1 ULB తండ్రి క్రమశిక్షణకు లోబడిన కుమారుడు వివేకం గలవాడు. బుద్ధి లేనివాడు దిద్దుబాటుకు తల వంచడు. BSB BSB: A wise son heeds his father’s discipline, but a mocker does not listen to rebuke.
2 ULB మనిషి తన నోటి నుంచి వచ్చే మాటల వలన ప్రతిఫలం పొందుతాడు. నమ్మకద్రోహులు తమ దుష్ట క్రియల చేత నాశనం తెచ్చుకుంటారు. BSB BSB: From the fruit of his lips a man enjoys good things, but the desire of the faithless is violence.
3 ULB తన నోటిని అదుపులో ఉంచుకున్నవాడు తనను కాపాడుకుంటాడు. వ్యర్థంగా మాట్లాడే వాడు నాశనం కొని తెచ్చుకుంటాడు. BSB BSB: He who guards his mouth protects his life, but the one who opens his lips invites his own ruin.
4 ULB సోమరిపోతు ఎక్కువగా ఆశ పడతాడు గానీ వాడికి ఏమీ మిగలదు. కష్టపడి పని చేసేవాడు సుఖంగా జీవిస్తాడు. BSB BSB: The slacker craves yet has nothing, but the soul of the diligent is fully satisfied.
5 ULB నీతిమంతులకు అబద్దాలంటే అసహ్యం. దుష్టుడు నిందలు మోపుతూ, అవమానపరుస్తూ ఉంటాడు. BSB BSB: The righteous hate falsehood, but the wicked bring shame and disgrace.
6 ULB నిజాయితీపరులకు వారి యథార్థ ప్రవర్తన కాపుదలగా ఉంటుంది. పాపులు తమ భక్తిహీనత వల్ల నాశనమౌతారు. BSB BSB: Righteousness guards the man of integrity, but wickedness undermines the sinner.
7 ULB తాము ధనవంతులమని చెప్పుకునే పేదలు ఉన్నారు. దరిద్రులమని చెప్పుకునే ధనవంతులు కూడా ఉన్నారు. BSB BSB: One pretends to be rich, but has nothing; another pretends to be poor, yet has great wealth.
8 ULB ఒకడి సంపద అతని ప్రాణాన్ని విడిపిస్తుంది. దరిద్రుడు హెచ్చరిక మాటలు లక్ష్యపెట్టడు. BSB BSB: Riches may ransom a man’s life, but a poor man hears no threat.
9 ULB నీతిమంతుల వెలుగు ప్రకాశిస్తుంది. భక్తిహీనుల దీపం ఆరిపోతుంది. BSB BSB: The light of the righteous shines brightly, but the lamp of the wicked is extinguished.
10 ULB గర్వాంధుడు కలహాలు రేపుతాడు. మంచి మాటలు ఆలకించే వారికి జ్ఞానం చేకూరుతుంది. BSB BSB: Arrogance leads only to strife, but wisdom is with the well-advised.
11 ULB మోసం చేసి సంపాదించిన సొత్తు తరిగి పోతుంది. కష్టపడి ధనం సంపాదించిన వాడు దాన్ని వృద్ధి పరుచుకుంటాడు. BSB BSB: Dishonest wealth will dwindle, but what is earned through hard work will be multiplied.
12 ULB కోరుకున్నది జరగకపోతే హృదయం క్షీణిస్తుంది. తీరిన కోరిక జీవవృక్షం వంటిది. BSB BSB: Hope deferred makes the heart sick, but desire fulfilled is a tree of life.
13 ULB హితబోధను తిరస్కరించేవాడు దాన్ని బట్టి శిక్షకు పాత్రుడౌతాడు. ఆజ్ఞల పట్ల భయభక్తులు చూపి వాటిని ఆచరించేవాడు తగిన ఫలం పొందుతాడు. BSB BSB: He who despises instruction will pay the penalty, but the one who respects a command will be rewarded.
14 ULB జ్ఞానుల ఉపదేశం జీవం కలిగించే ఊట. మనుషులు దాని మూలంగా మరణ బంధకాల నుండి తప్పించుకుంటారు. BSB BSB: The teaching of the wise is a fountain of life, turning one from the snares of death.
15 ULB మంచి బుద్ధి కలిగి ఉంటే దయాగుణం అలవడుతుంది. నమ్మకద్రోహుల మార్గం కష్టాల కడలి. BSB BSB: Good understanding wins favor, but the way of the faithless is difficult.
16 ULB వివేకం గలవారు తెలివిగా తమ పనులు జరిగిస్తారు. బుద్ధిహీనులు తమ మూర్ఖత్వాన్ని బయటపెట్టుకుంటారు. BSB BSB: Every prudent man acts with knowledge, but a fool displays his folly.
17 ULB దుర్మార్గుడైన ప్రతినిధి కష్టాల పాలవుతాడు. సమర్ధుడైన రాయబారి తన వారికి క్షేమం కలిగిస్తాడు. BSB BSB: A wicked messenger falls into trouble, but a faithful envoy brings healing.
18 ULB క్రమశిక్షణను లక్ష్యపెట్టని వాడికి అవమానం, దరిద్రం దాపురిస్తాయి. మందలింపును శిరసావహించేవాడు గౌరవం పొందుతాడు. BSB BSB: Poverty and shame come to him who ignores discipline, but whoever heeds correction is honored.
19 ULB కోరిక నెరవేరితే ప్రాణానికి ఊరట కలుగుతుంది. చెడుతనాన్ని విడిచి పెట్టడం మూర్ఖులకు ఏవగింపు. BSB BSB: Desire fulfilled is sweet to the soul, but turning from evil is detestable to fools.
20 ULB జ్ఞానులతో స్నేహం చేసే వారు జ్ఞానం సంపాదించుకుంటారు. మూర్ఖులతో స్నేహం చేసేవాడు నాశనమైపోతాడు. BSB BSB: He who walks with the wise will become wise, but the companion of fools will be destroyed.
21 ULB కీడు పాపులను వెంటాడుతుంది. నీతిమంతులకు ప్రతిఫలంగా మేలు కలుగుతుంది. BSB BSB: Disaster pursues sinners, but prosperity is the reward of the righteous.
22 ULB న్యాయవంతుడు తన మనుమలకు ఆస్తి సమకూరుస్తాడు. పాపాత్ముల సంపాదన నీతిమంతుల వశం అవుతుంది. BSB BSB: A good man leaves an inheritance to his children’s children, but the sinner’s wealth is passed to the righteous.
23 ULB పేదవాళ్ళు సేద్యం చేసిన భూమి విస్తారంగా పండుతుంది. అక్రమ క్రియలు జరిగించిన వాళ్ళు నాశనమైపోతారు. BSB BSB: Abundant food is in the fallow ground of the poor, but without justice it is swept away.
24 ULB బెత్తం వాడకుండా తన కుమారుణ్ణి క్రమశిక్షణలో పెట్టకుండా ఉన్న తండ్రి అతనికి శత్రువు వంటివాడు. ప్రేమించే తండ్రి తన కుమారుణ్ణి తప్పకుండా శిక్షిస్తాడు. BSB BSB: He who spares the rod hates his son, but he who loves him disciplines him diligently.
25 ULB ఉత్తముడు కడుపునిండా భోజనం చేస్తాడు. భక్తిహీనులు తినడానికి ఏమీ మిగలదు. BSB BSB: A righteous man eats to his heart’s content, but the stomach of the wicked is empty.
Select verses for actions: Enter goes to them and Escape comes back.