1 ULB ఎవరి మార్గాలు నిష్కల్మషంగా ఉంటాయో ఎవరు యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటారో వారు ధన్యులు. BSB BSB: Blessed are those whose way is blameless, who walk in the Law of the LORD.
2 ULB ఆయన పవిత్ర శాసనాలను పాటిస్తూ పూర్ణహృదయంతో ఆయన్ని వెదికేవారు ధన్యులు. BSB BSB: Blessed are those who keep His testimonies and seek Him with all their heart.
3 ULB వారు ఆయన బాటలో నడుస్తూ ఏ తప్పూ చేయరు. BSB BSB: They do no iniquity; they walk in His ways.
4 ULB మేము నీ ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించాలని, వాటికి కట్టుబడాలని నీవు మాకు ఆజ్ఞాపించావు. BSB BSB: You have ordained Your precepts, that we should keep them diligently.
5 ULB ఆహా, నేను నీ చట్టాల ప్రకారం ప్రవర్తించేలా నా ప్రవర్తన స్థిరం అయితే ఎంత మంచిది! BSB BSB: Oh, that my ways were committed to keeping Your statutes!
6 ULB నీ ఆజ్ఞలన్నిటినీ నేను శిరసావహిస్తే నాకు అవమానం కలగదు. BSB BSB: Then I would not be ashamed when I consider all Your commandments.
7 ULB నీ న్యాయచట్టాలను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. BSB BSB: I will praise You with an upright heart when I learn Your righteous judgments.
8 ULB నీ కట్టడలను నేను పాటిస్తాను. నన్ను ఒంటరిగా విడిచిపెట్టవద్దు. BSB BSB: I will keep Your statutes; do not utterly forsake me.
9 ULB యువత దేనిమూలంగా తమ మార్గం పవిత్రంగా ఉంచుకోగలరు? నీ వాక్కుకు లోబడడం మూలంగానే గదా? BSB BSB: How can a young man keep his way pure? By guarding it according to Your word.
10 ULB నా పూర్ణహృదయంతో నిన్ను వెదికాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి ఎటో వెళ్ళిపోనియ్యకు. BSB BSB: With all my heart I have sought You; do not let me stray from Your commandments.
11 ULB నీకు వ్యతిరేకంగా నేను పాపం చేయకుండేలా నా హృదయంలో నీ వాక్కును పదిలపరచుకున్నాను. BSB BSB: I have hidden Your word in my heart that I might not sin against You.
12 ULB యెహోవా, నీవే ఆరాధ్య దైవం. నీ నియమాలను నాకు బోధించు. BSB BSB: Blessed are You, O LORD; teach me Your statutes.
13 ULB నీవు వెల్లడి చేసిన న్యాయవిధులన్నిటినీ నా నోటితో వివరిస్తాను. BSB BSB: With my lips I proclaim all the judgments of Your mouth.
14 ULB సంపదలన్నిటి కంటే పైగా నీ నిబంధన శాసనాల దారిని బట్టి నేను ఉప్పొంగిపోతున్నాను. BSB BSB: I rejoice in the way of Your testimonies as much as in all riches.
15 ULB నీ ఆజ్ఞలను నేను ధ్యానిస్తాను. నీ మార్గాలపై మనస్సు ఉంచుతాను. BSB BSB: I will meditate on Your precepts and regard Your ways.
16 ULB నీ కట్టడలను బట్టి నేను హర్షిస్తాను. నీ వాక్కును విస్మరించను. BSB BSB: I will delight in Your statutes; I will not forget Your word.
17 ULB నీ సేవకుణ్ణి దయ చూడు. అప్పుడు నేను సజీవంగా ఉండి నీ వాక్కు పాటిస్తాను. BSB BSB: Deal bountifully with Your servant, that I may live and keep Your word.
18 ULB నేను నీ ధర్మశాస్త్రంలోని అద్భుతమైన విషయాలు చూడగలిగేలా నా కళ్ళు తెరువు. BSB BSB: Open my eyes that I may see wondrous things from Your law.
19 ULB నేను భూమి మీద పరదేశిని. నీ ఆజ్ఞలను నాకు కనిపించకుండా దాచకు. BSB BSB: I am a stranger on the earth; do not hide Your commandments from me.
20 ULB అస్తమానం నీ న్యాయవిధులను తెలుసుకోవాలనే ఆశతో నా ప్రాణం నీరసించిపోతోంది. BSB BSB: My soul is consumed with longing for Your judgments at all times.
21 ULB గర్విష్ఠులను నువ్వు గద్దిస్తున్నావు. వారు నీ ఆజ్ఞలను విడిచి తిరుగులాడే శాపగ్రస్తులు. BSB BSB: You rebuke the arrogant—the cursed who stray from Your commandments.
22 ULB నేను నీ నిబంధన శాసనాలకు లోబడిన వాణ్ణి. నన్ను అప్రదిష్ట, అవమానాల పాలు చెయ్య వద్దు. BSB BSB: Remove my scorn and contempt, for I have kept Your testimonies.
23 ULB పాలకులు నాకు విరోధంగా కుట్ర పన్ని అపనిందలు వేసినా నీ సేవకుడు మాత్రం నీ కట్టడలను ధ్యానిస్తూనే ఉంటాడు. BSB BSB: Though rulers sit and slander me, Your servant meditates on Your statutes.
24 ULB నీ శాసనాలు నాకు సంతోషదాయకం. అవి నాకు ఆలోచనకర్తలు. BSB BSB: Your testimonies are indeed my delight; they are my counselors.
25 ULB నా ప్రాణం మట్టి కరిచింది. నీ వాక్కుతో నన్ను బతికించు. BSB BSB: My soul cleaves to the dust; revive me according to Your word.
26 ULB నా ప్రవర్తనంతా నీకు చెప్పుకున్నాను. నాకు జవాబిచ్చావు. నీ కట్టడలను నాకు బోధించు. BSB BSB: I recounted my ways, and You answered me; teach me Your statutes.
27 ULB నీ ఉపదేశమార్గం నాకు బోధపరచు. అప్పుడు నీ దివ్యోపదేశాన్ని నేను నెమరు వేసుకుంటాను. BSB BSB: Make clear to me the way of Your precepts; then I will meditate on Your wonders.
28 ULB విషాదంతో నా ప్రాణం కరిగి నీరైపోతోంది. నీ వాక్కుతో నన్ను లేపి నిలబెట్టు. BSB BSB: My soul melts with sorrow; strengthen me according to Your word.
29 ULB మోసపు మార్గం నా నుండి దూరం చెయ్యి. దయచేసి నాకు నీ ఉపదేశం వినిపించు. BSB BSB: Remove me from the path of deceit and graciously grant me Your law.
30 ULB విశ్వసనీయత మార్గం ఎంచుకున్నాను. నీ న్యాయవిధులను నేను ఎప్పుడూ నా ఎదుట పెట్టుకుని ఉన్నాను. BSB BSB: I have chosen the way of truth; I have set Your ordinances before me.
31 ULB యెహోవా, నేను నీ శాసనాలను అంటి పెట్టుకుని ఉన్నాను. నన్ను సిగ్గుపాలు చెయ్యవద్దు. BSB BSB: I cling to Your testimonies, O LORD; let me not be put to shame.
32 ULB నా హృదయాన్ని నీవు విశాలం చేస్తే నేను నీ ఆజ్ఞల మార్గంలో పరిగెత్తుతాను. BSB BSB: I run in the path of Your commandments, for You will enlarge my heart.
33 ULB యెహోవా, నీ శాసనాలను అనుసరించడం నాకు నేర్పు. అప్పుడు నేను కడదాకా వాటిని పాటిస్తాను. BSB BSB: Teach me, O LORD, the way of Your statutes, and I will keep them to the end.
34 ULB నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి నాకు అవగాహన దయచెయ్యి. అప్పుడు నా పూర్ణహృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుంటాను. BSB BSB: Give me understanding that I may obey Your law, and follow it with all my heart.
35 ULB నీ ఆజ్ఞల జాడల్లో నన్ను నడిపించు. వాటి ప్రకారం నడుచుకోవడం నాకెంతో ఆనందం. BSB BSB: Direct me in the path of Your commandments, for there I find delight.
36 ULB నా హృదయాన్ని నీ శాసనాలవైపు తిప్పు. అక్రమ లాభం నుండి నన్ను విముఖుణ్ణి చెయ్యి. BSB BSB: Turn my heart to Your testimonies and not to covetous gain.
37 ULB పనికిమాలిన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పివెయ్యి. నీ మార్గాల్లో నాకు ఊపిరి పొయ్యి. BSB BSB: Turn my eyes away from worthless things; revive me with Your word.
38 ULB నిన్ను కొలిచే వారికి నీవిచ్చిన వాగ్దానం నీ సేవకుని పట్ల నెరవేర్చు. BSB BSB: Establish Your word to Your servant, to produce reverence for You.
39 ULB నీ న్యాయవిధులు మంచివి. నాకు భయం గొలుపుతున్న నా అవమానాన్ని తీసివెయ్యి. BSB BSB: Turn away the disgrace I dread, for Your judgments are good.
40 ULB నీ ఉపదేశాల కోసం తహతహలాడుతున్నాను. న్యాయమైన నీ విమోచన మూలంగా నన్ను సజీవంగా ఉంచు. BSB BSB: How I long for Your precepts! Revive me in Your righteousness.
41 ULB యెహోవా, విఫలం కాని నీ ప్రేమను నాకు అనుగ్రహించు. నీ వాగ్దానం చొప్పున నీ రక్షణ కలిగించు. BSB BSB: May Your loving devotion come to me, O LORD, Your salvation, according to Your promise.
42 ULB అప్పుడు నన్ను హేళన చేసే వారికి నేను జవాబు చెప్పగలుగుతాను. ఎందుకంటే నీ మాటపై నమ్మకం ఉంచాను. BSB BSB: Then I can answer him who taunts, for I trust in Your word.
43 ULB నా నోటినుండి సత్య వాక్కును ఏమాత్రం తీసి వేయకు. ఎందుకంటే నేను నీ న్యాయవిధుల మీద నా ఆశ పెట్టుకున్నాను. BSB BSB: Never take Your word of truth from my mouth, for I hope in Your judgments.
44 ULB ఎడతెగక నిరంతరం నీ ధర్మశాస్త్రం అనుసరిస్తాను. BSB BSB: I will always obey Your law, forever and ever.
45 ULB నేను నీ ఉపదేశాలను వెదికే వాణ్ణి గనక భద్రంగా నడుస్తాను. BSB BSB: And I will walk in freedom, for I have sought Your precepts.
46 ULB సిగ్గుపడక రాజుల ఎదుట నీ పవిత్ర శాసనాలను గూర్చి నేను మాట్లాడతాను. BSB BSB: I will speak of Your testimonies before kings, and I will not be ashamed.
47 ULB నీ ఆజ్ఞల్లో నేను హర్షిస్తాను. అవి నాకు అతి ప్రియం. BSB BSB: I delight in Your commandments because I love them.
48 ULB నాకు ఎంతో ఇష్టమైన నీ ఆజ్ఞలవైపు నా చేతులెత్తుతాను. నీ కట్టడలను నేను ధ్యానిస్తాను. BSB BSB: I lift up my hands to Your commandments, which I love, and I meditate on Your statutes.
49 ULB నీ సేవకుడికి నీవు దయచేసిన మాట జ్ఞాపకం చేసుకో. దానివలన నీవు నాలో ఆశాభావం రేకెత్తించావు. BSB BSB: Remember Your word to Your servant, upon which You have given me hope.
50 ULB నీ వాక్కు నన్ను బ్రతికించింది. నా బాధలో ఇదే నాకు ఉపశమనం కలిగిస్తున్నది. BSB BSB: This is my comfort in affliction, that Your promise has given me life.
51 ULB గర్విష్ఠులు నన్ను ఇష్టం వచ్చినట్టు ఎగతాళి చేశారు. అయినా నీ ధర్మశాస్త్రాన్నుండి నేను తొలగలేదు. BSB BSB: The arrogant utterly deride me, but I do not turn from Your law.
52 ULB యెహోవా, పూర్వకాలంనుండి ఉన్న నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొందాను. BSB BSB: I remember Your judgments of old, O LORD, and in them I find comfort.
53 ULB నీ ధర్మశాస్త్రాన్ని విడిచి నడుస్తున్న భక్తిహీనులను చూస్తే నాకు పట్టరాని కోపం పుడుతున్నది. BSB BSB: Rage has taken hold of me because of the wicked who reject Your law.
54 ULB యాత్రికుడినైన నా బసలో నీ శాసనాలే నా పాటలు. BSB BSB: Your statutes are songs to me in the house of my pilgrimage.
55 ULB యెహోవా, రాత్రివేళ నీ నామాన్ని స్మరణ చేస్తున్నాను నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటున్నాను. BSB BSB: In the night, O LORD, I remember Your name, that I may keep Your law.
56 ULB నీ ఉపదేశం అనుసరించి నడుచుకుంటున్నాను. ఇదే నాకు వరంగా అనుగ్రహించావు. BSB BSB: This is my practice, for I obey Your precepts.
57 ULB యెహోవా, నీవే నా భాగం. నీ వాక్కులననుసరించి నడుచుకుంటానని నేను నిశ్చయించుకున్నాను. BSB BSB: The LORD is my portion; I have promised to keep Your words.
58 ULB కటాక్షం చూపమని నా పూర్ణహృదయంతో నిన్ను బతిమాలుకుంటున్నాను. నీవిచ్చిన మాట ప్రకారం నన్ను కరుణించు. BSB BSB: I have sought Your face with all my heart; be gracious to me according to Your promise.
59 ULB నా మార్గాలు నేను పరిశీలన చేశాను. నీ శాసనాలవైపు నా ముఖం తిప్పుకున్నాను. BSB BSB: I considered my ways and turned my steps to Your testimonies.
60 ULB నీ ఆజ్ఞలను పాటించడానికి నేను జాగుచేయక వేగిరపడ్డాను. BSB BSB: I hurried without hesitating to keep Your commandments.
61 ULB భక్తిహీనుల పాశాలు నన్ను చుట్టుకుని ఉన్నా నీ ధర్మశాస్త్రాన్ని నేను విస్మరించ లేదు. BSB BSB: Though the ropes of the wicked bind me, I do not forget Your law.
62 ULB న్యాయమైన నీ విధులనుబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అర్థరాత్రివేళ నేను నిద్ర లేస్తున్నాను. BSB BSB: At midnight I rise to give You thanks for Your righteous judgments.
63 ULB నీపట్ల భయభక్తులు గలవారందరికీ, నీ ఉపదేశాలను అనుసరించే వారికీ నేను నెచ్చెలిని. BSB BSB: I am a friend to all who fear You, and to those who keep Your precepts.
64 ULB యెహోవా, భూమి నీ నిబంధన విశ్వాస్యతతో నిండి ఉంది. నీ కట్టడలను నాకు బోధించు. BSB BSB: The earth is filled with Your loving devotion, O LORD; teach me Your statutes.
65 ULB యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకుడికి మేలు చేశావు. BSB BSB: You are good to Your servant, O LORD, according to Your word.
66 ULB నేను నీ ఆజ్ఞలపై నమ్మిక ఉంచాను. మంచి వివేచన, మంచి జ్ఞానం నాకు నేర్చు. BSB BSB: Teach me good judgment and knowledge, for I believe in Your commandments.
67 ULB బాధ కలగక మునుపు నేను దారి విడిచాను. ఇప్పుడు నీ వాక్కు ననుసరించి నడుచుకుంటున్నాను. BSB BSB: Before I was afflicted, I went astray; but now I keep Your word.
68 ULB నీవు దయాళుడివై మేలు చేస్తున్నావు. నీ కట్టడలను నాకు బోధించు. BSB BSB: You are good, and You do what is good; teach me Your statutes.
69 ULB గర్విష్ఠులు నా మీద అబద్ధాలు అల్లుతున్నారు. అయితే పూర్ణహృదయంతో నేను నీ ఉపదేశాలను అనుసరిస్తాను. BSB BSB: Though the arrogant have smeared me with lies, I keep Your precepts with all my heart.
70 ULB వారి హృదయం కొవ్వెక్కి బండబారిపోయింది. నేను నీ ధర్మశాస్త్రాన్నిబట్టి ఆనందిస్తున్నాను. BSB BSB: Their hearts are callous and insensitive, but I delight in Your law.
71 ULB బాధల పాలు కావడం నాకు మంచిదయింది. ఎందుకంటే వాటి మూలంగా నేను నీ కట్టడలను నేర్చుకున్నాను. BSB BSB: It was good for me to be afflicted, that I might learn Your statutes.
72 ULB వేవేల వెండి బంగారు నాణాలకంటే నీ విచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. BSB BSB: The law from Your mouth is more precious to me than thousands of pieces of gold and silver.
73 ULB నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపం ఏర్పరచాయి. నేను నీ ఆజ్ఞలను నేర్చుకునేలా నాకు బుద్ధి దయ చెయ్యి. BSB BSB: Your hands have made me and fashioned me; give me understanding to learn Your commandments.
74 ULB నీ వాక్కు మీద నేను ఆశపెట్టుకున్నాను. నీపట్ల భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషిస్తారు. BSB BSB: May those who fear You see me and rejoice, for I have hoped in Your word.
75 ULB యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనీ నీవు నన్ను బాధపరచింది నీ నమ్మకత్వం వల్లనే అనీ నాకు తెలుసు. BSB BSB: I know, O LORD, that Your judgments are righteous, and that in faithfulness You have afflicted me.
76 ULB నీ సేవకుడికి నీవిచ్చిన మాట చొప్పున నీ నిబంధన విశ్వాస్యత నన్ను ఆదరించు గాక. BSB BSB: May Your loving devotion comfort me, I pray, according to Your promise to Your servant.
77 ULB నీ ధర్మశాస్త్రం నాకు సంతోషదాయకం. నేను బ్రతికేలా నీ కరుణాకటాక్షాలు నాకు కలుగు గాక. BSB BSB: May Your compassion come to me, that I may live, for Your law is my delight.
78 ULB నేను నీ ఉపదేశాలను ధ్యానిస్తున్నాను. గర్విష్ఠులు నామీద అబద్ధాలాడినందుకు వారు సిగ్గుపడతారు గాక. BSB BSB: May the arrogant be put to shame for subverting me with a lie; I will meditate on Your precepts.
79 ULB నీపట్ల భయభక్తులుగలవారూ నీ శాసనాలను తెలుసుకునే వారూ నా పక్షంగా ఉంటారు గాక. BSB BSB: May those who fear You turn to me, those who know Your testimonies.
80 ULB నేను సిగ్గుపడకుండేలా నా హృదయం నీ కట్టడల విషయమై నిర్దోషంగా ఉండు గాక. BSB BSB: May my heart be blameless in Your statutes, that I may not be put to shame.
81 ULB నీ రక్షణ కోసం నా ప్రాణం సొమ్మసిల్లిపోతున్నది. నేను నీ వాక్కు మీద ఆశపెట్టుకున్నాను. BSB BSB: My soul faints for Your salvation; I wait for Your word.
82 ULB నన్ను ఎప్పుడు ఆదరిస్తావా అని నా కళ్ళు నీవిచ్చిన మాట కోసం కనిపెట్టి క్షీణించిపోతున్నాయి. BSB BSB: My eyes fail, looking for Your promise; I ask, “When will You comfort me?”
83 ULB నేను పొగ పట్టిన ద్రాక్ష తిత్తిలాగా అయిపోయాను. అయినా నీ కట్టడలను నేను మరచిపోవడం లేదు. BSB BSB: Though I am like a wineskin dried up by smoke, I do not forget Your statutes.
84 ULB నీ సేవకుడి దినాలు ఎంత తగ్గిపోయాయి! నన్ను తరిమే వారికి నీవు తీర్పు తీర్చడం ఎప్పుడు? BSB BSB: How many days must Your servant wait? When will You execute judgment on my persecutors?
85 ULB నీ ధర్మశాస్త్రాన్ని లెక్క చెయ్యని గర్విష్ఠులు నన్ను చిక్కించుకోడానికి గుంటలు త్రవ్వారు. BSB BSB: The arrogant have dug pits for me in violation of Your law.
86 ULB నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారు అకారణంగా నన్ను తరుముతున్నారు. నాకు సహాయం చెయ్యి. BSB BSB: All Your commandments are faithful; I am persecuted without cause—help me!
87 ULB భూమి మీద ఉండకుండా వారు నన్ను దాదాపుగా నాశనం చేసేశారు. అయితే నీ ఉపదేశాలను నేను విడిచిపెట్టడం లేదు. BSB BSB: They almost wiped me from the earth, but I have not forsaken Your precepts.
88 ULB నీవు నియమించిన శాసనాన్ని నేను అనుసరించేలా నీ నిబంధన విశ్వాస్యత చేత నన్ను బ్రతికించు. BSB BSB: Revive me according to Your loving devotion, that I may obey the testimony of Your mouth.
89 ULB యెహోవా, నీ వాక్కు శాశ్వతం. అది పరలోకంలో సుస్థిరంగా ఉంది. BSB BSB: Your word, O LORD, is everlasting; it is firmly fixed in the heavens.
90 ULB నీ విశ్వాస్యత తరతరాలు ఉంటుంది. నీవు భూమిని స్థాపించావు. అది స్థిరంగా ఉంది. BSB BSB: Your faithfulness continues through all generations; You established the earth, and it endures.
91 ULB అన్నీ నీ న్యాయ నిర్ణయం చొప్పున నేటికీ స్థిరంగా ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ నీకు ఊడిగం చేస్తున్నాయి. BSB BSB: Your ordinances stand to this day, for all things are servants to You.
92 ULB నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమియ్యక పొతే నా బాధలో నేను సమసిపోయేవాణ్ణి. BSB BSB: If Your law had not been my delight, then I would have perished in my affliction.
93 ULB నీ ఉపదేశాలను ఎన్నటికీ మరచిపోను. ఎందుకంటే వాటి వల్లనే నీవు నన్ను ప్రాణాలతో ఉంచావు. BSB BSB: I will never forget Your precepts, for by them You have revived me.
94 ULB నీ ఉపదేశాలను నేను వెతుకుతున్నాను. నేను నీవాణ్ణి. నన్ను రక్షించు. BSB BSB: I am Yours; save me, for I have sought Your precepts.
95 ULB నన్ను సంహరించాలని భక్తిహీనులు నా కోసం పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనాలను తలపోసుకుంటున్నాను. BSB BSB: The wicked wait to destroy me, but I will ponder Your testimonies.
96 ULB సంపూర్ణతకైనా పరిమితి ఉందని నాకు తెలుసు. కానీ నీ ధర్మోపదేశానికి ఎల్లలు లేవు. BSB BSB: I have seen a limit to all perfection, but Your commandment is without limit.
97 ULB నీ ధర్మశాస్త్రం నాకెంతో ఇష్టంగా ఉంది. రోజంతా నేను దాన్ని ధ్యానిస్తున్నాను. BSB BSB: Oh, how I love Your law! All day long it is my meditation.
98 ULB నీ ఆజ్ఞలు అనునిత్యం నాకు తోడుగా ఉన్నాయి. నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలగజేస్తున్నాయి. BSB BSB: Your commandments make me wiser than my enemies, for they are always with me.
99 ULB నీ శాసనాలను నేను ధ్యానిస్తున్నాను కాబట్టి నా బోధకులందరికంటే నాకు ఎక్కువ అవగాహన ఉంది. BSB BSB: I have more insight than all my teachers, for Your testimonies are my meditation.
100 ULB నీ ఉపదేశాలను నేను లక్ష్యపెడుతున్నాను గనక వయోవృద్ధుల కంటే నాకు విశేషజ్ఞానం ఉంది. BSB BSB: I discern more than the elders, for I obey Your precepts.
101 ULB నేను నీ వాక్కుననుసరించేలా దుష్టమార్గాలన్నిటిలోనుండి నా పాదాలు తొలగించుకుంటున్నాను. BSB BSB: I have kept my feet from every evil path, that I may keep Your word.
102 ULB నీవు నాకు బోధించావు గనక నీ న్యాయవిధులనుండి నేను తొలగక నిలిచాను. BSB BSB: I have not departed from Your ordinances, for You Yourself have taught me.
103 ULB నీ వాక్కులు నా జిహ్వకు ఎంతో మధురం. అవి నా నోటికి తేనెకంటే తియ్యగా ఉన్నాయి. BSB BSB: How sweet are Your words to my taste—sweeter than honey in my mouth!
104 ULB నీ ఉపదేశం మూలంగా నాకు వివేకం కలిగింది. తప్పుమార్గాలన్నీ నాకు అసహ్యమనిపించాయి. BSB BSB: I gain understanding from Your precepts; therefore I hate every false way.
105 ULB నీ వాక్కు నా పాదాలకు దీపం, నా దారిలో వెలుగు. BSB BSB: Your word is a lamp to my feet and a light to my path.
106 ULB నీ న్యాయవిధులను అనుసరిస్తానని నేను మాట ఇచ్చాను. దాన్ని నిలబెట్టుకుంటాను. BSB BSB: I have sworn and confirmed that I will keep Your righteous judgments.
107 ULB యెహోవా, నేను తీవ్ర బాధ అనుభవిస్తున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికించు. BSB BSB: I am severely afflicted, O LORD; revive me through Your word.
108 ULB యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించు. నీ న్యాయవిధులను నాకు బోధించు BSB BSB: Accept the freewill offerings of my mouth, O LORD, and teach me Your judgments.
109 ULB నా ప్రాణం ఎప్పుడూ అపాయంలో ఉంది. అయినా నీ ధర్మశాస్త్రాన్ని నేను మరిచిపోను. BSB BSB: I constantly take my life in my hands, yet I do not forget Your law.
110 ULB నన్ను పట్టుకోడానికి భక్తిహీనులు ఉచ్చులు పన్నారు. అయినా నీ ఉపదేశాలనుండి నేను తొలగిపోవడం లేదు. BSB BSB: The wicked have set a snare for me, but I have not strayed from Your precepts.
111 ULB నీ శాసనాలు నాకు ఆహ్లాదకరం. అవి నాకు నిత్య వారసత్వం అని ఎంచుకుంటున్నాను. BSB BSB: Your testimonies are my heritage forever, for they are the joy of my heart.
112 ULB నీ కట్టడలను పాటించడానికి నా హృదయాన్ని నేను లోబరిచాను. ఇది తుదివరకూ నిలిచే నిత్యనిర్ణయం. BSB BSB: I have inclined my heart to perform Your statutes, even to the very end.
113 ULB రెండు ఆలోచనల మధ్య ఊగిసలాడే వారంటే నాకు అసహ్యం. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం. BSB BSB: The double-minded I despise, but Your law I love.
114 ULB నా ఆశ్రయ స్థానం, నా డాలు నువ్వే. నీ వాక్కుపై నేను ఆశపెట్టుకున్నాను. BSB BSB: You are my hiding place and my shield; I put my hope in Your word.
115 ULB నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తాను. దుర్మార్గం జరిగించే వారంతా నా నుండి తొలిగిపొండి. BSB BSB: Depart from me, you evildoers, that I may obey the commandments of my God.
116 ULB నేను బ్రతికేలా నీ మాట చొప్పున నన్ను ఆదుకో. నా ఆశ భంగమై నేను సిగ్గుపడకుండా ఉంటాను గాక. BSB BSB: Sustain me as You promised, that I may live; let me not be ashamed of my hope.
117 ULB నాకు రక్షణ కలిగేలా నీవు నన్ను ఉద్ధరించు. అప్పుడు నీ కట్టడలను నిత్యం లక్ష్యపెడతాను. BSB BSB: Uphold me, and I will be saved, that I may always regard Your statutes.
118 ULB నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు త్రోసిపుచ్చుతావు. అలాటి వారంతా దగాకోరులే, నమ్మలేని వారే. BSB BSB: You reject all who stray from Your statutes, for their deceitfulness is in vain.
119 ULB భూమిమీదనున్న భక్తిహీనులనందరినీ నీవు తెట్టువలె నాశనం చేస్తావు. కాబట్టి నీ శాసనాలు నాకు ఇష్టం. BSB BSB: All the wicked on earth You discard like dross; therefore I love Your testimonies.
120 ULB నీ భయం వలన నా శరీరం వణికిపోతోంది. నీ న్యాయవిధులకు నేను భయపడుతున్నాను. BSB BSB: My flesh trembles in awe of You; I stand in fear of Your judgments.
121 ULB నేను నీతిన్యాయాలను అనుసరిస్తున్నాను. నన్ను బాధించేవారి వశంలో నన్ను విడిచిపెట్టవద్దు. BSB BSB: I have done what is just and right; do not leave me to my oppressors.
122 ULB మేలు కోసం నీ సేవకుడికి హామీ ఉండు. గర్విష్ఠులు నన్ను బాధించకుందురు గాక. BSB BSB: Ensure Your servant’s well-being; do not let the arrogant oppress me.
123 ULB నీ రక్షణ కోసం నీతి గల నీ మాట కోసం ఎదురు చూస్తూ నా కళ్ళు క్షీణించి పోతున్నాయి. BSB BSB: My eyes fail, looking for Your salvation, and for Your righteous promise.
124 ULB నీ కృప చొప్పున నీ సేవకుడికి మేలు చెయ్యి. నీ కట్టడలను నాకు బోధించు. BSB BSB: Deal with Your servant according to Your loving devotion, and teach me Your statutes.
125 ULB నేను నీ సేవకుణ్ణి. నీ శాసనాలను గ్రహించేలా నాకు జ్ఞానం కలగజెయ్యి BSB BSB: I am Your servant; give me understanding, that I may know Your testimonies.
126 ULB ప్రజలు నీ ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేశారు. యెహోవా తన పని చెయ్యడానికి ఇదే సమయం. BSB BSB: It is time for the LORD to act, for they have broken Your law.
127 ULB బంగారం కంటే మేలిమి బంగారం కంటే నీ ఆజ్ఞలు నాకు ఇష్టంగా ఉన్నాయి. BSB BSB: Therefore I love Your commandments more than gold, even the purest gold.
128 ULB నీ ఉపదేశాలన్నీ యథార్థమని నేను వాటిని శిరసావహిస్తున్నాను. అబద్ధ మార్గాలన్నీ నాకు అసహ్యం. BSB BSB: Therefore I admire all Your precepts and hate every false way.
129 ULB నీ శాసనాలు ఆశ్చర్యకరమైనవి. అందుకే నేను వాటిని పాటిస్తున్నాను. BSB BSB: Wonderful are Your testimonies; therefore I obey them.
130 ULB నీ వాక్కులు వెల్లడి కావడంతోనే వెలుగు ఉదయిస్తుంది. అవి తెలివిలేని వారికి తెలివినిస్తాయి. BSB BSB: The unfolding of Your words gives light; it informs the simple.
131 ULB నీ ఆజ్ఞలపట్ల తీవ్ర వాంఛ చేత నేను నోరు తెరచి వగరుస్తూ ఉన్నాను. BSB BSB: I open my mouth and pant, longing for Your commandments.
132 ULB నీ నామాన్ని ప్రేమించేవారికి నీవు చేసే విధంగా నావైపు తిరిగి నన్ను కరుణించు. BSB BSB: Turn to me and show me mercy, as You do to those who love Your name.
133 ULB నీ వాక్కునుబట్టి నా అడుగులు స్థిరపరచు. ఏ పాపం నన్ను ఏలనియ్యకు. BSB BSB: Order my steps in Your word; let no sin rule over me.
134 ULB నీ ఉపదేశాలను నేను అనుసరించేలా మనుష్యుల బలాత్కారం నుండి నన్ను విడిపించు. BSB BSB: Redeem me from the oppression of man, that I may keep Your precepts.
135 ULB నీ సేవకుడి పై నీ ముఖకాంతి ప్రకాశింపనియ్యి. నీ కట్టడలను నాకు బోధించు. BSB BSB: Make Your face shine upon Your servant, and teach me Your statutes.
136 ULB ప్రజలు నీ ధర్మశాస్త్రం అనుసరించక పోవడం చూసి నేను కన్నీరుమున్నీరైపోతున్నాను. BSB BSB: My eyes shed streams of tears because Your law is not obeyed.
137 ULB యెహోవా, నీవు నీతిమంతుడివి. నీ న్యాయవిధులు యథార్థం. BSB BSB: Righteous are You, O LORD, and upright are Your judgments.
138 ULB నీతినిబట్టి, పూర్ణ విశ్వాస్యతనుబట్టి, నీ శాసనాలను నీవు నియమించావు. BSB BSB: The testimonies You have laid down are righteous and altogether faithful.
139 ULB నా విరోధులు నీ వాక్కులు మరచిపోతారు. అందువలన నా ఆసక్తి నన్ను తినేస్తున్నది. BSB BSB: My zeal has consumed me because my foes forget Your words.
140 ULB నీ మాట ఎంతో స్వచ్ఛమైనది. అది నీ సేవకుడికి ప్రియమైనది. BSB BSB: Your promise is completely pure; therefore Your servant loves it.
141 ULB నేను అల్పుణ్ణి. నిరాకరణకు గురి అయిన వాణ్ణి. అయినా నీ ఉపదేశాలను నేను మరువను. BSB BSB: I am lowly and despised, but I do not forget Your precepts.
142 ULB నీ నీతి శాశ్వతం. నీ ధర్మశాస్త్రం కేవలం సత్యం. BSB BSB: Your righteousness is everlasting and Your law is true.
143 ULB బాధ, వేదన నన్ను పట్టుకున్నాయి. అయినా నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. BSB BSB: Trouble and distress have found me, but Your commandments are my delight.
144 ULB నీ శాసనాలు శాశ్వత నీతిగలవి. నేను బ్రతికేలా నాకు తెలివి దయచెయ్యి. BSB BSB: Your testimonies are righteous forever. Give me understanding, that I may live.
145 ULB యెహోవా, హృదయపూర్వకంగా నేను మొర్ర పెడుతున్నాను. నీ కట్టడలను నేను పాటించేలా నాకు జవాబు ఇవ్వు. BSB BSB: I call with all my heart; answer me, O LORD! I will obey Your statutes.
146 ULB నేను నీకు మొర్ర పెడుతున్నాను. నీ శాసనాల ప్రకారం నేను నడుచుకునేలా నన్ను రక్షించు. BSB BSB: I call to You; save me, that I may keep Your testimonies.
147 ULB తెల్లవారకమునుపే మొర్రపెట్టాను. నీ మాటలపై నేను ఆశపెట్టుకున్నాను BSB BSB: I rise before dawn and cry for help; in Your word I have put my hope.
148 ULB నీవిచ్చిన వాక్కును నేను ధ్యానించడానికి నాకళ్ళు రాత్రిజాములు గడవక ముందే తెరుస్తాను. BSB BSB: My eyes anticipate the watches of night, that I may meditate on Your word.
149 ULB నీ కృపను బట్టి నా మొర్ర ఆలకించు. యెహోవా, నీ వాక్యవిధులనుబట్టి నన్ను బ్రతికించు. BSB BSB: Hear my voice, O LORD, according to Your loving devotion; give me life according to Your justice.
150 ULB దుష్కార్యాలు చేసే వారు, నీ ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవారు నన్ను సమీపిస్తున్నారు. BSB BSB: Those who follow after wickedness draw near; they are far from Your law.
151 ULB యెహోవా, నీవు దగ్గరగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. BSB BSB: You are near, O LORD, and all Your commandments are true.
152 ULB నీ శాసనాలను నీవు శాశ్వతంగా స్థిరపరిచావు అని నేను పూర్వం నుండి వాటిమూలంగానే తెలుసుకున్నాను. BSB BSB: Long ago I learned from Your testimonies that You have established them forever.
153 ULB నేను నీ ధర్మశాస్త్రాన్ని మరిచిపోయేవాణ్ణి కాదు. నా బాధను గమనించి నన్ను విడిపించు. BSB BSB: Look upon my affliction and rescue me, for I have not forgotten Your law.
154 ULB నా పక్షంగా వ్యాజ్యెమాడి నన్ను విమోచించు. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించు. BSB BSB: Defend my cause and redeem me; revive me according to Your word.
155 ULB భక్తిహీనులు నీ కట్టడలను వెదకడం లేదు గనక రక్షణ వారికి దూరంగా ఉంది. BSB BSB: Salvation is far from the wicked because they do not seek Your statutes.
156 ULB యెహోవా, నీ దయాదాక్షిణ్యాలు మితిలేనివి. నీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికించు. BSB BSB: Great are Your mercies, O LORD; revive me according to Your ordinances.
157 ULB నన్ను తరిమేవారు, నా విరోధులు చాలా మంది. అయినా నీ న్యాయశాసనాలనుండి నేను తొలగకుండా ఉన్నాను. BSB BSB: Though my persecutors and foes are many, I have not turned from Your testimonies.
158 ULB ద్రోహులను చూసి నేను అసహ్యించుకున్నాను. నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు. BSB BSB: I look on the faithless with loathing because they do not keep Your word.
159 ULB యెహోవా, చిత్తగించు. నీ ఉపదేశాలు నాకెంతో ప్రీతికరం. నీ కృపచొప్పున నన్ను బ్రతికించు. BSB BSB: Consider how I love Your precepts, O LORD; give me life according to Your loving devotion.
160 ULB నీ వాక్య సారాంశం సత్యం. నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యం నిలిచే ఉంటాయి. BSB BSB: The entirety of Your word is truth, and all Your righteous judgments endure forever.
161 ULB అధికారులు వట్టి పుణ్యానికి నన్ను తరుముతారు. అయినా నీ వాక్యభయం నా హృదయంలో నిలిచి ఉంది. BSB BSB: Rulers persecute me without cause, but my heart fears only Your word.
162 ULB పుష్కలంగా దోపుడుసొమ్ము సంపాదించిన వాడిలాగా నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను. BSB BSB: I rejoice in Your promise like one who finds great spoil.
163 ULB అబద్ధం నాకు అసహ్యం. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం. BSB BSB: I hate and abhor falsehood, but Your law I love.
164 ULB నీ న్యాయవిధులనుబట్టి రోజుకు ఏడు సార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను. BSB BSB: Seven times a day I praise You for Your righteous judgments.
165 ULB నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారికి ఎంతో నెమ్మది ఉంది. వారు తూలి తొట్రిల్లే కారణం ఏమీ లేదు BSB BSB: Abundant peace belongs to those who love Your law; nothing can make them stumble.
166 ULB యెహోవా, నీ రక్షణ కోసం నేను కనిపెడుతున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నాను. BSB BSB: I wait for Your salvation, O LORD, and I carry out Your commandments.
167 ULB నేను నీ శాసనాలనుబట్టి ప్రవర్తిస్తున్నాను. అవి నాకు ఎంతో ఇష్టం. BSB BSB: I obey Your testimonies and love them greatly.
168 ULB నా మార్గాలన్నీ నీ ఎదురుగా ఉన్నాయి. నీ ఉపదేశాలను నీ శాసనాలను నేను అనుసరిస్తున్నాను. BSB BSB: I obey Your precepts and Your testimonies, for all my ways are before You.
169 ULB యెహోవా, నా మొర్ర నీ సన్నిధికి వస్తుంది గాక. నీ మాట చొప్పున నాకు వివేకం దయచెయ్యి. BSB BSB: May my cry come before You, O LORD; give me understanding according to Your word.
170 ULB నా విన్నపం నీ సన్నిధిని చేరనియ్యి. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపించు. BSB BSB: May my plea come before You; rescue me according to Your promise.
171 ULB నీవు నీ కట్టడలను నాకు బోధిస్తున్నావు. నా పెదాలు నీ స్తోత్రం పలుకుతాయి. BSB BSB: My lips pour forth praise, for You teach me Your statutes.
172 ULB నీ ఆజ్ఞలన్నీ న్యాయం. నీ వాక్కును గూర్చి నా నాలుక గానం చేస్తుంది. BSB BSB: My tongue sings of Your word, for all Your commandments are righteous.
173 ULB నేను నీ ఉపదేశాలను కోరుకున్నాను. నీ చెయ్యి నాకు సహాయమగు గాక. BSB BSB: May Your hand be ready to help me, for I have chosen Your precepts.
174 ULB యెహోవా, నీ రక్షణ కోసం నేను ఎంతో ఆశపడుతున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరం. BSB BSB: I long for Your salvation, O LORD, and Your law is my delight.
175 ULB నీవు నన్ను బ్రతికించు. నేను నిన్ను స్తుతిస్తాను. నీ న్యాయవిధులు నాకు సహాయాలగు గాక BSB BSB: Let me live to praise You; may Your judgments sustain me.
176 ULB తప్పిపోయిన గొర్రెలాగా నేను దారి తప్పి తిరిగాను. నీ సేవకుణ్ణి వెతికి పట్టుకో. ఎందుకంటే నేను నీ ఆజ్ఞలను విస్మరించేవాణ్ణి కాను. BSB BSB: I have strayed like a lost sheep; seek Your servant, for I have not forgotten Your commandments.
Select verses for actions: Enter goes to them and Escape comes back.