయి. కాని నా ప్రజల కుమారి ఎడారిలోని నిప్పు కోడి అంత క్రూరంగా ఉంది. BSB BSB: Even jackals offer their breasts to nurse their young, but the daughter of my people has become cruel, like an ostrich in the wilderness.
4 ULB దప్పిక వల్ల పాలు తాగే పిల్ల నాలుక దాని అంగిటికి అంటుకుంటూ ఉంది. పిల్లలు అన్నం అడుగుతారు, కాని వాళ్ళు తినడానికి ఏమీ లేదు. BSB BSB: The nursing infant’s tongue clings in thirst to the roof of his mouth. Little children beg for bread, but no one gives them any.
5 ULB ఒకప్పుడు రుచికరమైన భోజనం తిన్నవాళ్ళు ఇప్పుడు దిక్కు లేకుండా వీధుల్లో ఆకలితో ఉన్నారు. ఒకప్పుడు ఊదారంగు వస్త్రాలు వేసుకున్న వాళ్ళు ఇప్పుడు చెత్తకుప్పలను ఆశ్రయించారు. BSB BSB: Those who once ate delicacies are destitute in the streets; those brought up in crimson huddle in ash heaps.
6 ULB నా ప్రజల కుమారి చేసిన పాపం సొదొమ పాపం కంటే ఎక్కువ. ఎవరూ దాని మీద చెయ్యి వెయ్యకుండానే అకస్మాత్తుగా అది పడిపోయింది. BSB BSB: The punishment of the daughter of my people is greater than that of Sodom, which was overthrown in an instant without a hand turned to help her.
7 ULB సీయోను నాయకులు మంచులా మెరిసే వాళ్ళు. పాలవలే తెల్లని వాళ్ళు. వాళ్ళ శరీరాలు పగడం కంటే ఎర్రనివి. వాళ్ళ దేహకాంతి నీలం లాంటిది. BSB BSB: Her dignitaries were brighter than snow, whiter than milk; their bodies were more ruddy than rubies, their appearance like sapphires.
8 ULB కానీ ఇప్పుడు చీకటి వారి ముఖాలను నల్లగా చేసేసింది. వాళ్ళు వీధుల్లో గుర్తు పట్టలేనట్టుగా ఉన్నారు. వాళ్ళ చర్మం వాళ్ళ ఎముకలకు అంటుకు పోయింది. అది ఎండిపోయిన చెక్కలా అయ్యింది! BSB BSB: But now their appearance is blacker than soot; they are not recognized in the streets. Their skin has shriveled on their bones; it has become as dry as a stick.
9 ULB కత్తిపోటుతో హతమైన వాళ్ళ పరిస్థితి పొలంలో పంటలేక క్షీణించి కరువుతో హతమైన వాళ్ళ పరిస్థితికన్నా మెరుగు. BSB BSB: Those slain by the sword are better off than those who die of hunger, who waste away, pierced with pain because the fields lack produce.
10 ULB కరుణ గల స్త్రీల చేతులు తాము కన్న తమ సొంత పిల్లలను వండుకున్నాయి. నా ప్రజల కుమారికి వచ్చిన నాశన కాలంలో వాళ్ళ పిల్లలు వాళ్లకు ఆహారం అయ్యారు. BSB BSB: The hands of compassionate women have cooked their own children, who became their food in the destruction of the daughter of my people.
11 ULB యెహోవా తన కోపం తీర్చుకున్నాడు. తన కోపాగ్ని కుమ్మరించాడు. ఆయన సీయోనులో అగ్ని రాజేశాడు. అది దాని పునాదులను కాల్చేసింది. BSB BSB: The LORD has exhausted His wrath; He has poured out His fierce anger; He has kindled a fire in Zion, and it has consumed her foundations.
12 ULB భూరాజులు గాని, ప్రపంచ నివాసులు గాని, ఒక శత్రువు యెరూషలేము గుమ్మాల్లోకి ప్రవేశించగలడని ఎవరూ అనుకోలేదు. BSB BSB: The kings of the earth did not believe, nor any people of the world, that an enemy or a foe could enter the gates of Jerusalem.
13 ULB దానిలో నీతిమంతుల రక్తం చిందడానికి కారణం అయిన దాని యాజకుల పాపం వల్ల, దాని ప్రవక్తల పాపం వల్ల శత్రువు ప్రవేశించాడు. BSB BSB: But this was for the sins of her prophets and the guilt of her priests, who shed the blood of the righteous in her midst.
14 ULB ఇప్పుడు వాళ్ళు గుడ్డివాళ్ళలా వీధుల్లో తిరుగుతున్నారు. వాళ్ళు రక్తం అంటిన అపవిత్రులు. అందుకే ఎవరూ వాళ్ళ వస్త్రాలైనా ముట్టలేక పోతున్నారు. BSB BSB: They wandered blind in the streets, defiled by this blood, so that no one dared to touch their garments.
15 ULB ప్రజలు కేకపెడుతూ <<పొండి! శుద్ధి లేని వాళ్ళలారా పొండి! నన్ను ముట్టుకోవద్దు>> అన్నారు. వాళ్ళు పారిపోయి తిరుగులాడుతూ ఉన్నప్పుడు అన్యప్రజలు వాళ్ళతో, <<విదేశీయులు ఇంక ఇక్కడ ఉండకూడదు>> అంటున్నారు. BSB BSB: “Go away! Unclean!” men shouted at them. “Away, away! Do not touch us!” So they fled and wandered. Among the nations it was said, “They can stay here no longer.”
16 ULB యెహోవా తన సన్నిధిలోనుంచి వాళ్ళను చెదరగొట్టాడు. ఇంక ఆయన వాళ్ళను పట్టించుకోడు. ఇంక యాజకులపట్ల ఎవరూ గౌరవం చూపించరు. పెద్దల పట్ల ఎవరూ దయ చూపించరు. BSB BSB: The presence of the LORD has scattered them; He regards them no more. The priests are shown no honor; the elders find no favor.
17 ULB దొరకని సహాయం కోసం కనిపెట్టినా మా కళ్ళకు ఏదీ కనబడలేదు. రక్షించలేని ప్రజల కోసం మా కళ్ళు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాయి. BSB BSB: All the while our eyes were failing as we looked in vain for help. We watched from our towers for a nation that could not save us.
18 ULB మా వీధుల్లో మేము నడవకుండా మా విరోధులు మా జాడ పసిగట్టి మమ్మలి వెంటాడారు. మా చివరి దశ దగ్గర పడింది. మా రోజులు ముగిసిపోయాయి. మా అంతం వచ్చేసింది. BSB BSB: They stalked our every step, so that we could not walk in our streets. Our end drew near, our time ran out, for our end had come!
19 ULB మమ్మల్ని తరిమే వాళ్ళు ఆకాశంలో ఎగిరే గద్దలకన్నా వేగం గల వాళ్ళు. పర్వతాల్లోకి వాళ్ళు మమ్మల్ని తరిమారు. అరణ్యంలో మా కోసం కాచుకుని ఉన్నారు. BSB BSB: Those who chased us were swifter than the eagles in the sky; they pursued us over the mountains and ambushed us in the wilderness.
20 ULB మా నాసికారంధ్రాల ఊపిరి, యెహోవా చేత అభిషేకం పొందిన మా రాజు, వాళ్ళు తవ్విన గుంటల్లో పడి దొరికిపోయాడు. BSB BSB: The LORD’s anointed, the breath of our life, was captured in their pits. We had said of him, “Under his shadow we will live among the nations.”
21 ULB <<అతని నీడ కింద అన్యప్రజల మధ్య బతుకుదాం>> అని మేము ఎవరి గురించి అనుకున్నామో వాడు శత్రువుల చేజిక్కాడు. ఊజు దేశంలో నివాసం ఉన్న ఎదోము కుమారీ, సంతోషించు, ఉల్లాసంగా ఉండు. ఈ గిన్నెలోది తాగే వంతు నీకూ వస్తుంది. నువ్వు దానిలోది తాగి మత్తుగా ఉండి నిన్ను నువ్వు నగ్నంగా చేసుకుంటావు. BSB BSB: So rejoice and be glad, O Daughter of Edom, you who dwell in the land of Uz. Yet the cup will pass to you as well; you will get drunk and expose yourself.
22 ULB సీయోను కుమారీ, నీ శిక్ష ముగిసింది. ఇంక ఎన్నడూ ఆయన నిన్ను బందీగా చెరలోకి తీసుకు పోడు. ఎదోము కుమారీ, నీ పాపానికి ఆయన శిక్ష వేస్తాడు. నీ పాపాలను ఆయన బయట పెడతాడు. BSB BSB: O Daughter of Zion, your punishment is complete; He will not prolong your exile. But He will punish your iniquity, O Daughter of Edom; He will expose your sins.
Select verses for actions: Enter goes to them and Escape comes back.